Trisha: ఒకప్పుడు టాలీవుడ్‌ను ఏలిన అందాల రాక్షసి త్రిష కృష్ణన్. ఏన్నో ఏళ్లు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగింది.

వర్షం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ అందాల ముద్దుగుమ్మ ఆ తర్వాత బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి అదరగొట్టేసింది.

చిరంజీవి, ప్రభాస్, ఎన్టీఆర్, నాగార్జున, బాలకృష్ణ, రవితేజ, మహేశ్ బాబు వంటి స్టార్ హీరోల సరసన హీరోయిన్‌గా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.

అయితే ఏమైందో ఏమో కానీ ఉన్నట్టుండి సడెన్‌గా సినిమాలకు బ్రేక్ ఇచ్చి కనుమరుగైంది.

అయితే రీసెంట్‌గా మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. పొన్నియన్ సెల్వన్ సినిమాతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది.

ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకుంది.

ప్రస్తుతం నాలుగు పదుల వయసులోనూ అందంలో ఏ మాత్రం వన్నెతగ్గకుండా మెయింటైన్ చేస్తుంది.

ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.

అందులో మెగాస్టార్ చిరంజీవితో ‘విశ్వంభర’ సినిమాలో నటిస్తుంది. వీరిద్దరూ దాదాపు 18 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి నటిస్తున్నారు.

అలాగే కమల్ హాసన్ నటిస్తున్న కొత్త సినిమా ‘థగ్ లైఫ్’లోనూ ఛాన్స్ కొట్టేసింది.

దీంతోపాటు మరోస్టార్ హీరో అజిత్ నటిస్తున్న ‘విడాముయార్చి’ సినిమా హీరోయిన్‌గా నటిస్తుంది.

తాజాగా ఈ మూవీ నుంచి త్రిష ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇలా సెకండ్ ఇన్నింగ్స్‌లో త్రిష వరుస సినిమాలను లైన్‌లో పెట్టడం గమనార్హం అనే చెప్పాలి.