Vivo new phones 2025: వివో అనేది చైనాలో ప్రారంభమైన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ. 2009లో స్థాపించబడిన ఈ సంస్థ 2014లో భారత మార్కెట్‌లోకి ప్రవేశించింది. తక్కువ ధరలో మంచి ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్, ఆధునిక కెమెరా టెక్నాలజీని అందించడం వలన వివో చాలా తక్కువ సమయంలోనే భారతదేశంలో టాప్ బ్రాండ్లలో ఒకటిగా ఎదిగింది. ముఖ్యంగా యువతలో వివో ఫోన్లకు మంచి ఆదరణ ఉంది. ఇటీవల వివో పలు కొత్త ఫోన్లను విడుదల చేసింది.
వివో వై400 5జి (Vivo Y400 5G)
ఇటీవల వివో మార్కెట్‌లోకి తీసుకొచ్చిన మోడల్ వై400 5జి. దీని ధర 21,999 రూపాయల నుండి ప్రారంభమవుతుంది. ఈ ఫోన్‌లో 6.67 అంగుళాల అమోలేడ్ డిస్‌ప్లే, 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్ ఉన్నాయి. 6000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 90డబ్య్లూ ఫాస్ట్ చార్జింగ్ దీని ముఖ్యమైన ప్రత్యేకతలు. బడ్జెట్ రేంజ్‌లో ఇంతటి ఫీచర్లు ఇవ్వడం వలన ఈ ఫోన్ మార్కెట్‌లో హిట్ అవుతోంది.
వివో టి4 అల్ట్రా (Vivo T4 Ultra)
మధ్యస్థాయి వినియోగదారుల కోసం వివో టి4 అల్ట్రా ని లాంచ్ చేసింది. దీని ధర 37,999 రూపాయల నుండి ప్రారంభమవుతుంది. వక్ర అమోలేడ్ డిస్‌ప్లే, శక్తివంతమైన మెడియటేక్ డిమెంసిటీ 9300 ప్లస్ ప్రాసెసర్, అధునాతన కెమెరా సిస్టమ్ ఇందులో ఉన్నాయి. 90డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ కూడా అందిస్తున్నారు. గేమింగ్, ఫోటోగ్రఫీ ఇష్టపడేవారికి ఇది సరైన ఎంపిక. బ్యాంక్ కార్డు ఆఫర్లతో 3,000 రూపాయల వరకు తగ్గింపు కూడా లభిస్తుంది.
Also Read: Faria Abdullah: వైట్ డ్రెస్ లో హాట్ ఫోజులతో సెగలు పుట్టిస్తున్న ఫరియా!
వివో ఎక్స్ ఫోల్డ్ 5 (Vivo X Fold5)
ప్రీమియం సెగ్మెంట్‌లో Vivo తీసుకొచ్చిన మోడల్ ఎక్స్ ఫ్లోడ్5. ఇది ఫోల్డబుల్ డిజైన్‌తో వచ్చింది. జీస్ కంపెనీతో కలిసి తయారు చేసిన కెమెరాలు దీని ప్రత్యేక ఆకర్షణ. ప్రీమియం డిజైన్, అధిక స్థాయి పనితీరు, కొత్త టెక్నాలజీ కావాలనుకునే వారికి ఇది సరైన ఫోన్. దీని ధర 1,49,999 రూపాయలు.
వివో ఎక్స్200 ఎఫ్‌ఈ (Vivo X200 FE)
మరొక ప్రీమియం మోడల్ ఎక్స్200 ఎఫ్‌ఈ. దీని ధర 54,999 రూపాయలు. జీస్ కెమెరాలు, పెద్ద బ్యాటరీ, శక్తివంతమైన పనితీరు దీని ప్రత్యేకత. ఫోల్డబుల్ మోడల్ ధర ఎక్కువగా అనిపించే వారికి ఇది మంచి ఆప్షన్ అవుతుంది.
డిస్కౌంట్లు, ఆఫర్లు
వివో కంపెనీ 20 వేల నుండి 1.5 లక్షల వరకు అన్ని స్థాయిల ధరలలో ఫోన్లు అందిస్తోంది. ఫెస్టివల్ సీజన్లలో బ్యాంక్ కార్డు డిస్కౌంట్లు, ఈఎంఐ ఆప్షన్లు, ప్రత్యేక ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వివో అన్ని వర్గాల వినియోగదారుల కోసం వేరువేరు మోడల్స్ అందిస్తోంది. తక్కువ ధరలో మంచి ఫీచర్లు కావాలంటే వై సిరీస్, మధ్యస్థాయి పనితీరు కోసం టి సిరీస్, ప్రీమియం అనుభవం కోసం ఎక్స్ సిరీస్ సరైనవి. కొత్త టెక్నాలజీ, ఆకర్షణీయమైన డిజైన్, శక్తివంతమైన కెమెరాలతో వివో ప్రస్తుతం భారత మార్కెట్లో హాట్ టాపిక్‌గా నిలుస్తోంది.