E-Paper
Advertisement

Nirmala Sitharaman : రామనీలం చీరతో బడ్జెట్ ప్రసంగం.. కారణమిదేనా..?

Nirmala Sitharaman : బడ్జెట్‌ ప్రవేశపెట్టే రోజు ధరించే చీరల విషయంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకుంటారు. గతంలో ఐదుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఇదే సంప్రదాయాన్ని అనుసరించారు.

Nirmala Sitharaman : రామనీలం చీరతో బడ్జెట్ ప్రసంగం.. కారణమిదేనా..?
Advertisement

Nirmala Sitharaman : బడ్జెట్‌ ప్రవేశపెట్టే రోజు ధరించే చీరల విషయంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకుంటారు. గతంలో ఐదుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఇదే సంప్రదాయాన్ని అనుసరించారు. ఈ ఏడాది కూడా వస్త్రధారణ విషయంలో తన ప్రత్యేకతను చాటుకున్నారు. నీలంరంగు చీరను నిర్మలమ్మ ధరించారు. ఇది టస్సర్ పట్టు చేనేత చీర. గోధుమ రంగులో ఉన్న ఎంబ్రాయిడరీ ఈ చీరకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శారీ నీలివర్ణంలో ఉంది. దీనిని తమిళనాడులో రామ నీలంగా పేర్కొంటారు.

ఇటీవల అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం జరిగింది. బాలక్ రామ్ ప్రాణప్రతిష్ఠను అంగరంగవైభవంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే నిర్మలాసీతారామన్ రామనీలం రంగు చీరను ధరించారని తెలుస్తోంది. బెంగాలీ, తమిళనాడు సంప్రదాయాలను కలిసిన చీరతో ఆమె మరోసారి ప్రత్యేకత చాటుకున్నారు.

Advertisement

2019లో ఆర్థికమంత్రిగా నిర్మలా సీతారామన్ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఆమె చేనేత చీరలే ధరిస్తున్నారు. ఆ శారీలపై తనకున్న మక్కువను గతంలో వివరించారు. సిల్క్‌, కాటన్ ఏదైనా కానీ.. ఒడిశా చేనేత చీరలు తనకిష్టమైనవిగా పేర్కొన్నారు. రంగు, నేత, ఆకృతి బాగుంటాయని చెప్పుకొచ్చారు.

2019లో బడ్జెట్ ప్రసంగం సమయంలో మంగళగిరి గులాబీ రంగు చీరను నిర్మలా సీతారామన్ ధరించారు. అదే సమయంలో సూట్ ‌కేస్‌ లో బడ్జెట్ పత్రాలు తెచ్చే సంస్కృతికి స్వస్తి చెప్పారు. బడ్జెట్ పత్రాల తీసుకొచ్చేందుకు బహీ ఖాతాను వాడారు.

Advertisement

2020లో బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో నీలం రంగు అంచులో పసుపుపచ్చ-బంగారు వర్ణంలో ఉన్న చీర కట్టును నిర్మలా సీతారామన్ కట్టుకున్నారు. ఈ వర్ణం శ్రేయస్సు, సమృద్ధిని సూచిస్తుందంటారు. ఆస్పిరేషనల్‌ ఇండియా థీమ్‌కు అనుగుణంగా అప్పట్లో ఈ చీరను ధరించారు.

2021లో ఎరుపు-గోధుమ రంగు కలిసిన భూదాన్‌ పోచంపల్లి చీరను నిర్మలా సీతారామన్ ధరించారు. తెలంగాణలోని పోచంపల్లిని సిల్క్‌ సిటీ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు.

2022లో ఇది ఒడిశాకు చెందిన మెరూన్‌ రంగు చేనేత శారీని ఆమె ధరించారు. ఈ చీర నిరాడంబరతకు నిదర్శమంటారు.

2023లో టెంపుల్‌ బోర్డర్లతో బ్రౌన్‌ రంగులో ఉన్న ఎరుపు చీరతో బడ్జెట్ ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. ఇలా బడ్జెట్ ప్రసంగం వేళ ఆర్థికమంత్రికి తన వస్త్రధారణతోనూ ప్రత్యేకతను చాటుకున్నారు.

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Ninnu kori Serial Today Episode October 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను  శ్రీజ మర్చిపోతుందా..? – మదన్ ప్లాన్ సక్సెస్ అవుతుందా..?    

Big Stories

Advertisement
×