OG Trailer:రెబల్ స్టార్ ప్రభాస్ తో ‘సాహో’ సినిమా చేసి డైరెక్టర్గా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు సుజీత్ (Sujeeth). అలాంటి ఈయన తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో చేసిన చిత్రం ఓ.జీ.(OG ). మాస్ యాక్షన్ పవర్ ప్యాక్డ్ గా రాబోతున్న ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రియాంక మోహన్ (Priyanka mohan) హీరోయిన్ గా నటిస్తూ ఉండగా.. బాలీవుడ్ స్టార్ నటుడు ఇమ్రాన్ హష్మీ (Imran Hashmi) “ఓమీ” అనే పవర్ఫుల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య (DVV Danayya) భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకి అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లో ప్రీమియర్ షోలకు అనుమతి లభించిన విషయం తెలిసిందే. అంతేకాదు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే టికెట్ బుకింగ్స్ కూడా ప్రారంభం అయ్యాయి.
మరోవైపు ఈరోజు సాయంత్రం హైదరాబాదులో ఎల్బీ స్టేడియం వేదికగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా ఘనంగా నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ ఈవెంట్ కు సంబంధించిన అన్ని పనులు కూడా పూర్తయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా విడుదలకు కేవలం 3 రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుండీ ట్రైలర్ రిలీజ్ చేశారు. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ ట్రైలర్ ఎట్టకేలకు విడుదల అయ్యింది.. మరి ఈ ట్రైలర్ సినిమాపై ఎలాంటి అంచనాలు పెంచేసిందో ఇప్పుడు చూద్దాం..
ఓజీ ట్రైలర్ ఎలా ఉందంటే?
తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ ఆడియన్స్ లో గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ముఖ్యంగా ఇది కదా పవన్ కళ్యాణ్ రేంజ్ అంటే అంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ట్రైలర్ విషయానికి వస్తే.. బాంబేలో గ్యాంగ్ వార్స్ మళ్లీ మొదలయ్యాయి. కానీ ఈసారి గన్స్ అన్ని సత్యా దాదా (ప్రకాష్ రాజ్) వైపు తిరిగాయి. అనే డైలాగుతో ట్రైలర్ ప్రారంభించారు.తర్వాత ముంబైలో పోలీసులను అక్కడ జనాలు చుట్టుముట్టడం.. ఆ తర్వాత పంట చేలు నాశనం చేయడం.. రేయ్ వాడు ఎక్కడో ఇక్కడే ఉన్నాడు అనే డైలాగ్స్ కాస్త సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.. ముఖ్యంగా ఇమ్రాన్ హస్మి ఎంట్రీ సీన్ థియేటర్లలో గూస్ బంప్స్ తెప్పించడం ఖాయం అని చెప్పవచ్చు.శుభలేఖ సుధాకర్, శ్రేయ రెడ్డి తమ తమ పాత్రలలో లీనమైపోయారు. అలాగే హీరోయిన్ ప్రియాంక మోహన్ ఎంట్రీ కూడా ఆకట్టుకుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ చేతి పైన ఉన్న టాటూ ని హైలైట్ గా చూపించారు. కత్తి పట్టుకొని పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చే సీన్ అయితే అభిమానులకు ప్రత్యేకమైన మాస్ ట్రీట్ అనడంలో సందేహం లేదు. “నిన్ను కలవాలని కొందరు.. చూడాలని కొందరు.. చంపాలని అందరూ ఎదురు చూస్తున్నారు” అంటూ ఇమ్రాన్ హస్మీ డైలాగు మరొకసారి ఆకట్టుకుంది. ఓవరాల్ గా అయితే అభిమానులకు మంచి మాస్ ట్రీట్ ఇవ్వబోతున్నారని చెప్పవచ్చు.
ఆ ఎఫెక్ట్ పడేలా ఉందే?
ఇకపోతే అంతా బాగానే ఉన్నా మేకర్స్ చేసిన ఆ మిస్టేక్ ఇప్పుడు ఈ ట్రైలర్ పై ఎఫెక్ట్ పడేలా కనిపిస్తోందని చెప్పవచ్చు.. విషయంలోకి వెళ్తే.. నిన్న హైదరాబాద్ వేదికగా ఎల్బీ స్టేడియంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ముందుగానే ట్రైలర్ రిలీజ్ చేయడం. ఇప్పటికే చాలా మంది ట్విట్టర్ లో వచ్చిన ఆ ట్రైలర్ చూశారు. ఇప్పుడు చూస్తే కొత్తగా ఏం అనిపించడం లేదు. అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ALSO READ:Jacqueline Fernandez: సుప్రీం కోర్టును ఆశ్రయించిన జాక్వెలిన్!