Modi – Meloni: భారత ప్రధాని నరేంద్ర మోదీ 76వ జన్మదినం సందర్భంగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోని శుభాకాంక్షలు తెలిపారు. గురువారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రధాని మోదీని ఉద్దేశించి ఆమె ఒక ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
జార్జియా మెలోని ఎక్స్ పోస్ట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నా మిత్రుడు నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు. ఆయనకు ఆయురారోగ్యాలు, నిరంతర శక్తి, మరెన్నో విజయాలు చేకూరాలని కోరుకుంటున్నాను’ అని మలోని తన సందేశంలో పేర్కొన్నారు. భారత్, ఇటలీల మధ్య ఉన్న స్నేహబంధం మరింత బలపడుతోందని మలోని అన్నారు. ఇరు దేశాల అభివృద్ధి, సమృద్ధి కోసం భారత్ – ఇటలీ భాగస్వామ్యం ఇకపైనా ఇలాగే కొనసాగుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
Buon compleanno al mio amico @narendramodi, a cui auguro salute, energia e successo.
Italia e India continuano a rafforzare il loro profondo legame di amicizia, costruendo insieme un futuro di cooperazione e prosperità per le nostre Nazioni.— Giorgia Meloni (@GiorgiaMeloni) September 17, 2026
ఐదు దేశాల పర్యటనలో భాగంగా ఈ ఏడాది మేలో ప్రధాని మోదీ ఇటలీకి వెళ్లారు. రోమ్‌లోని విల్లా పాంఫిలీలో మెలోనితో భేటి అయ్యారు. ఈ భేటీలో వాణిజ్యం, రక్షణ, ఇంధనం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలపై ఇరువురు నేతలు చర్చించారు. తద్వారా ఇరు దేశాల మధ్య అప్పటివరకూ ఉన్న సాధారణ బంధాన్ని.. ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి తీసుకెళ్లారు. రక్షణ ఉత్పత్తుల రూపకల్పన, తయారీలో కలిసి పనిచేసేందుకు జాయింట్ డిక్లరేషన్‌పై మోదీ, మలోనిసంతకాలు చేశారు. అంతేకాకుండా 2027ను ‘భారత్ – ఇటలీ సంస్కృతి, పర్యాటక సంవత్సరం’గా నిర్వహించాలని తీర్మానించారు.
Also Read: వినూత్న నిరసన.. అధికారి టేబుల్‌పై వీధి కుక్క.. 8 రోజుల డెడ్ లైన్!
కాగా, ఇటలీ ప్రధాని మలోనితో పాటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తదితర ప్రపంచ నేతలు కూడా ప్రధాని మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా, పోస్ట్ వార్ తర్వాత సుదీర్ఘకాలం ఇటలీ ప్రధానిగా పనిచేసిన నాయకురాలిగా నిలిచిన జార్జియా మెలోనికి ప్రధాని మోదీ ఇటీవలే అభినందనలు తెలిపారు. ఇరు దేశాల సంబంధాలను బలోపేతం చేయడంలో ఆమె చూపుతున్న చొరవను కొనియాడారు.
Also Read: రూ.1500లోపు అదిరిపోయే ఇయర్ బడ్స్..ఆఫర్ అంటే ఇలా ఉండాలి