PM KMY Pension Scheme: కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు రకరకాల పథకాలు ప్రవేశపెట్టింది. గడిచిన పుష్కరకాలంగా ఆ పథకాలు నడుస్తున్నాయి. దీంతో అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటున్నారు. మరో విషయం ఏంటంటే.. వృద్ధాప్యంలో రైతులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు పెన్షన్ స్కీమ్ ఏర్పాటు చేసింది. ఇప్పుడు దాని వివరాలు తెలుసుకుందాం.
రైతులకు రకరకాల పథకాలను ప్రవేశపెట్టింది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం. గడిచిన దశాబ్దం పైగా పథకాలు కంటిన్యూ అవుతున్నాయి. మరి కొన్నింటిని పొడిగించారు కూడా. దీంతో రైతులకు నమ్మకం ఏర్పడింది. ఆ పథకాల గురించి నిత్యం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వాటిలో ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన పథకం ఒకటి.
ఈ పథకం ఉద్దేశం ఏంటి? రైతులకు ఏ విధంగా పని చేస్తుంది? ఇదే అసలు ప్రశ్న. ఈ స్కీమ్‌లో 60 ఏళ్ల వయస్సు నిండిన రైతులకు ప్రతి నెలా రూ.3,000 చొప్పున పెన్షన్ వస్తుంది. 18 నుంచి 40 ఏళ్లు వయస్సు ఉన్నవారు. గరిష్టంగా 2 హెక్టార్లు సాగుభూమి ఉన్న రైతులు అర్హులు. పథకంలో చేరిన నుంచి రైతులు నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు తమవంతు చెల్లించాలి.
60 ఏళ్లు దాటిన తర్వాత నెల నెలా రూ.3 వేలు పెన్షన్ పొందాలనుకునేవారికి ఎంతో మేలు చేస్తుంది.అర్హతకు సంబంధించిన భూమి రికార్డులు ఉండాలి. అలాగే బ్యాంక్ ఖాతా, ఆధార్ వంటి అవసరమైన వివరాలు సమర్పించాలి. చిన్న వయస్సులో ఈ పథంలోకి చేరితే నెల వారీ చందా తక్కువగా ఉంటుంది. అదే కాస్త వయస్సు పెరిగిన తర్వాత జాయిన్ అయితే చెల్సించాల్సిన కాస్త పెరుగుతుంది.