Maharashtra: సమయం, సందర్భం వచ్చినప్పుడు కొత్త అల్లుళ్లకు అత్తింటివారు వెరైటీ గిఫ్ట్‌లు ఇస్తుంటారు. సంక్రాంతి వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో కొందరు అత్తింటివారు రుచికరమైన వందలాది వంటకాలు చేసి పెడుతుంటారు. అల్లుడ్ని శాంతి పరిచితే కూతురు కాపురం బాగుంటుందని నమ్ముతారు. ఏకంగా అల్లుడికి కిలోన్నర వెండి చెప్పులు ఇచ్చారు అత్తింటివారు. నమ్మడానికి విచిత్రంగా ముమ్మాటికీ నిజం.
మహారాష్ట్రలో అత్తింటివారు తమ అల్లుడికి ఊహించని కానుక
మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో అత్తింటివారు తమ అల్లుడికి ప్రత్యేకమైన గిఫ్ట్ ఇచ్చారు. వెండితో కొల్హాపూరి చప్పల్స్ తయారు చేయించారు. హిందువుల క్యాలెండర్ ప్రకారం.. అధిక మాసంలో వినూత్న కానుకను అల్లుడికి సిద్ధం చేయించారు. నార్మల్‌గా అయితే అధిక మాసంలో కొన్ని ప్రాంతాలవారు అల్లుళ్లకు బహుమతులు ఇవ్వడం మనం చూస్తూ ఉంటాము. మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో అలాంటి ఆనవాయితీ ఉంది.
కొల్హాపూర్‌లోని ప్రతిభా నగర్‌కు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఈ చెప్పులను తయారు చేశాడు. సాంగ్లీకి చెందిన ఓ నగల వ్యాపారి ఈ ఆర్డర్ ఇచ్చినట్టు చెప్పాడు. రెండుదశాబ్దాలుగా తాను వెండి వస్తువులను తయారు చేస్తున్నారని, కాకపోతే చెప్పులు తయారు చేయడం తనకు ఇదే తొలిసారిని వెల్లడించాడు. వెండి చెప్పుల తయారీ కోసం 95 శాతం వెండిని ఉపయోగించారు.
కిలోన్నర వెండి చెప్పులు.. వేసుకుంటారా – దాచుకుంటాడా?
అవి విరిగిపోకుండా ఉండటానికి క్యాడ్మియం అనే రసాయనం కలిపాడు. తయారు చేసిన వెండి చెప్పులను షో కేస్‌లో పెట్టుకోవడమేకాదు చెప్పుల్లా మాదిరిగా వినియోగించుకోవచ్చు. తోలు చెప్పులను కొని ఆ డిజైన్ చేసిన తర్వాత వీటిని తయారు చేశారు విక్రాంత్ అనే వ్యక్తి. వీటిని తయారు చేయడానికి దాదాపుగా 9 రోజులు పట్టిందని చెబుతున్నాడు.
ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి నుంచి తయారు చేసినందుకు అక్షరాలా రూ.22 వేలు తీసుకున్నాడు. చెప్పుల లగ్జరీ బ్రాండ్లలో కొల్హాపూరి చెప్పులకు తిరుగులేదు. ధరలు కూడా ఆ రేంజ్‌లో ఉంటాయి. మన్నిక కూడా అలాగే ఉంటుంది. అత్తింటివారు తమ అల్లుడికి రూ.4.25 లక్షలు ఖర్చు చేసి వెండి చెప్పులు రెడీ చేశారు.
ALSO READ: సోషల్ మీడియాను చుట్టేస్తోంది.. కాక్రోచ్ జనతా పార్టీ, కేవలం మూడు రోజుల్లో లక్ష మంది, సెగ ఎవరికి?
ఇక విక్రాంత్ గతంలో వెరైటీ వస్తువులు తయారు చేశాడు. కత్తులు, బ్యాట్, బాల్, వాటర్ కంటైనర్లు వంటివి వెండితో తయారు చేసిన అనుభవం అతడి సొంతం. అసలే బంగారం, మార్కెట్లో వెండి ధరలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఇలాంటి సమయంలో అల్లుడికి వెండితో చేసిన చెప్పులు ఇవ్వనున్నారు అత్తింటివారు. మొత్తానికి ఈసారి ఆ ఇంట అల్లుడికి పంట పడినట్టే?