BigTV English

Student Suicide : గంజాయికి బానిసై.. రైలు కింద పడి బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్య..

Student Suicide : గంజాయికి బానిసై.. రైలు కింద పడి బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్య..

Student Suicide : గంజాయికి అలవాటు పడిన యువత తమ జీవితాలను పాడుచేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు గంజాయి రవాణాపై నిఘా పెంచారు. ఈ నేపథ్యంలో మత్తుబాబులకు గంజాయి దొరకడం కష్టంగా మారింది. ఈ క్రమంలో మానసికంగా ఒత్తిడికి లోనైన ఓ ఇంజినీరింగ్ విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.


రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం మధ్యాహ్నం బీబీనగర్ వైపు నుంచి సనతనగర్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు కిందపడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అతని వద్ద లభించిన పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఇతర పత్రాల ఆధారంగా మృతుడు నారపల్లిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న విజయకుమార్ (27)గా గుర్తించారు. పెద్ద చర్లపల్లిలోని తండ్రి శ్రీనివాస్ కు కళాశాల నిర్వాహకులకు, పోలీసులు సమాచారం ఇచ్చారు.

ఘట్కేసర్ లోని ఓ కళాశాలలో డిప్లొమా చదువుతున్నప్పుడే విజయకుమార్ గంజాయికి అలవాటుపడ్డాడని తెలుస్తోంది. తర్వాత పాతబస్తీలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో చేర్పించారు. అక్కడగా వ్యసనానికి బానిసైనట్లు తండ్రి శ్రీనివాస్ తెలిపారు. మొదటి సంవత్సరంలో అన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో చదువు మానిపించి చర్లపల్లిలో చికెన్ సెంటర్ పెట్టించామన్నారు. విజయకుమార్ మానసికంగానూ కుంగిపోవడంతో సికింద్రాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఎడిక్షన్ కేంద్రంలో చికిత్స చేయిస్తున్నామమని తెలిపారు.అయినా పూర్తిగా కోలుకోలేదని మృతిని తండ్రి వివరించాడు.


చదువుకుంటానని చెప్పడంతో నార్లపల్లిలోని కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరంలో చేర్పించామని అక్కడే హాస్టల్లో ఉంటున్నాడని శ్రీనివాస్ వివరించారు. కొద్ది నెలలుగా తన మనసు బాగుండటం లేదని, ఆత్మహత్య చేసుకుంటానని చెబుతుండటంతో తల్లిదండ్రులు ధైర్యం చెప్పారు. అయినా కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి శ్రీనివాస్ పోలీసులకు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Related News

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Big Stories

×