E-Paper
Advertisement

ఓటిటిలోకి అగధ స్ట్రిమింగ్ ఎప్పటినుంచంటే..?

ఓటిటిలోకి అగధ స్ట్రిమింగ్ ఎప్పటినుంచంటే..?
Advertisement

Agadha OTT:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పొలిమేర, పొలిమేర 2 చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న తెలుగమ్మాయి కామాక్షి భాస్కర్ల (Kamakshi Bhaskarla) ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం అగధ (Agadha) . ఎమ్మెస్ రాజు తెరకెక్కించిన ఈ చిత్రానికి శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అజయ్ కేఆర్ సమర్పణలో కాశీ విశాలాక్షి బలుసు నిర్మించారు. భానుచందర్ , శ్రవణ్ రెడ్డి ఉల్కా గుప్తా , షిజు, వివా రాఘవ, రోషన్ బషీర్, జోవికా విజయ్ కుమార్, శ్రేయా రాణి రెడ్డి, రాబర్ట్ మాస్టర్, ఆర్నా ములేర్, కనకవ్వ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఆగస్టులో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకొని ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమయ్యింది.

ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమయిన అగధ..

థియేటర్ లో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా సస్పెన్స్ , డివైన్, మిస్టిక్ థ్రిల్లర్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంది. కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి తమ పాత్రలతో సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ముఖ్యంగా ఇతర క్యారెక్టర్స్ కూడా తమ పరిధికి మించి నటించారనే చెప్పాలి. ఎమ్మెస్ రాజు దర్శకత్వ విలువలు మరోసారి అందరినీ ఆకట్టుకున్నాయి. బిజిఎం, కెమెరా వర్క్ అన్నీ కూడా సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయనే చెప్పాలి. అలాంటి ఈ సినిమా ఓటిటిలోకి ఎప్పుడు వస్తుందని ఎదురుచూసిన అభిమానులకు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5 గుడ్ న్యూస్ చెప్పింది.

Advertisement

స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఈ మేరకు సెప్టెంబర్ 25 నుంచి జీ5లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మొత్తానికి అయితే థియేటర్లలో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ సినిమా ఇటు ఓటీటీ లో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి..

Advertisement

ALSO READ:షారుక్ ఖాన్ తో సృష్టి.. కామనర్ గా బిగ్ బాస్ లోకి.. మరీ ఇంత మోసమేంటి నాగ్ సార్!

అగధ సినిమా స్టోరీ..

మహిమ (ఉల్కా గుప్తా) ఒకసారి తన స్నేహితులతో కలిసి అడవిలోకి వెళ్తుంది. అక్కడ ఒక గుహను చూస్తుంది. ఆ గుహ దగ్గర ఒక వింత ఘటన జరుగుతుంది. ఆ సమయంలో ఆమె స్నేహితుడు బబ్లూ మరణిస్తాడు. అయితే అదే సమయంలో ఆమె ప్రేమికుడు సింహ (శ్రవణ్ రెడ్డి) మాత్రం కనిపించడు. ఇంకొక వైపు మహిమ సోదరి మహాదేవి (కామాక్షి భాస్కర్ల) ఊరిలోని సమస్యలను తీరుస్తూ ఉంటుంది. ఆత్మలకు మోక్షం కలిగిస్తూ ఉంటుంది. ఇక కొన్ని రోజులకు మహిమ ఆత్మహత్య చేసుకుంటుంది. తన సోదరి మహిమ మరణంతో మహాదేవి తన సొంత ఊరికి వస్తుంది. తన ఇంటికి, కుటుంబ సభ్యులకు సమస్య ఉందని తెలుసుకున్న మహాదేవి.. సింహ నుంచి కొన్ని విషయాలు తెలుసుకుంటుంది. మరి మహాదేవి సింహా నుంచి తెలుసుకున్న విషయాలు ఏంటి? ఆ గుహ వద్ద ఏం జరిగింది? అసలు ఈ అగధ ఎవరు? మహాదేవి కుటుంబాన్ని అగధ ఎందుకు చంపుతోంది? చివరికి అగధను మహాదేవి ఏం చేసింది? ఈ కథలో జోవికా విజయ్ కుమార్, షిజు పాత్రలు ఏంటి ? అన్నదే మిగతా కథ . మొత్తానికైతే మిస్టికల్ థ్రిల్లర్ గా ప్రేక్షకులను థియేటర్లలో భారీగా ఆకట్టుకున్న ఈ సినిమా ఇటు ఓటీటీలలో ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి

Tags

Related News

ఊర్లో వరుసగా మిస్సింగ్ కేసులు.. పిల్లలనే టార్గెట్ చేసే సైకో.. దడ పుట్టించే సైకో థ్రిల్లర్

మొగుడి మీద రివేంజ్ తీర్చుకోవడానికి ప్రియుడితో… ఈ కొరియన్ సిరీస్ లో ఒక్కో సీన్ ఉంటది భయ్యా

జెన్ జీ మెచ్చే అచ్చ తెలుగు సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

హాకిన్స్ సిటీలో మళ్లీ మొదలైన వింత రాక్షసుల విలయం.. యానిమేషన్ ప్రపంచంలో స్పైన్ చిల్లింగ్ అడ్వెంచర్

6మార్షల్ ఆర్ట్స్ ప్రపంచంలో బ్లడీ బ్లడ్ బాత్.. పగ, ప్రతీకారాలతో అదిరిపోయే రివేంజ్ డ్రామా

హద్దులు దాటే కోరికలు.. సమాజం అంగీకరించని నిజాలతో ఒళ్ళు గగుర్పొడిచే ఆంథాలజీ తెలుగులో..

రిటైర్డ్ ఫైటర్ ఇంటిపై దాడి.. రౌడీల అంతుచూసే కూతురు.. ఖతర్నాక్ క్లైమాక్స్

Big Stories

Advertisement
×