BigTV English
Advertisement

Bigg Boss 9 wildcard : వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ వీళ్లే.. ఇక హౌస్‌లో రచ్చ రచ్చే!

Bigg Boss 9 wildcard : వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ వీళ్లే.. ఇక హౌస్‌లో రచ్చ రచ్చే!

Bigg Boss 9 wildcard : బుల్లితెరపై ప్రసారమవుతున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం ప్రస్తుతం తెలుగులో 9వ సీజన్ ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు వారాలు పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుని అలాగే హౌస్ నుంచి ఇద్దరు కంటెస్టెంట్లు బయటకు వచ్చారు. మొదటి వారం శ్రేష్టి వర్మ హౌస్ నుంచి బయటకు రాగా రెండో వారం కామన్ మ్యాన్ మనీష్ మర్యాద హౌస్ నుంచి బయటకు వచ్చారు. మొత్తం 15 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో భాగంగా త్వరలోనే మరి కొంతమంది వైల్డ్ కార్డు ద్వారా భాగం కాబోతున్నారని తెలుస్తుంది.


వైల్డ్ కార్డు ఎంట్రీస్ వీళ్లే…

ఈ క్రమంలోనే వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్లకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు బయటకు వస్తున్నాయి. దీని ప్రకారం…  వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అడుగు పెట్టబోతున్న ఆ కంటెస్టెంట్లు ఎవరనే విషయానికి వస్తే ..

సీరియల్ నటి సుహాసిని:
వెండితెరపై హీరోయిన్ గా పలు సినిమాలలో నటించిన సుహాసిని (Suhasini)ప్రస్తుతం సీరియల్స్ చేస్తూ హీరోయిన్‌గా, నిర్మాతగా కొనసాగుతున్నారు. ఇలా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సుహాసిని వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి వెళ్ళబోతున్నారని తెలుస్తుంది.


సీరియల్ నటి కావ్య:
చిన్ని సీరియల్ ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నానటి కావ్య (Kavya) కూడా వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి వెళ్ళబోతున్నారని తెలుస్తోంది. ఇక కావ్య హౌస్ లోకి వెళితే రేటింగ్స్ పెరిగే ఛాన్స్ ఉంది.

దివ్వెల మాధురి:
ఇటీవల కాలంలో రాజకీయాలలో సంచలనంగా మారిన వారిలో దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి (Divvela Madhuri)జంట ఒకటి. ఇటీవల వీరిద్దరూ పెద్ద ఎత్తున వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేశారు. అయితే మాధురి బిగ్ బాస్ 9 కార్యక్రమంలో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నారని, ఈమె ఎంట్రీ కన్ఫర్మ్ అయిందని తెలుస్తోంది. ఇక మాధురి హౌస్ లోకి అడుగుపెడితే భారీ స్థాయిలో కాంట్రవర్సీలు జరుగుతాయని చెప్పాలి.

సీరియల్ నటుడు శివకుమార్:

సీరియల్ నటి ప్రియాంక జైన్ ప్రియుడుగా శివకుమార్ (Shiva Kumar) అందరికీ సుపరిచితమే. గత కొన్ని సీజన్లో నుంచి ఈయన హౌస్ లోకి వెళ్ళబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే బిగ్ బాస్ 9 వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.

అలేఖ్య చిట్టి పికిల్ రమ్య:

అలేఖ్య చిట్టి పికిల్స్ ద్వారా పెద్ద ఎత్తున వివాదంలో చిక్కుకున్న వారిలో రమ్య (Ramya) కూడా ఒకరు. రమ్య కేవలం ఇన్ఫ్లుయెన్సర్ గా మాత్రమే కాకుండా పలు సినిమాలలో నటించారు. ఈ క్రమంలోనే రమ్య వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి వెళ్ళబోతున్నారని తెలుస్తోంది. ఇలా ఈ ఐదుగురు వైల్డ్ కార్డు ఎంట్రీ కన్ఫర్మ్ అని తెలుస్తుంది.

ఒకవేళ ఏడు మందిని కనుక తీసుకుంటే వారెవ్వా చెఫ్ సంజయ్‌తో పాటు సింహాద్రి సినిమా హీరోయిన్ అంకిత వెళ్లే అవకాశాలు ఉన్నాయనే టాక్ ఇప్పుడు వినిపిస్తుంది.

మాజీ కంటెస్టెంట్లు:

ఈ ఏడుగురుతో పాటు మాజీ కంటెస్టెంట్స్‌ కూడా హౌస్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందట. అలా చూస్తే.. రోహిణీ, ముక్కు అవినాష్‌తో పాటు మరో రెండు పేరు కూడా వినిపిస్తున్నాయి. అలాగే రన్నర్స్‌ను కూడా హౌస్‌లోకి వైల్డ్ కార్డ్‌గా తీసుకుంటున్నారట. అలాంటి ఛాన్స్ ఉంటే, అమర్‌దీప్ కి ఆ ఛాన్స్ దక్కే ఛాన్స్ ఉందని సమాచారం అందుతుంది.  ఈ వైల్డ్ కార్డు ఎంట్రీలు అక్టోబర్ 7వ తేదీలోపు ఉండే అవకాశాలు ఉన్నాయట.

Related News

Bigg Boss 9 Telugu : గౌరవ్ కు గట్టిదెబ్బ… ఇదేందయ్యా ఇదీ… కట్టప్ప కన్నా తనూజా – ఇమ్మాన్యుయేల్ వెన్నుపోటే దారుణం

Bigg Boss 9 Telugu Day 60 : ఇమ్మూను బోల్తా కొట్టించిన రీతూ… తనూజా వల్ల గౌరవ్ కు తీరని అన్యాయం… దివ్య దిక్కుమాలిన ప్లాన్ సక్సెస్

Bigg Boss 9 Madhuri: వాళ్లు రెమ్యునరేషన్‌ ఇచ్చేదేంటి.. నాకే నెలకు కోటి వస్తుంది.. దివ్వెల మాధురి

Bigg Boss 9 Promo: కెప్టెన్సీ వార్‌.. హీటెక్కిన ఆరేంజ్‌ టీం డిస్కషన్‌, తగ్గేదే లే అంటున్న గౌరవ్!

Bigg Boss 9 Promo: సీక్రెట్ టాస్క్.. అడ్డంగా బుక్కైన ఇమ్మూ !

Bigg Boss 9 Telugu : దారుణంగా పడిపోయిన బిగ్ బాస్ ఓటింగ్ రిజల్ట్.. అతనే విన్నర్..?

Bigg Boss Telugu 9 : ఇమ్మూ బట్టతలపై బిగ్ బాస్ పంచులు… ఈ గుడ్డులో గోల ఏందయ్యా మాకు ?

Bigg Boss 9 : ఈ సీజన్ లో అలాంటి వాడు లేడు, కెప్టెన్ కి ఇచ్చి పడేసాడు 

Big Stories

×