IND VS PAK: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా… టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య… మరో మ్యాచ్ జరగబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ లో ఈ రెండు జట్లు మరోసారి తలపడే అవకాశాలు ఉన్నట్లు క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే టీమిండియా చేతిలో రెండు సార్లు ఓడిపోయింది పాకిస్తాన్. అయితే సూపర్ ఫోర్ దశలో పాకిస్తాన్ చేతిలో మరో రెండు మ్యాచ్లు ఉన్నాయి.
Also Read: Ind Vs Pak: చల్ పోరా పో….షాహిన్ అఫ్రీదిని బండ బూతులు తిట్టిన అభిషేక్…సిక్స్ కొట్టి మరీ
శ్రీలంక అలాగే బంగ్లాదేశ్ జట్టుకు మ్యాచ్లు ఉన్నాయి. టీమిండియా చేతిలో ఓడిపోయిన పాకిస్తాన్.. శ్రీలంక అలాగే బంగ్లాదేశ్ పైన విజయం సాధించాలి. ఈ రెండు మ్యాచ్ లలో వరుసగా విజయం సాధిస్తే… ఆసియా కప్ ఫైనల్లోకి పాకిస్తాన్ దూసుకు వెళ్తుంది. ఇక సూపర్ ఫోర్ లో కూడా టీమిండియా అద్భుతంగా రానిస్తోంది. మరో ఒకటి లేదా రెండు మ్యాచ్లు గెలిచినా…. టీమిండియా ఫైనల్ కు వెళ్లడం ఖాయం. ఒకవేళ ఇదే సినారియో కొనసాగితే…. ఆసియా కప్ 2025 టోర్నమెంట్లో ముచ్చటగా మూడవసారి టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగడం ఖాయమని అంటున్నారు క్రీడా విశ్లేషకులు.
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ సూపర్ ఫోర్ నేపథ్యంలో… నాలుగు జట్లు బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో టీమిండియా, పాకిస్తాన్ బంగ్లాదేశ్ అలాగే శ్రీలంక ఉన్నాయి. ఇందులో టీమిండియా ఇప్పటికే ఒక మ్యాచ్ గెలిచి… దూకుడు పైన ఉంది. టీమిండియా తో పోలిస్తే… మిగిలిన మూడు జట్లు కూడా…. చాలా వీక్ గా కనిపిస్తున్నాయి. ఈ టోర్నమెంట్లో ఇప్పటివరకు వరుసగా నాలుగు విజయాలను నమోదు చేసుకుంది టీమిండియా. టీమిండియా తర్వాత శ్రీలంక కాస్త బలంగా కనిపిస్తోంది.
Also Read : IND VS PAK: అభిషేక్ దుమ్ములేపాడు… సూపర్ 4 లోనూ టీమిండియా విజయం.. షేక్ హ్యాండ్ మళ్ళీ లేదు
ఆ తర్వాత పాకిస్తాన్ కంటే బంగ్లాదేశ్… చాలా మెరుగ్గా ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో.. ఈ సూపర్ 4 బరిలో బంగ్లాదేశ్ అలాగే శ్రీలంక జట్లను గెలవడం పాకిస్తాన్ కు చాలా కష్టతరమని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. అద్భుతం జరిగితే తప్ప ఆ రెండు మ్యాచ్ల్లో పాకిస్తాన్ గెలవడం.. సులభం కాదని అంటున్నారు. ఒక వేళ శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లపైనే పాకిస్థాన్ నిజంగానే విజయం సాధిస్తే… కథ వేరే ఉంటుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా… టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య… మరో మ్యాచ్ జరగడం ఖాయమని చెప్పవచ్చును. ఒక వేళ అదే జరిగితే… దుబాయ్ వేదికగా టీమిండియా వర్సెస్ పాకిస్థాన్ మధ్య జరుగడం.. సూర్య సేన ఛాంపియన్ కావడం గ్యారెంటీ అంటున్నారు.