BigTV English
Advertisement

Heroines Photos in Tomato Crop: టమాటా పొలంలో హీరోయిన్ల ఫొటోలు.. రేటు బాగా పెరిగిందంటూ..

Heroines Photos in Tomato Crop: టమాటా పొలంలో హీరోయిన్ల ఫొటోలు.. రేటు బాగా పెరిగిందంటూ..

Heroines Photos in Tomato Crop: పొలాల్లో దిష్టిబొమ్మలు ఉండడం సాధారణం. ఆ దిష్టిబొమ్మలున్న పొలాలను దూరం నుంచి చూస్తే ఎంతో కనువిందు చేస్తాయి. అయితే, వాటి వెనుక ఓ రీజన్ ఉంటుంది. అదేమంటే.. పక్షలు, జంతువులు, కీటకాలు తమ పొంట పొలాలను నాశనం చేయకుండా వాటిని పొలాల్లో ఏర్పాటు చేసి, కాపాడుకుంటారు రైతులు. ఆ విధంగా చేయడం రైతుకు చాలా అవసరం ఉంటుంది. అచ్చం మనిషి వలే దిష్టిబొమ్మలను తయారు చేస్తారు. దీంతో పక్షులు, జంతువులు పొలంలో ఎవరో ఉన్నారనుకునే అటువైపు రావాలంటే భయపడుతాయి. కొంతమంది వ్యక్తులు కూడా కావాలని పంట పొలాలను నాశనం చేస్తుంటారు.


అయితే, వీటిని చూసి వారు కూడా భయపడుతుంటారు. ఎవరో ఉన్నారన్న ధ్యాస వాళ్లలో ఏర్పడుతుంది. అందుకే పంట పొలాల్లో విరివిగా వీటిని ఏర్పాటు చేస్తారు. దీంతో పంట నష్టం వాటిళ్లకుండా చూసుకుంటారు. కొందరైతే పులి, సింహం లాంటి జంతువుల ఫొటోలను కూడా ఏర్పాటు చేస్తుంటారు.

కానీ, ఓ కర్ణాటక రైతు వినూత్నంగా ఆలోచించాడు. అతను టమాటాను పండిస్తున్నాడు. స్థానికంగా టమటాకు డిమాండ్ ఉండడంతో రేటు భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో తన టమాటా పంటకు ఎక్కడ దిష్టి తలుగుతుందోనని విచిత్రింగా ఆలోచించాడు. తను అనుకున్న విధంగా చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఈ అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా కోడై కూస్తోంది. నెట్టింట తెగ వైరల్ అవుతోంది.


Also Read: కార్గో షిప్పులో భారీ అగ్ని ప్రమాదం.. 3 అగ్నిమాపక షిప్పులతో చర్యలు.. గోవా తీర సమీపంలో ఘటన

కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబళ్లాపురం జిల్లా శిడ్లఘట్ట తాలూకా హండిగనాళ గ్రామంలో దీపక్ అనే ఓ యువ రైతు ఉన్నాడు. అతను ఇటీవలే 5 ఎకరాలలో టమాటా పంటను సాగు చేశాడు. ఇప్పుడు ఆ టమాటా రేటు భారీగా పెరిగింది. ఆ టమాటా పంటకు దిష్టీ తగులుతుందేమోనని భావించిన దీపక్.. నర దృష్టిని మళ్లించేందుకు ఒక ఉపాయం పన్నాడు. బాలీవుడ్ నటి సన్నీ లియోన్, కన్నడ నటి రచితా రామ్ బ్యానర్లను టమాటా తోటలో ఏర్పాటు చేశాడు. అటుగా వెళ్తున్నవారు ఈ అందాల భామల ఫొటోలను చూసి ఆశ్చర్యపోతున్నారు. దీంతో తన పంటకు ఎలాంటి నష్టం వాటిల్లదంటూ ఆ రైతు నమ్ముతున్నాడు. నెట్టింట ఈ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్స్ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

Tags

Related News

Delhi Air Pollution: వాయు కాలుష్యంతో దిల్లీ ఉక్కిరిబిక్కిరి.. సాయం చేసేందుకు ముందుకొచ్చిన చైనా

TVK Vijay: ఒంటరిగానే బరిలోకి టీవీకే.. సీఎం అభ్యర్థిగా హీరో విజయ్

UP Minor Girl: ఫాలోవర్స్ పెంచుకునేందుకు హిందూ దేవుళ్లపై చీప్ కామెంట్స్, టీనేజర్ తోపాటు పేరెంట్స్ అరెస్ట్!

Delhi Politics: ఓట్‌ చోరీపై కొత్త బాంబు పేల్చిన రాహుల్‌గాంధీ.. బ్రెజిల్‌ మోడల్‌‌కు ఓటు హక్కు, హవ్వా

Train Accident: రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకుల మీదకు దూసుకెళ్లిన రైలు.. ఆరుగురు స్పాట్ డెడ్

Philippines: ఫిలిప్పీన్స్‌లో తుఫాను బీభత్సం.. 40 మందికి పైగా మృతి..

Muzaffarnagar: కళాశాల విద్యార్థినులకు వేధింపులు.. యూపీ పోలీసుల స్పెషల్ ట్రీట్‌మెంట్

Train Collides: ఘోర రైలు ప్రమాదం.. రెండు రైళ్లు ఢీకొని 10 మంది మృతి, పలువురికి గాయాలు

Big Stories

×