E-Paper
Advertisement

కన్నీళ్ళు తెప్పించే ఘటన .. మృత్యువులోనూ వీడని బంధం.. బిడ్డను హత్తుకుని ప్రాణాలు వదిలిన తల్లి

కన్నీళ్ళు తెప్పించే ఘటన .. మృత్యువులోనూ వీడని బంధం.. బిడ్డను హత్తుకుని ప్రాణాలు వదిలిన తల్లి
Advertisement

Bargi Dam boat accident: మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లా బర్గి డ్యామ్ (నర్మదా నది)లో జరిగిన ఘోర పడవ ప్రమాదం యావత్ దేశాన్ని కలచివేసింది. ఈ దుర్ఘటనలో వెలుగులోకి వచ్చిన ఒక దృశ్యం ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టిస్తోంది. పడవ మునిగిపోతున్న సమయంలో ఒక తల్లి తన ప్రాణాలను పణంగా పెట్టి కన్న బిడ్డను కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నం విఫలమై.. చివరకు ఇద్దరూ మృత్యువు ఒడిలోకి చేరుకున్నారు. సహాయక బృందాలు గాలింపు చేపట్టినప్పుడు.. లైఫ్ జాకెట్ ధరించిన ఆ తల్లి తన బిడ్డను గుండెలకు గట్టిగా హత్తుకుని ప్రాణాలు వదిలిన స్థితిలో మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆ తల్లి చేతుల్లోనే ఆ పసికందు ఊపిరి ఆగిపోవడం చూసి రెస్క్యూ సిబ్బంది సైతం కన్నీటి పర్యంతమయ్యారు.

ఏప్రిల్ 30న‌ సాయంత్రం వేళ చోటుచేసుకున్న ఈ ప్రమాదానికి ప్రకృతి వైపరీత్యంతో పాటు మానవ తప్పిదాలు కూడా తోడయ్యాయి. సుమారు 40 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో వీచిన బలమైన ఈదురుగాలులు.. హఠాత్తుగా వచ్చిన తుపాను కారణంగా మధ్యప్రదేశ్ టూరిజం డిపార్ట్‌మెంట్‌కు చెందిన క్రూయిజ్ బోటు ఖమరియా ద్వీపం సమీపంలో అదుపుతప్పి మునిగిపోయింది. ఆ సమయంలో బోటులో సిబ్బందితో కలిపి మొత్తం 29 మంది ఉన్నట్లు సమాచారం. ఈ విషాదంలో ఇప్పటివరకు 9 మంది మరణించగా.. 15 మందిని సహాయక బృందాలు సురక్షితంగా కాపాడాయి. ఇంకా కొందరు గల్లంతు కావడంతో ఎస్‌డీఆర్‌ఎఫ్ (SDRF), ఎన్‌డీఆర్‌ఎఫ్ (NDRF) మరియు ఆర్మీ బలగాలు సంయుక్తంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.

Advertisement

ప్రమాదానికి కొద్ది నిమిషాల ముందు బోటులోని ప్రయాణికులు రికార్డు చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఈదురుగాలులు ఎంత బలంగా వీస్తున్నాయో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ వీడియోలో ఉన్న ప్రయాణికులలో ఒక్కరు కూడా లైఫ్ జాకెట్లు ధరించలేదు. వాతావరణం అనుకూలించడం లేదని.. పడవను పక్కకు తప్పించాలని ప్రయాణికులు డ్రైవర్‌ను ప్రాధేయపడినా అతను నిర్లక్ష్యం వహించాడని ప్రాణాలతో బయటపడిన వారు ఆరోపిస్తున్నారు. భద్రతా నియమాలను తుంగలో తొక్కడం వల్లే ఇన్ని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

ప్రమాదం జరిగిన తీరుపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. టూరిజం బోటులో కనీస భద్రతా ప్రమాణాలు ఎందుకు పాటించలేదు? లైఫ్ జాకెట్లు ఉన్నా వాటిని ప్రయాణికులకు ఎందుకు వేయించలేదు? అనే కోణంలో విచారణ జరుగుతోంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×