BigTV English

Indigo : పాక్‌ గగనతలంలోకి ఇండిగో విమానం.. ఆ తర్వాత ఏమైందంటే..?

Indigo : పాక్‌ గగనతలంలోకి ఇండిగో విమానం.. ఆ తర్వాత ఏమైందంటే..?


Indigo : ఇండిగో విమానం భారత్ నుంచి పాకిస్థాన్ లోకి వెళ్లిపోయింది. అమృత్‌సర్‌ నుంచి అహ్మదాబాద్‌కు బయలుదేరిన ఈ విమానం ప్రతికూల వాతావరణం కారణంగా దారి తప్పింది. దీంతో పాక్ గగనతలంలోకి ప్రవేశించింది. లాహోర్‌ సమీపంలోని గుజ్రాన్‌వాలా వరకు ఇండిగో విమానం ప్రయాణించింది. అలా 30 నిమిషాల పాటు పాక్ లో తిరిగింది. ఆ తర్వాత సురక్షితంగా భారత్ గగనతలంలోకి తిరిగి చేరింది. ఈ విషయాన్ని విమానయాన సంస్థ వెల్లడించింది.

విమాన రాడార్‌ వివరాల ప్రకారం.. భారత్ కు చెందిన ఇండిగో విమానం శనివారం రాత్రి 7.30 గంటలకు ఉత్తర లాహోర్‌ ప్రాంతంలోకి ప్రవేశించింది. అయితే 30 నిమిషాల తర్వాత తిరిగి రాత్రి 8 గంటలకు భారత్‌ గగన తలంలోకి ప్రవేశించింది. ఈ సమయంలో అమృత్‌సర్‌ ఏటీసీ టెలిఫోన్‌ ద్వారా పాకిస్థాన్‌తో సమన్వయం చేసుకుంది. అలాగే విమాన సిబ్బంది ఆర్‌-టీ ద్వారా పాకిస్థాన్‌ ఏటీసీ అధికారులతో సంభాషించారు. చివరికి విమానం అహ్మదాబాద్‌ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.


సివిల్‌ ఏవియేషన్‌ అథారిటీ.. సీఏఏకు చెందిన సీనియర్‌ అధికారి ఈ ఘటనపై వివరాలు వెల్లడించారు. అంతర్జాతీయంగా ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు ఇలాంటి ఘటనలు సాధారణంగా జరుగుతుంటాయని తెలిపారు. విమానంలో భారత్ లో సురక్షితంగా దిగడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×