E-Paper
Advertisement

కేదార్‌నాథ్ మార్గంలో భారీ వర్షాలు.. విరిగిపడిన కొండచరియలు-రాళ్లు, యాత్రకు అంతరాయం

కేదార్‌నాథ్ మార్గంలో భారీ వర్షాలు.. విరిగిపడిన కొండచరియలు-రాళ్లు, యాత్రకు అంతరాయం
Advertisement

Kedarnath: నైరుతి రుతుపవనాలు తిరోగమనం నేపథ్యంలో సెప్టెంబర్ నెల ప్రారంభం నుంచి దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఇక ఉత్తరాధి రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. ఫలితంగా ఉత్తరాఖండ్‌లోని పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. రాళ్లు పడడంతో కేదార్‌నాథ్ యాత్ర మార్గం ప్రమాదకరంగా మారింది, కాస్త అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం భద్రతా దళాలు ఈ ప్రయాణాన్ని పర్యవేక్షిస్తున్నాయి.

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు.. కేదార్‌నాథ్ మార్గంలో ఇబ్బందులు

భారీ వర్షాలకు ఉత్తరాఖండ్ వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. అంతేకాదు బండరాళ్లు కిందపడడం, కొండ చరియలు విరిగి పడుతున్నాయి. ఈ క్రమంలో కేదార్‌నాథ్ ధామ్ ట్రెకింగ్ మార్గంలోని చిర్‌బాసా ప్రాంతంలో కొండపైనుంచి రాళ్లు పడుతున్నాయి. ఆ మార్గం ద్వారా వెళ్లే యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిస్థితి గమనించిన అధికారులు, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. యాత్రికుల రాకపోకలను నియంత్రించారు. వాతావరణం మెరుగుపడి వర్షాలు తగ్గుముఖం పట్టడంతో చిర్‌బాసాలో రాళ్లు కిందకు పడడం ఆగింది. దీంతో ఆ మార్గం ద్వారా వెళ్లాల్సిన యాత్రికులకు ఒక్కొక్కరిగా గౌరీకుండ్ వైపు సురక్షితంగా తరలిస్తున్నారు అధికారులు.

విరిగిపడిన కొండచరియలు-రాళ్లు, యాత్రకు అంతరాయం

Advertisement

సోమవారం చిర్బాసా ప్రాంతంలో ఆకాశం తేలికపాటి మేఘావృతమై ఓ మాదిరి వర్షం పడుతోంది. వాతావరణం మెరుగుపడగానే యాత్రికుల రాకపోకలు పునఃప్రారంభమవుతా యని అధికారులు తెలిపారు. భద్రతా దళాల పర్యవేక్షణలో యాత్రికులను జాగ్రత్తగా తరలిస్తున్నారు. యాత్రికులు మార్గమధ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఆగవద్దని భద్రతా సిబ్బంది సూచనలు ఇచ్చారు. ఆ జిల్లా విపత్తు నిర్వహణ అధికారి నందన్ సింగ్ రాజ్వార్ మాట్లాడారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా భీంబలి నుండి గౌరీకుండ్‌కు యాత్రికులను దశల వారీగా తరలిస్తున్నట్లు తెలిపారు.

యాత్రికులను మరొక మార్గంలో తరలిస్తున్న ప్రత్యేక బృందాలు

యాత్రికుల సురక్షిత ప్రయాణాన్ని నిర్ధారించడానికి ఎస్డీఆర్ఎఫ్, డీడీఆర్ఎఫ్, వైఎంఎఫ్, ఆపద మిత్ర, పోలీసు బలగాల సహాయక బృందాలను ఆ ప్రాంతంలో మోహరించాయి. యాత్రికులకు అవసరమైన సహాయాన్ని అందిస్తూ సున్నితమైన ప్రాంతాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. చిర్బాసా ప్రాంతంలోని పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. వాతావరణంలో ఏమైనా మార్పు వస్తే పరిస్థితులకు అనుగుణంగా యాత్రికుల రాకపోకలను తక్షణం నియంత్రిస్తామని తెలిపారు.

Advertisement

ALSO READ: 8వ ఆసియా కప్ విజేత భారత్.. మహిళల టీమ్‌పై అమిత్ షా ప్రశంసల వర్షం!

Related News

హిట్-అండ్-రన్ ఘటన.. వుమెన్ రైడర్ని వెంటాడి కారుతో ఢీ, ఆ తర్వాత ఏం జరిగిందంటే..

8వ ఆసియా కప్ విజేత భారత్.. మహిళల టీమ్‌పై అమిత్ షా ప్రశంసల వర్షం!

ఢిల్లీ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. భయంతో భవనం పైనుంచి దూకిన జనం!

గుజరాత్‌లో తాగునీటి సంక్షోభం.. మోదీ జల్ జీవన్ మిషన్ పై మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు!

జైల్లోనూ మారని బుద్ధి.. ప్రజ్వల్ రేవణ్ణ ఫోన్‌లో పదుల సంఖ్యలో పో*ర్న్ వీడియోలు!

15 సార్లు అమెజాన్ ఇంటర్‌వ్యూలో ఫెయిల్.. చివరకు అదే కంపెనీలో రూ.కోట్ల జీతానికి జాబ్..

జిన్ పింగ్ రాకకు ముందు.. చైనా రాయబారి ఆసక్తికర పోస్ట్.. ఏమన్నారంటే?

Big Stories

Advertisement
×