Bengal Assembly Polls: పశ్చిమ బెంగాల్ ఎన్నికల పోలింగ్ కేంద్రం ఎన్నికల కమిషన్ ఫోకస్ చేసింది. ఫల్తా అసెంబ్లీ నియోజకవర్గంలో రీపోలింగ్ నిర్వహించాలని డిసైడ్ అయ్యింది. మే 21న ఆ సీటుకు రీపోలింగ్ నిర్వహించనుంది. ఓట్ల లెక్కింపు మే 24న లెక్కిస్తారు. ఉన్నట్లుండి ఈసీ నిర్ణయం వెనుక అసలేం జరిగింది?
బెంగాల్ అసెంబ్లీ పోల్స్.. ఈసీ సంచలనం నిర్ణయం
ఏప్రిల్ 29న ఫాల్తా నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల పోలింగ్‌ను రద్దు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. అక్కడ మళ్లీ రీపోలింగ్ నిర్వహించనుంది. దీంతో ఫాల్తా నియోజకవర్గంలో 285 కేంద్రాల్లో పోలింగ్ రద్దు అయ్యింది. అక్కడ మే 21న రీ పోలింగ్ జరగనుంది. కౌంటింగ్ మాత్రం మే 24న జరగనుంది.
పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలోని నియోజకవర్గం అది. ఏప్రిల్ 29న జరిగిన పోలింగ్‌లో రాజకీయ పార్టీలకు చెందిన అనుకూల-వ్యతిరేక వర్గాలు ఈవీఎంల యూనిట్ బటన్లపై నల్ల జిగురు టేపు, పెర్ఫ్యూమ్ పూయడం, ఓటర్లను బెదిరించడం, అడ్డుకోవడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి.
ఫల్తా నియోజకవర్గంలో మే 21న రీ పోలింగ్, 24న కౌంటింగ్
పోలింగ్ కేంద్రాల లోపల రాజకీయ పార్టీ కార్యకర్తలు చట్ట విరుద్ధంగా వ్యవహరించినట్టు ఆరోపణలు గుప్పుమన్నాయి. ఈ వ్యవహారంపై రాజకీయ పార్టీల అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు అందినట్లు భారత ఎన్నికల సంఘం తెలిపింది. ఈ నేపథ్యంలో రీపోలింగ్‌కు ఆదేశాలు జారీ చేసింది.
దీనికితోడు 15 బూత్‌ల్లో తిరిగి పోలింగ్ నిర్వహించిన తర్వాత ఆ ప్రాంతంలోని టీఎంసీ కార్యకర్తల నుంచి తమకు ప్రాణహాని ఉందని ఆరోపిస్తూ గ్రామస్థులు నిరసనలకు దిగారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. బెంగాల్‌లోని 294 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 293 స్థానాలకు సంబంధించిన ఫలితాలు సోమవారం వెల్లడికానున్నాయి.
ALSO READ: 200 మంది డైవర్ల సాహసం.. సముద్ర గర్భంలో మెరిసిన మువ్వన్నెల జెండా.. అండమాన్ దీవుల గిన్నిస్ రికార్డ్
పశ్చిమ బెంగాల్‌లోని రెండు అసెంబ్లీ స్థానాలు డైమండ్ హార్బర్, మగర్‌హట్ పశ్చిమ్‌లలోని 15 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ జరిగింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతలుగా జరిగాయి. ఏప్రిల్ 23, ఏప్రిల్ 29న అంటే రెండు దశల్లో జరిగాయి. ఫల్తా అసెంబ్లీ నియోజకవర్గం తప్ప అన్ని సీట్లకు ఓట్ల లెక్కింపు మే 4న జరగనుంది. అందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.