GOBOULT Mustang Torq wireless earbuds: ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రయాణాల్లో ఉన్నా, ఆఫీస్ పనిలో ఉన్నా, లేదా జిమ్‌లో వర్కౌట్ చేస్తున్నా మంచి వైర్ లెస్ ఇయర్ బడ్స్ ఉండటం ప్రతి ఒక్కరి రొటీన్‌లో భాగమైపోయింది. యూజర్ల అవసరాలకు తగ్గట్టుగా.. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీతో గాడ్జెట్లను పరిచయం చేసే ప్రముఖ బ్రాండ్ ‘బోల్ట్’, ఇప్పుడు కొత్తఇయర్ బడ్స్‌ను మన ముందుకు తెచ్చింది. ఈ ఇయర్ బడ్స్ కేవలం చూడటానికి స్టైలిష్‌గా ఉండటమే కాకుండా.. పర్ఫామెన్స్‌లో అదరగొడుతున్నాయి. మరి ఈ డివైస్‌లో ఉన్న ప్రత్యేకతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ఇయర్ బడ్స్ డిజైన్ విషయానికి వస్తే.. ముస్తాంగ్ బ్రాండ్ కొలాబరేషన్‌తో ఇది చాలా స్పోర్టీగా, ప్రీమియంగా డిజైన్ చేయబడింది. ఛార్జింగ్ కేస్‌పై ఉండే.. ‘బ్రీతింగ్ ఎల్ఈడీ లైట్స్’దీనికి ఒక నయా ట్రెండీ లుక్‌ను ఇస్తాయి. చెవుల్లో పెట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్‌గా ఉండేలా వీటిని తయారు చేసారు. అలాగే ఇవి IPX5 వాటర్ రెసిస్టెన్స్ కలిగి ఉండటం వల్ల వర్షంలో లేదా వర్కౌట్ చేసే సమయంలో చెమట పట్టినా.. ఎలాంటి టెన్షన్ ఉండదు.
మ్యూజిక్ లవర్స్‌ను పూర్తిగా మంత్ర ముగ్ధులను చేయడానికి ఇందులో.. పవర్ ఫుల్ 13mm బేస్ డ్రైవర్లను వాడారు. దీని వల్ల సాంగ్స్‌లోని బీట్స్ చాలా క్లియర్‌గా, డీప్ బేస్‌తో వినిపిస్తాయి. అంతేకాకుండా.. ఇందులో ఉన్న మల్టీ-ఈక్యూ మోడ్స్ ద్వారా మీ మూడ్‌కి తగినట్లుగా సౌండ్ సెట్టింగ్స్‌ను ఈజీగా మార్చుకోవచ్చు. హై-ఫిడెలిటీ అకాస్టిక్స్ వల్ల వినే ప్రతి పాట ఎంతో మధురంగా అనిపిస్తుంది.
ప్రస్తుత ట్రెండ్‌కు తగినట్లుగా బ్యాటరీ లైఫ్ విషయంలో.. ఈ ఇయర్ బడ్స్ టాప్‌లో ఉన్నాయి. ఈ డివైస్ టోటల్ గా.. 60 గంటల వరకు ప్లేటైమ్‌ను అందిస్తుంది. అంటే.. ఒక్క సారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. రోజంతా హ్యాపీగా వాడుకోవచ్చు. అంతేకాకుండా.. ఇందులో ‘లైట్నింగ్ ఫాస్ట్ ఛార్జింగ్’ టెక్నాలజీ ఉంది. కేవలం 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే చాలు, దాదాపు 100 నిమిషాల పాటు నాన్ స్టాప్ మ్యూజిక్ లేదా కాల్స్ ఎంజాయ్ చేయొచ్చు.
గేమింగ్ ఆడేవారి కోసమే.. ప్రత్యేకంగా ఇందులో 45ms అల్ట్రా-లో లేటెన్సీ కంబాట్ మోడ్ ఇవ్వబడింది. దీని వల్ల గేమింగ్ ఆడేటప్పుడు ఆడియోకి, వీడియోకి మధ్య ఎలాంటి లాగ్ లేకుండా రియల్-టైమ్ సౌండ్ అందుతుంది. అలాగే లేటెస్ట్ బ్లూటూత్ v5.4 టెక్నాలజీతో ఇది వస్తుంది.’బ్లింక్ అండ్ పేర్’ఫీచర్ ద్వారా ఫోన్‌కు ఇయర్ బడ్స్ ఇన్‌స్టంట్‌గా కనెక్ట్ అయిపోతాయి.
Also Read: ఊరమాస్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ..కోడాక్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ అదిరిపోయే ఫీచర్లు ఇవే!
ఫోన్ కాల్స్ మాట్లాడుకునేటప్పుడు బయటి అనవసరమైన శబ్దాలు డిస్టర్బ్ చేయకుండా ఉండటానికి క్వాడ్ మైక్ ఈఎన్‌సీ టెక్నాలజీని పొందుపరిచారు. రద్దీగా ఉండే ట్రాఫిక్‌లో కూడా అవతలి వారికి మీ వాయిస్ స్పష్టంగా చేరుతుంది. దీనితో పాటు GOBOULT Amp App సపోర్ట్ లభిస్తుంది. ఈ యాప్ సహాయంతో టచ్ కంట్రోల్స్, ఈక్యూ మోడ్స్, ఇయర్ బడ్స్ సెట్టింగ్స్‌ను మనకు నచ్చినట్లు కస్టమైజ్ చేసుకోవచ్చు.
బడ్జెట్ ధరలో సూపర్ ట్రెండీ లుక్, అదిరి పోయే బ్యాటరీ లైఫ్, గేమింగ్ మోడ్, క్రిస్టల్ క్లియర్ కాల్ క్వాలిటీ కోరుకునే ప్రతి ఒక్కరికీ .. ఈ మోడల్ వైర్‌లెస్ ఇయర్ బడ్స్ ఒక పర్‌ఫెక్ట్ ఛాయిస్. మేడ్ ఇన్ ఇండియా ట్యాగ్‌తో.. వస్తున్న ఈ డివైస్ ధర, ఫీచర్ల పరంగా యూజర్లకు ఉపయోగపడుతుంది.