CI Controversy: స్వేచ్ఛ బ్యూరో: భర్తపై ఫిర్యాదుకు వచ్చిన మహిళను లోబర్చుకున్న ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న సీఐ రాజు నాయక్ పెళ్లి పేరుతో గర్భవతిని చేసి, బలవంతంగా అబార్షన్ చేయించిన వైనం ఖమ్మంలో హాట్ టాపిక్ అయింది. బాధితురాలి ఫిర్యాదుతో సీఐ పై కేసు నమోద చేశారు. ముందస్తు బెయిల్ మంజూరైంది. విచారణలో ఆరోపణలు నిజమేనని తేలడంతో సి.ఐ ను డీజీపీ ఆఫీస్‌కు అటాచ్ చేశారు. 2023లో ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్‌లో రాజు నాయక్ సీఐగా ఉండగా ఓ మహిళ తన భర్త వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు నుంచి ఫోన్ నంబర్ తీసుకున్న సీఐ, న్యాయం చేస్తానని నమ్మించి తరచూ ఫోన్లు, మెసేజ్‌లు చేయడం ప్రారంభించాడు. అనంతరం పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఆమెను లోబర్చుకున్నాడు.
ఈ క్రమంలో బాధితురాలు గర్భం దాల్చడంతో తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. అయితే, సీఐ ఆమెకు బలవంతంగా కొన్ని ట్యాబ్లెట్లు మింగించడంతో గర్భస్రావం అయిందని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత కూడా పెళ్లి విషయాన్ని దాటవేస్తుండటంతో విసిగిపోయిన ఆమె ఈ నెల 7న ఖమ్మం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సి.ఐ పై కేసు నమోదు కావడంతో సీఐ రాజు నాయక్ పరారీలోకి వెళ్లి, ఇటీవల ముందస్తు బెయిల్ పొందినట్లు సమాచారం. మరోవైపు, ఈ ఘటనపై జరిగిన అంతర్గత విచారణలో సీఐ వేధింపులకు పాల్పడినట్లు తేలడంతో ఉన్నతాధికా రులు అతడిని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. బాధితురాలికి ఇటీవలే ఆమె భర్త నుంచి కోర్టు ద్వారా విడాకులు మంజూరయ్యాయి. ఆమెకు విడాకులు ఇప్పించేందుకు సీఐ రాజు నాయక్ ఆమె భర్తపై ఒత్తిడి తెచ్చినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.
2013 – 2014 మధ్య కాలంలో ఖమ్మం మహిళా పి.ఎస్. లో ఎస్.హెచ్.ఓ గా పనిచేసిన సమయంలో ప్రైవేటు సైన్యాన్ని పెట్టుకుని మరీ అప్పటి ప్రభుత్వ పెద్దల అండదండలతో అరాచకాలు సృష్టించిన సీ.ఐ. భూక్యా రాజు నాయక్ లీలలు ఒక్కొక్కటిగా బైటపడుతున్నాయి. గతంలో ఈయన ఉమన్ పీ.ఎస్.లో పెట్టుకున్న బ్రోకర్ల సహాయంతో నమోదు చేసిన ఫేక్ ఎఫ్.ఐ.ఆర్. కేసులన్నీంటి పై రీ ఎంక్వయిరీ చేయించాలని బాధితులు డిజిపికి ఫిర్యాదు చేశారు. కొందరు నాయక్ లనబడే వారితో పాటు లీగల్ అసోసియేట్స్ బ్రోకర్లను ప్రైవేటు సైన్యంగా పెట్టు కుని రాజు నాయక్ చేసిన ఫేక్ కేసుల దందా అంతటి పై దర్యాప్తు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.
Also read: కల్వకుంట్ల కవిత సరికొత్త పొలిటికల్ స్కెచ్.. నేటి నుంచి పర్యటన..!
ఖమ్మం కమిషనరేట్‌లో పనిచేస్తున్న సీ.ఐ భూక్యా రాజు నాయక్ అనే పోలీస్ అధికారి, గతంలో ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్ కు ఎస్.హెచ్ .ఓ. గా పని చేసిన సమయంలో పలు అక్రమాలకు పాల్పడ్డాడని పలు ఫేక్ ఎఫ్.ఐ.ఆర్‌ల ద్వారా బహిర్గతం అయిందని బాధితులు వాపోతున్నారు. ఈ యన లీలల్లో ప్రధానంగా భార్య – భర్తల మనస్పర్ధల మధ్య మహిళా పోలీస్ స్టేషన్ మెట్లెక్కి ఫిర్యాదులు చేసుకున్న తర్వాత రాజీ పడ్డ కేసుల్లో, భార్యలకు ఫోన్ ద్వారా స్టేషన్ కు పిలిపించి మాయమాటలు చెప్పి పెద్ద ఎత్తున డబ్బులు ఇప్పిస్తానని నమ్మబలుకుతూ, తాను ఏర్పాటు చేసుకున్న (బ్రోకర్ లు)లీగల్ అసోసియేట్స్ పేరిట మహిళాపోలీస్ స్టేషన్ లో మధ్య దళారిను సీన్‌లో ఎంటర్ చేస్తాడు. బ్రోకరిజం పనులు చేసే 420 బ్రోకర్ల ద్వారా తప్పు డు ఫిర్యాదులు, దొంగ అవిడెన్స్ లు పెట్టించి భర్త లను బ్లాక్ మెయిల్ చేయడం ఈయనకు వెన్నతో పెట్టిన విద్య.
ఈ సిండికేట్ బెదిరింపులకు భయపడ్డ బాధితులు సదరు మహిళా పి.ఎస్. ఎస్. హెచ్.ఓ. లేదా లీగల్ అసోసియేట్స్ కు పెద్ద మెత్తంలో డబ్బులు ముట్ట జెప్పి కేసుల నుండి బైటపడేలా చక్రవ్యూహం పన్నేవారని పలువురు వాపోతున్నారు. లేకుంటే రాజు నాయక్ పెట్టుకున్న లీగల్ అసోసియేట్స్ బ్రోకర్లు తమ వద్ద ఉండే సొంత వ్యక్తుల పేర్లతో తప్పుడు అవిడెన్స్‌లు పెట్టించి మరీ డబ్బు కోసం కేసుల బెదిరింపులకు దిగడం కేసులు నమోదు చేయడం వంటి చర్యలతో భయబ్రాంతులకు గురి చేస్తారని బాధితులు తెలిపారు. మరోవైపు ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసినప్పటికీ ఛార్జ్ షీట్ వేయకుండా నెలలతరబడి బెదిరింపులకు పాల్పడి వసూళ్ల కు పాల్పడే ముఠాను (ప్రైవేటు సైన్యాన్ని)సదరు ఎస్.హెచ్.ఓ. ఏర్పాటు చేయడం గమనార్హం. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే తనతో చనువుగా ఉండే మహిళ దొరికితే చాలు ఆమె చేసే పైరవీ సక్సెస్ అయినట్టేనని సదరు మహిళా పి.ఎస్.సి.ఐ. రాజు నాయక్ పై బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు.
Also read: వచ్చే నెలలో బంజారా జోడో ఏక్తా భారత్ యాత్ర: రవింద్ర నాయక్!
ఈయన మహిళా పి.ఎస్.ఎస్.హెచ్.ఓ ఉన్న సమయంలో అమాయకంగా బలైన పలువురు నిర్ధోషులకు ఇకనైనా విమూక్తి కల్పించాలని, రాజ నాయక్ నమోదు చేసిన తప్పుడు కేసుల్నీ పునర్ విచారించాలని డిజిపి కి ఫిర్యాదులు చేస్తున్నారు. ఈయన హయాంలో మహిళకు న్యాయం పేరిట చేసిన దగా నిర్వాకాలు ఒక్కొక్కటి గా బైట పడుతున్నాయి. తాను పన్నిన వలలో చిక్కకుండా, నిర్ధోషులుగా నిరూపించు కునేందుకు అన్ని ఆధారాలు, రుజువులు ఉన్నప్పటికీ ఉమన్ పోలీస్ స్టేషన్ లో దొంగ కట్టుకధలు సృష్టించి కేసులు కట్టి, దొంగ ఎఫ్.ఐ.ఆర్‌లు నమోదు చేసిన సదరు సి.ఐ. రాజు నాయక్ తాను ఉమన్ పీ.ఎస్. నుండి బదిలీ అయి వెళ్లేంత వరకు కూడా కొన్ని తప్పుడు కేసుల్లో నిందితులుగా చెప్పబడే వారిని కనీసం స్టేషన్‌కు పిలవడం గానీ కౌన్సిలింగులు నిర్వహించడం వంటి చర్యలు ఏమీ లేకుండా నేరుగా ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసే నయా పోలీసింగ్ ఈయనదని చెప్పవచ్చు.
నేరుగా ఎఫ్.ఐ.ఆర్. లు నమోదు చేయడం, మహిళ పెట్టిన కేసు పేరిట బ్లాక్ మెయిల్ చేయడం ఈయన విధానం. నిర్ధోషులైన పలువురు భర్తలపై 498 A, కేసులు నమోదు చేసి, దాదాపు ఏడాది పాటు వారి పై ఉమన్ పీఎస్ లో కేసుందన్న సంగతి కూడా తెలియకుండా జాగ్రత్త లు తీసుకుని, ఏడాది తరువాత ఒకే సారి లీగల్ అసోసియేట్స్ బ్రోకర్‌ల ద్వారా డబ్బుల కోసం టార్చర్ పెట్టడంలో దిట్టగా పేరొందారు. సదరు ఉమన్ పీ.ఎస్.ఎస్. హెచ్.ఓ. రాజు నాయక్. టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఈయన ఉమన్ పీ.ఎస్‌లో పని చేసినటైం బాగోతాలపై సమగ్రంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పలువురు బాధితులు కోరుతున్నారు. మరోవైపు తాజాగా వెలుగులోకి వచ్చిన ఘటనలో, మహిళా పిఎస్‌లో అధికారిగా ఈయన గుట్టుగా సాగించిన బండారం బట్టబయలైంది.
Also Read: రాత్రి పూట ఇళ్ల ముందు బైక్‌లు ఆపుతున్నారా..? అయితే బీ కేర్‌ఫుల్!