E-Paper
Advertisement

భార్య ప్రైవేట్ పార్ట్స్ కొరికితే.. భర్త ముక్కు కొరికేశాడు, యూపీలో విచిత్రమైన ఘటన

భార్య ప్రైవేట్ పార్ట్స్ కొరికితే.. భర్త ముక్కు కొరికేశాడు, యూపీలో విచిత్రమైన ఘటన
Advertisement

Husband bites wife nose: భార్యాభర్తల మధ్య ఆవేశాలు, కోపాలు తారాస్థాయికి చేరాయి. ఫలితంగా ఒకరిపై మరొకరు పడి కొరుక్కునే విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. యూపీలో వెలుగులోకి వచ్చిన దీని వెనుక అసలు ఏం జరిగింది? ప్రస్తుతం భార్య ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.

యూపీలో షాకింగ్ ఘటన

ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయి జిల్లా కేంద్రంలో వెలుగు చూసిన విచిత్రమైన ఘటన వివరాల్లోకి వెళ్తాం. 27 ఏళ్లు సాధన- భర్త దీపక్ భార్యాభర్తలు. పెళ్లై సుమారు 10 సంవత్సరాలు అవుతోంది. ఎనిమిది, ఆరు, మూడు సంవత్సరాల వయస్సు గల ముగ్గురు పిల్లలు ఉన్నారు. తాపీగా సాగుతున్న వీరి సంసారంలోకి కొత్త వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు. ఆనాడు భార్యభర్తల మధ్య చిన్నపాటి గొడవలు పెరుగుతూ వచ్చాయి. శనివారం నాటికి అవి కాస్త తారాస్థాయికి చేరాయి.

భర్త ప్రైవేటు పార్ట్స్ కొరికిన భార్య

Advertisement

సీన్ కట్ చేస్తే.. సాధన, దీపక్ ఫ్రెండ్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. రెండున్నర నెలల కిందట అతడితో వెళ్లిపోయింది. ఇంతవరకు బాగానే జరిగింది. తన పిల్లల్ని తీసుకెళ్లడం కోసం సెప్టెంబర్ 17న దొంగచాటుగా పొరుగింటి పైకప్పు మీదుగా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడి నుంచి భార్యభర్తల మధ్య అసలు కథ మొదలైంది. సాధన తిరిగి రావడం దంపతుల మధ్య వాగ్వాదానికి దారితీసింది. దీపక్ తన తలపై దాడి చేసి, తన ముక్కును కొరికి కాలువలో పడేశాడన్నది భార్య సాధన ప్రధాన ఆరోపణ. తనపై భర్త దాడి చేసిన సమయంలో అత్తమామలు తన చేతులు గట్టిగా పట్టుకున్నారని ఆరోపించింది.

కోపంతో భార్య ముక్కు కొరికిన భర్త

ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరుపక్షాలను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. తొలుత సాధనను కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లి చికిత్స చేయించాయి. అక్కడి నుంచి తదుపరి చికిత్స కోసం హర్దోయ్ మెడికల్ కాలేజీకి తరలించారు. ఈ విషయాన్ని పోలీసులు చెప్పారు. ఇక భర్త దీపక్ విషయానికి వద్దాం. సాధన అనుకోకుండా తిరిగి వచ్చి పిల్లలను తనతో తీసుకెళ్లడానికి ప్రయత్నించిందని ఆరోపించాడు భర్త దీపక్.

Advertisement

ALSO READ: రైల్లో టికెట్ లేకుండా ప్రయాణం చేసిన మహిళ .. TTEతో వాగ్వాదం, స్వయంగా బట్టలు చించుకుని

జరిగిన గొడవలో సాధన తన భర్త ప్రైవేటు పార్ట్స్ కొరికిందని పేర్కొన్నాడు. ఆ తర్వాత నేలపై తల బాదుకుని గాయపడిందని ఆరోపించింది. సాధన ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. దీపక్ తల్లి ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. ఈ కేసులోని అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. ఆ తర్వాత ఆమె భర్త దీపక్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

 

Related News

లాల్‌బాగ్ గణేష్ మండపం వద్ద ఘోర విషాదం.. చిన్నారితో సహా ఇద్దరు భక్తులు దుర్మరణం

రైల్లో టికెట్ లేకుండా ప్రయాణం చేసిన మహిళ .. TTEతో వాగ్వాదం, స్వయంగా బట్టలు చించుకుని

మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. జలపాతంలోకి దూసుకెళ్లిన కారు, 8 మంది మృతి

భార్యకు మస్కా కొట్టి.. ప్రేయసితో మలేషియా ట్రిప్ ప్లాన్.. తీరా ఎయిర్‌పోర్టులో ఊహించని ట్విస్ట్!

దీదీకి దెబ్బ మీద దెబ్బ.. నందిగ్రామ్ తర్వాత రెజీనగర్‌లోనూ షాక్!

ఢిల్లీలో గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ సమిట్.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు!

ఐఐటీ బొంబాయిలో తీవ్ర విషాదం.. చాట్‌జీపీటీ కాపీయింగ్ రచ్చ.. విద్యార్థి ఆత్మహత్య!

Big Stories

Advertisement
×