E-Paper
Advertisement

నవ వధువు దారుణ హత్య.. భార్య తల నరికి ఫ్రిజ్‌లో దాచిన హంతకుడు

నవ వధువు దారుణ హత్య.. భార్య తల నరికి ఫ్రిజ్‌లో దాచిన హంతకుడు
Advertisement

Assam wife murder case: అస్సాంలోని.. గువాహటిలో జరిగిన ఒక దారుణమైన హత్యోదంతం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కేవలం ఆరు నెలల క్రితమే ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త, భార్యపై అనుమానంతో కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ఇల్లాలిని అత్యంత దారుణంగా నరికి హతమార్చాడు. అంతటితో ఆగకుండా ఆమె తలను వేరు చేసి ఫ్రిజ్‌లో దాచాడు. ఈ ఘటన గువాహటిలోని బశిష్ఠపూర్ ప్రాంతంలో జరిగింది. హత్య అనంతరం నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకోబోయి మృతి చెందాడు

అసలు ఏం జరిగింది?

గువాహటిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో మూడో అంతస్తులో నివసించే రియా తాలుక్దర్, రమానుజ్ గోస్వామి దంపతులుగా ఆరు నెలల క్రితమే వివాహం చేసుకున్నారు. రమానుజ్ ఉబర్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా.. రియా ఒక బొటిక్‌లో ఉద్యోగం చేస్తోంది. అయితే వీరి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. రమానుజ్ తన భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నాడు. రియాకు వేరే వ్యక్తితో సంబంధం ఉందనే అనుమానంతో రగిలిపోయిన అతడు, తీవ్రమైన కోపంతో ఆమెను అత్యంత దారుణంగా హత్య చేసి, ఆమె తలను వేరు చేసి ఫ్రిజ్‌లో దాచిపెట్టాడు.

చుట్టుపక్కల వాళ్ల సమాచారంతో వెలుగులోకి..

Advertisement

ఈ దంపతుల ఫ్లాట్ నుంచి తరచూ అరుపులు, గొడవలు వినిపించేవని స్థానికులు తెలిపారు. శనివారం రోజు కూడా ఆ ఫ్లాట్ నుంచి ఒక మహిళ ఏడుస్తున్న శబ్దం గట్టిగా వినిపించింది. ఆ తర్వాత ఎలాంటి జాడ లేకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు, స్థానికులు హతిగావ్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తనిఖీ చేయగా.. ఫ్రిజ్‌లో రియా తల పోలీసులను సైతం షాక్‌కు గురిచేశారు. వెంటనే నిందితుడైన రమానుజ్ గోస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసు కస్టడీ నుంచి పరారవుతూ మృతి:

Advertisement

సోమవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో పోలీసులు నిందితుడిని బ్లడ్ టెస్ట్ కోసం హతిగావ్ నుంచి గౌహతి మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ కి తరలిస్తున్నారు. ఆ సమయంలో కాళీపాడు మీదుగా నర్కాసుర్ హిల్ వద్దకు చేరుకోగానే.. పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకోవడానికి రమానుజ్ కదులుతున్న వెహికిల్ నుంచి దూకేశాడని పోలీసులు తెలిపారు. ఈ ప్రయత్నంలో అతనికి తీవ్ర గాయాలు కావడంతో పోలీసులు వెంటనే  జీఎంసీహెచ్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకునే సరికే నిందితుడు మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు.

Related News

సుశాంత్ రాజ్ పుత్ మేనేజర్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఆదిత్య థాక్రే, రియా చక్రవర్తిపై సీబీఐ ఎఫ్‌ఐఆర్!

సీఎం డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు.. వేడెక్కిన కర్ణాటక రాజకీయాలు, పార్టీల్లో చర్చ

కుక్క పెట్టిన చిచ్చు.. లిఫ్ట్‌లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు.. వీడియో వైరల్!

రియా హత్య కేసులో.. అసలు విషయాలు తేలకుండానే, భార్యని చంపి ఫ్రిడ్జ్‌లో పెట్టి

హిట్-అండ్-రన్ ఘటన.. వుమెన్ రైడర్ని వెంటాడి కారుతో ఢీ, ఆ తర్వాత ఏం జరిగిందంటే..

కేదార్‌నాథ్ మార్గంలో భారీ వర్షాలు.. విరిగిపడిన కొండచరియలు-రాళ్లు, యాత్రకు అంతరాయం

8వ ఆసియా కప్ విజేత భారత్.. మహిళల టీమ్‌పై అమిత్ షా ప్రశంసల వర్షం!

Big Stories

Advertisement
×