BigTV English

Indian Navy Rescue: నౌక హైజాక్.. సముద్రపు దొంలకు చుక్కలు చూపించిన ఇండియన్ నేవీ

Indian Navy Rescue: నౌక హైజాక్.. సముద్రపు దొంలకు చుక్కలు చూపించిన ఇండియన్ నేవీ

Indian Navy Rescue: అరేబియా సముద్రంలో భారత నౌకాదళానికి చెందిన మెరైన్ కమాండోలు సత్తా చూపారు. సముద్రపు దొంగలు హైజాక్‌ చేసిన వాణిజ్య నౌకను రక్షించారు. అందులో చిక్కుకున్న 15 మంది భారతీయులతో సహా 21 మంది సిబ్బందిని కాపాడారు. వాణిజ్య నౌక ఎం.వి.లీలా నార్ ఫోక్ హైజాక్ అయినట్లు శుక్రవారం ఉదయం యునైటెడ్ కింగ్ డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ నుంచి నౌకాదళానికి సమాచారం అందింది. తక్షణమే భారత నౌకాదళం.. ఐఎన్ఎస్ చెన్నై డిస్ట్రాయర్ నౌకను, ఒక యుద్ధ విమానాన్ని, డ్రోన్లను రంగంలోకి దింపింది.


హైజాక్‌ అయిన నౌకలోని సిబ్బందితో సంబంధాలు ఏర్పరచుకుంది. నౌకను విడిచి వెళ్లిపోవాల్సిందిగా హైజాకర్లను హెచ్చరించింది. అనంతరం భారత మెరైన్ కమాండర్లు నౌకలోకి ప్రవేశించి.. ఒక గదిలో దాక్కున్న సిబ్బందిని కాపాడారు. అప్పటికే హైజాకర్లు పారిపోయారని భారత నౌకాదళం తెలిపింది. సోమాలియా తీరంలో లైబీరియా జెండాతో ఉన్న కార్గో షిప్‌ను…సముద్రపు దొంగలు హైజాక్‌ చేశారు. ఈ షిప్‌లో 15 మంది భారతీయ సిబ్బంది ఉండటం ఆందోళన కలించింది. షిప్‌ హైజాక్‌ అయిన విషయాన్ని నిన్న సాయంత్రం ఇండియన్ నేవీ గుర్తించింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు INS చెన్నై యుద్ధ నౌకను రంగంలోకి దించారు. అలా అందరినీ రక్షించారు.


Related News

Actor Suhas: మరో బిడ్డకు తండ్రి అయిన నటుడు సుహాస్.. ఫోటో వైరల్!

Bigg Boss 9 Telugu: డబుల్‌ ఎలిమినేషన్‌ కాదు.. సింగిలే, మూడో వారం కామనర్‌ అవుట్‌!

Gautami Chowdary: గౌతమ్‌ చౌదరికి అంబర్‌పెట్‌ శంకర్‌ మద్దతు.. లైవ్‌లో అసలు నిజం బట్టబయలు..

Bigg Boss Telugu 9: దివ్య వైల్డ్ ఎంట్రీ.. వచ్చిరాగానే లవ్ బర్ట్స్ బండారం బట్టబయలు.. రీతూ పరువు మొత్తం పాయే!

Railway Employees Bonus: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 78 రోజుల పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం

Bigg Boss 9: మాస్క్ మ్యాన్ ఎలాంటి వాడో నిజాలు బయటపెట్టిన భార్య..కొట్టాడు కూడా అంటూ!

Tanushree Dutta: కోట్లు ఇచ్చిన మంచం పై వేరే వ్యక్తితో చెయ్యను..బిగ్ బాస్ కే వార్నింగ్..

Employee Death: సెలవు అడిగిన 10 నిమిషాలకే విగతజీవిగా మారిన ఉద్యోగి.. అసలేం జరిగింది?

Big Stories

×