E-Paper
Advertisement

కుక్క పెట్టిన చిచ్చు.. లిఫ్ట్‌లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు.. వీడియో వైరల్!

కుక్క పెట్టిన చిచ్చు.. లిఫ్ట్‌లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు.. వీడియో వైరల్!
Advertisement

Ghaziabad Lift Fight: ఉత్తర్ ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. నగరంలోని ఓ అపార్ట్ మెంట్ లిఫ్టు లో కుక్క విషయంలో మెుదలైన వివాదం.. పరస్పర దాడికి దారితీసింది. ఓ మహిళ ఏకంగా స్కూల్ టీచర్‌పై భౌతిక దాడికి దిగడం స్థానికంగా చర్చనీయాంశమైంది. సెప్టెంబర్ 12 మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జరిగిన దాడి తాలుకా దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

అసలేం జరిగిందంటే?

ఘజియాబాద్ ఇందిరాపురంలోని ఓ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్న హీనా బారీ.. సెప్టెంబర్ 12న పాఠశాల ముగిసిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చారు. ఫ్లాట్‌కి వెళ్లేందుకు ఆమె సొసైటీలోని లిఫ్ట్ ఎక్కేందుకు ప్రయత్నించగా అప్పటికే శ్వేతా సుబే అనే మహిళ తన పెంపుడు కుక్కతో కలిసి లిఫ్ట్‌లో ఉన్నారు. బాధితురాలి కథనం ప్రకారం.. శ్వేతా తన కుక్కను కారణంగా చూపిస్తూ ఇతరులను లిఫ్ట్‌లోకి రానివ్వకుండా అడ్డుకుంది. దీంతో హీనా ఆమెను ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య మాటమాట పెరిగి తీవ్ర వాగ్వాదానికి దారితీసింది.

Advertisement

బాహాబాహీ.. కర్రతో దాడి

వివాదం తీవ్ర రూపం దాల్చడంతో రగిలిపోయిన శ్వేతా.. తన చేతిలో ఉన్న చిన్న కర్రతో హీనాపై ఒక్కసారిగా దాడి చేసింది. ఆపై చెంపపై పలుమార్లు కొట్టింది. అటు హీనా కూడా ఎదురుదాడికి దిగడంతో ఇద్దరి మధ్య ఘర్షణ చెలరేగింది. లిఫ్ట్ బయట ఉన్న సెక్యూరిటీ గార్డ్ వెంటనే స్పందించి ఇద్దరికి సర్దిచెప్పేందుకు ప్రయత్నించాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు కావడంతో.. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Advertisement

Also Read: అంతరిక్షంలో ‘ఫుట్‌బాల్’.. బంతితో చెడుగుడు ఆడిన వ్యోమగాములు.. అదరగొట్టారు భయ్యా!

పోలీసులకు ఫిర్యాదు

ఈ దాడిపై హీనా బారీ.. నందగ్రామ్ పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించారు. తనపై దాడికి దిగిన శ్వేతా సుబేపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని సమగ్రంగా పరిశీలిస్తున్నామని విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

Also Read: ఇంట్లో కరెంట్ లేకపోయినా.. మెుబైల్ ఛార్జింగ్ పెట్టొచ్చు.. ఎలాగో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tags

Related News

సీఎం డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు.. వేడెక్కిన కర్ణాటక రాజకీయాలు, పార్టీల్లో చర్చ

రియా హత్య కేసులో.. అసలు విషయాలు తేలకుండానే, భార్యని చంపి ఫ్రిడ్జ్‌లో పెట్టి

హిట్-అండ్-రన్ ఘటన.. వుమెన్ రైడర్ని వెంటాడి కారుతో ఢీ, ఆ తర్వాత ఏం జరిగిందంటే..

కేదార్‌నాథ్ మార్గంలో భారీ వర్షాలు.. విరిగిపడిన కొండచరియలు-రాళ్లు, యాత్రకు అంతరాయం

8వ ఆసియా కప్ విజేత భారత్.. మహిళల టీమ్‌పై అమిత్ షా ప్రశంసల వర్షం!

ఢిల్లీ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. భయంతో భవనం పైనుంచి దూకిన జనం!

గుజరాత్‌లో తాగునీటి సంక్షోభం.. మోదీ జల్ జీవన్ మిషన్ పై మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు!

Big Stories

Advertisement
×