E-Paper
Advertisement

Adipurush: ఓటీటీలో ఆదిపురుష్‌ బ్యాన్?

Adipurush: ఓటీటీలో ఆదిపురుష్‌ బ్యాన్?
Advertisement
adipurush-ott

Adipurush: ఆదిపురుష్ రచ్చ మామూలుగా లేదు. రాముడి రూపురేఖల నుంచి.. హనుమంతుడి డైలాగ్స్ వరకూ.. అనేక అంశాలు కాంట్రవర్సీగా మారాయి. నేపాల్‌లో బాలీవుడ్ సినిమాలనే నిషేధించే వరకూ విషయం ముదిరింది. వివాదాస్పద డైలాగ్స్ మార్చేస్తామని మూవీ యూనిట్ ప్రకటించినా.. గొడవ సద్దుమనగడం లేదు. మరోవైపు, ఎంత రచ్చ అయితే అంత కలెక్షన్లు అన్నట్టు.. ఆదిపురుష్‌పై కాసుల వర్షం కురుస్తోంది. ఇప్పటికే దాదాపు 400 కోట్లు వసూల్ చేసింది సినిమా.

తాజాగా, ఆదిపురుష్‌ చిత్రాన్ని వెంటనే నిలిపేయాలని.. ఓటీటీలోనూ రాకుండా చూడాలంటూ ఆల్‌ ఇండియన్‌ సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌.. ఏకంగా ప్రధాని మోదీకి లేఖ రాయడం కలకలం రేపింది. స్క్రీన్‌ప్లే, డైలాగులు.. రాముడు, హనుమంతుడి గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని లేఖలో ప్రధాని దృష్టికి తీసుకొచ్చింది.

Advertisement

దేవుళ్లను వీడియో గేమ్‌లలో పాత్రల్లాగా చూపించారని.. రాముడిపై, రామాయణంపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని ఆదిపురుష్ విధ్వంసం చేసిందని AICWA మోదీకి రాసిన లేఖలో ప్రస్తావించింది. ఆదిపురుష్ డైరెక్టర్, రైటర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని కోరింది.

అయితే, ఆదిపురుష్ ఓటీటీలోకి రాకుండా నిషేధించాలని కోరడం కలకలం రేపుతోంది. వివాదాస్పద డైలాగులు కట్ చేయడం గట్రా కాకుండా.. ఏకంగా సినిమానే నిలిపివేయాలనే డిమాండ్ పెరుగుతుండటం నిర్మాతల్లో కంగారు పెంచుతోంది. ఇప్పటికే సినిమా థియేటర్లలో రిలీజై పోయింది.. లక్షలాది మంది చూసేశారు.. మూవీ బడ్జెట్ కూడా చాలావరకు కవర్ అయిందనే ధీమాలో ఉంది మూవీ టీమ్. శాటిలైట్స్ రైట్స్‌తో లాభాల్లోకి వచ్చేయొచ్చని లెక్కలేసుకుంటుండగా.. ఇప్పుడిలా ఓటీటీలోకి రాకుండా.. ఏకంగా ప్రధాని మోదీకే లేఖలో కంప్లైంట్ చేయడంతో ఉలిక్కిపడుతున్నారు ఓం రౌత్. వివాదం ఎటు తిరిగి ఎటు దారి తీస్తుందోననే టెన్షన్లో ఉన్నారు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×