E-Paper
Advertisement

లాల్‌బాగ్ గణేష్ మండపం వద్ద ఘోర విషాదం.. చిన్నారితో సహా ఇద్దరు భక్తులు దుర్మరణం

లాల్‌బాగ్ గణేష్ మండపం వద్ద ఘోర విషాదం.. చిన్నారితో సహా ఇద్దరు భక్తులు దుర్మరణం
Advertisement

Lalbaug Ganesh: ముంబైలో ఎంతో పవిత్రంగా, వైభవంగా జరుగుతున్న గణేష్ ఉత్సవాల్లో అనుకోని విషాదం చోటుచేసుకుంది. నగరంలోనే ఎంతో ప్రసిద్ధి చెందిన లాల్‌బాగ్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున ఒక గణపతి పండాల్ సమీపంలో విద్యుత్ షాక్ కొట్టడంతో ఇద్దరు భక్తులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ఎనిమిదేళ్ల చిన్నారి కూడా ఉండటం అందరినీ తీవ్రంగా కలచివేస్తోంది.

అసలేం జరిగింది?

Advertisement

కాలాచౌకి ప్రాంతంలోని పండాల్ వద్ద ఉదయాన్నే లంబోదరుడి దర్శనం కోసం భక్తులు భారీగా గుమిగూడారు. స్వామివారిని దర్శించుకోవాలనే ఉత్సాహంలో క్యూలైన్లలో వేచి ఉన్న సమయంలో ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. పండాల్ ప్రాంగణంలో ఉన్న విద్యుత్ వైర్ల నుండి అకస్మాత్తుగా కరెంట్ సరఫరా కావడంతో ఈ ప్రమాదం సంభవించిందని సమాచారం. విద్యుదాఘాతానికి గురై ఇద్దరు మృతి చెందడమే కాకుండా, మరో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

Also Read: మేడిగడ్డ సీక్రెట్ రిపోర్ట్ నా దగ్గరుంది.. బాంబు పేల్చిన మాజీ మంత్రి హరీశ్ రావు!

Advertisement

పోలీసుల విచారణ

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు తెలుసుకోవడానికి, పండాల్ వద్ద వైరింగ్ ఏర్పాటు చేసిన నిర్వాహకుల వైఫల్యం ఏమైనా ఉందా అనే కోణంలో బాధితుల వివరాలను సేకరిస్తున్నారు. పండుగ వేళ లాల్‌బాగ్ వంటి ప్రసిద్ధ ప్రాంతంలో ఈ ఘోరం జరగడంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Tags

Related News

భార్య ప్రైవేట్ పార్ట్స్ కొరికితే.. భర్త ముక్కు కొరికేశాడు, యూపీలో విచిత్రమైన ఘటన

రైల్లో టికెట్ లేకుండా ప్రయాణం చేసిన మహిళ .. TTEతో వాగ్వాదం, స్వయంగా బట్టలు చించుకుని

మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. జలపాతంలోకి దూసుకెళ్లిన కారు, 8 మంది మృతి

భార్యకు మస్కా కొట్టి.. ప్రేయసితో మలేషియా ట్రిప్ ప్లాన్.. తీరా ఎయిర్‌పోర్టులో ఊహించని ట్విస్ట్!

దీదీకి దెబ్బ మీద దెబ్బ.. నందిగ్రామ్ తర్వాత రెజీనగర్‌లోనూ షాక్!

ఢిల్లీలో గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ సమిట్.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు!

ఐఐటీ బొంబాయిలో తీవ్ర విషాదం.. చాట్‌జీపీటీ కాపీయింగ్ రచ్చ.. విద్యార్థి ఆత్మహత్య!

Big Stories

Advertisement
×