E-Paper
Advertisement

Car: కదులుతున్న కారులో అత్యాచారం.. పార్క్ నుంచి యువతిని ఎత్తుకెళ్లి..

Car: కదులుతున్న కారులో అత్యాచారం.. పార్క్ నుంచి యువతిని ఎత్తుకెళ్లి..
Advertisement

Car: స్నేహితుడితో బయటకు వెళ్లడమే ఆమె చేసిన పాపం. నలుగురు కామాంధుల చేతిలో బలికావాల్సి వచ్చింది. కారులో చిత్రహింసలకు గురికావాల్సి వచ్చింది. నరకం అనుభవించాల్సి వచ్చింది. కర్ణాటకలో జరిగింది ఈ దారుణమైన ఘటన.

బెంగళూరుకు చెందిన 19 ఏళ్ల యువతి స్నేహితుడితో కలిసి పార్క్‌కు వెళ్లింది. సమయం రాత్రి 9.30 గంటలు కావడంతో అంతా చీకటిగా ఉంది. చుట్టూ ఒక్క పురుగు కూడా లేదు. అదే సమయంలో నలుగురు కామాంధులు వారి వద్దకు వచ్చారు. మద్యం మత్తులో దుర్భాషలాడారు. యువతిపై ఇష్టం వచ్చినట్లుగా చేయి వేశారు. యువకుడు అడ్డుకోవడంతో అతడిని బెదిరిస్తూ చితకబాదారు. బలవంతంగా యువతిని కారులో ఎక్కించుకున్నారు.

Advertisement

కదులున్న కారులోనే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. దోమ్లూర్, ఇందిరానగర్, అనేకల్, నైస్‌‌రోడ్‌లో ప్రయాణిస్తూ కారులో యువతిని చిత్ర హింసలకు గురి చేశారు. మరునాడు తెల్లవారు జామున ఉదయం 4 గంటల సమయంలో యువతి ఇంటి దగ్గర్లో వదిలేశారు. పోలీసులకు చెబితే చంపేస్తామని హెచ్చరించారు.

అయితే యువతి ఇంటికి వెళ్లగానే జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వాళ్లు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. యువతి చెప్పిన వివరాల ఆధారంగా గంటల వ్యవధిలోనే నిందితులను పట్టుకున్నారు.

Advertisement

నిందితులు విజయ్, శ్రీధర్, కిరణ్, సతీష్‌లుగా గుర్తించారు. వారంతా స్థానింగా ఉండే చిన్న కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేశామని త్వరలోనే కోర్టులో ప్రవేశ పెడుతామని వెల్లడించారు.

Tags

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×