E-Paper
Advertisement

చనిపోయాడని అంత్యక్రియలకు ఏర్పాట్లు.. ఇంతలోనే బిగ్ ట్విస్ట్.. అసలు ఏం జరిగిందంటే?

చనిపోయాడని అంత్యక్రియలకు ఏర్పాట్లు.. ఇంతలోనే బిగ్ ట్విస్ట్.. అసలు ఏం జరిగిందంటే?
Advertisement

Returns Alive: మనిషి జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. కొన్ని సంఘటనలు విన్నప్పుడు సినిమా కథలు కూడా వీటి ముందు తక్కువే అనిపిస్తుంది. సరిగ్గా ఇలాంటి ఒక నమ్మశక్యం కాని, ఒళ్లు గగుర్పొడిచే విచిత్ర ఘటన జమ్ముకశ్మీర్‌లో వెలుగు చూసింది. చనిపోయాడనుకుని కన్నీరుమున్నీరవుతూ, అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన తరుణంలో.. ఆ యువకుడు సడన్‌గా ఎంట్రీ ఇచ్చి అందరినీ షాక్‌కు గురిచేశాడు. అసలు చనిపోయిందెవరు? ఇంటికి తిరిగొచ్చిందెవరు? అనే సస్పెన్స్ స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది.

ఆ రాత్రి ఏం జరిగింది?
జమ్ముకశ్మీర్‌లోని సోహంజన ప్రాంతానికి చెందిన విశాల్ కుమార్ (24) అనే యువకుడు ఒక లోకల్ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం చేస్తున్నాడు. రోజులాగే శనివారం ఉదయం ఇంటి నుంచి డ్యూటీకి బయలుదేరాడు. అయితే, సాయంత్రం ఇంటికి రావాల్సిన సమయం దాటిపోయినా విశాల్ తిరిగి రాలేదు. కంగారుపడిన కుటుంబ సభ్యులు అతడి మొబైల్‌కు ప్రయత్నించగా.. అది కాస్తా స్విచ్చాఫ్ అని వచ్చింది. చుట్టుపక్కల, తెలిసిన వాళ్ల ఇళ్లలో వెతికినా ప్రయోజనం లేకపోవడంతో, తీవ్ర ఆందోళనతో రాత్రికి రాత్రే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Advertisement

పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్.. కన్నీటి సముద్రంలో కుటుంబం
కుటుంబ సభ్యులు ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో.. మరుసటి రోజు ఉదయం పోలీసుల నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. సమీప ప్రాంతంలో ఒక గుర్తు తెలియని మృతదేహం లభ్యమైందని, వచ్చి గుర్తుపట్టాలని పోలీసులు కోరారు. గుండెల్లో రాయి పడినంత పనైన కుటుంబ సభ్యులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ ఉన్న శవాన్ని పరిశీలించగా, దాని శారీరక ఆకృతి, కొన్ని లక్షణాలు అచ్చుగుద్దినట్టు విశాల్‌ను పోలి ఉన్నాయి. దీంతో ఆ మృతదేహం తమ బిడ్డదేనని నమ్మి, కన్నీరుమున్నీరుగా విలపిస్తూ పోస్టుమార్టం అనంతరం ఇంటికి తీసుకెళ్లారు.

పాడె కట్టే వేళ.. ఫోన్ లో వినిపించిన ఆ ఒక్క మాట!
ఇంటికి శవాన్ని తీసుకువచ్చిన బంధువులు, గ్రామంలో విషాద ఛాయల నడుమ అంత్యక్రియలకు ఏర్పాట్లు మొదలుపెట్టారు. బంధువులందరినీ పిలిపించారు, పాడె కూడా సిద్ధం చేశారు. ఇంకొద్దిసేపట్లో అంతిమ యాత్ర ప్రారంభం అవుతుందనగా.. విశాల్ తండ్రి మొబైల్‌కు ఒక అపరిచిత నంబర్ నుండి ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వైపు నుంచి వినిపించిన వాయిస్ విని అందరి గుండెలు ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. ఎందుకంటే ఫోన్ చేసింది మరెవరో కాదు.. చనిపోయాడనుకున్న విశాల్ కుమారే! “నా ఫోన్ పోయింది, నేను క్షేమంగానే ఉన్నాను.. ఇంటికి వస్తున్నాను” అని అతడు చెప్పడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు.

Advertisement

సంతోషంలో మునిగిన ఇల్లు.. అసలు ట్విస్ట్ ఏంటంటే?
ఫోన్ వచ్చిన కాసేపటికే విశాల్ కుమార్ నడుచుకుంటూ సాక్షాత్తూ కళ్లముందే ప్రత్యక్షమయ్యాడు. చనిపోయాడనుకున్న కొడుకు బతికి రావడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఏడుపులతో నిండిన ఆ ఇల్లు క్షణాల్లో పండగ వాతావరణంగా మారిపోయింది. డ్యూటీ ముగించుకుని వస్తుండగా ఫోన్ పోవడం, కొన్ని అనివార్య కారణాల వల్ల రాత్రి ఇంటికి రాలేకపోవడమే ఈ గందరగోళానికి కారణమని తెలిసింది. అయితే, విశాల్ పోలికలతో ఉన్న ఆ గుర్తు తెలియని మృతదేహం ఎవరిదనే కోణంలో పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నారు. ఏదేమైనా, ఈ ట్విస్ట్ మాత్రం ఆ ఊరి ప్రజలకు జీవితంలో మర్చిపోలేని ఒక విచిత్ర అనుభవంగా మిగిలిపోయింది.

Also Read: బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. నిన్న పెరిగిన పసిడి ధరలకు నేడు బ్రేక్.. తాజా రేట్లు ఇవే!

Related News

సినిమా స్టయిల్‌లో 20 కార్లతో వచ్చి.. కోటి ఇవ్వకుంటే చస్తావ్, గురుగ్రామ్‌లో ఘటన

మరో వివాదంలో ఇన్‌స్టా స్టార్ పునీత్.. మురికి కాలువలో స్నానం, ఆపై భోజనం కూడా

బీజేపీ అంతం చూసే వరకు బతికే ఉంటా.. మమతా బెనర్జీ సంచలన సవాల్!

లంచం తీసుకున్న TVK నేత.. తక్షణమే పార్టీ నుంచి గెంటేసిన సీఎం విజయ్.. ఇదిగో వీడియో!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

‘మహిళల ఆత్మగౌరవంతో ఆటలాడొద్దు’.. హైకోర్టు తీర్పులపై సుప్రీంకోర్టు సీరియస్!

నోయిడాలో ఘోర ప్రమాదం.. పేలిన ఎలక్ట్రిక్ స్కూటీ.. ఇద్దరు మృతి!

Big Stories

Advertisement
×