E-Paper
Advertisement

సినిమా స్టయిల్‌లో 20 కార్లతో వచ్చి.. కోటి ఇవ్వకుంటే చస్తావ్, గురుగ్రామ్‌లో ఘటన

సినిమా స్టయిల్‌లో 20 కార్లతో వచ్చి..  కోటి ఇవ్వకుంటే చస్తావ్, గురుగ్రామ్‌లో ఘటన
Advertisement

Gurugram: రౌడీలు, గ్యాంగ్‌స్టర్స్ రూటు మార్చారు. పోకిరి స్టయిల్ మాదిరిగా ఫోన్ చేసి బెదిరించడం మానేశారు. దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేయడం మొదలు పెడుతున్నారు. సినిమా స్టయిల్‌లో వాహనాల వేసుకుని వచ్చి బెదిరింపులకు దిగడం మొదలుపెట్టారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి హర్యానాలోని గురుగ్రామ్‌లో వెలుగులోకి వచ్చింది.

సినిమా స్టయిల్‌లో గ్యాంగులు వార్నింగ్-హర్యానాలో రౌడీమూకలు బరి తెగించాయి. పలువురు రౌడీ గ్యాంగులు పేరుమోసిన వాళ్లను బెదిరిస్తున్నారు.  గురుగ్రామ్‌లోని సెక్టార్ 106- 108 మధ్య ఉన్న ఒక సైట్‌లో ఈ ఘటన జరిగింది. ఓ కాంట్రాక్టర్‌కు ఏకంగా 20 ఎస్‌యూవీ వాహనాలతో వచ్చిన రౌడీలు చుట్టుముట్టడం తీవ్ర కలకలం రేపింది.

Advertisement

ఏకంగా 20 కార్లలో 60  మంది ఎంట్రీ- యాంగ్‌స్టర్ కౌశల్‌చౌదరి ముఠా సభ్యులు కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ గ్యాంగ్ కీలక నేతలు ప్రస్తుతం జైలులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.  కాంట్రాక్టర్.. సెంట్రల్ పార్క్, సెక్టార్ 108, అలెన్ గ్రూప్, సెక్టార్ 106తో సహా నగరంలోని పలు ప్రాంతాలలో నీరు-మట్టి సరఫరా వ్యాపారాన్ని చేస్తున్నట్లు తెలుస్తోంది.

డబ్బుల వసూళ్లు పర్వం.. తుపాకులతో బెదిరింపులు-గ్యాంగ్ సభ్యులు వార్నింగ్‌తో హడలిపోయిన సదరు కాంట్రాక్టర్ మనీష్ దహియా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మధ్యాహ్నం 3.30 గంటలకు సుక్కు, దినేష్ దహియా, లఖిరామ్, భోలా, నవీన్, ముండి, అజయ్ దహియా సుమారు 60 మంది నేరగాళ్లు తాము ఉన్న  స్థలానికి వచ్చినట్టు తెలిపాడు.

Advertisement

పోలీసులకు కాంట్రాక్టర్ ఫిర్యాదు-వారంతా నల్లటి స్కార్పియో కార్లలో వచ్చి ఆయుధాలను బయటపెట్టి సైటులో పని చేస్తున్న కార్మికులను బెదిరించడానికి ప్రయత్నించారని బాధితుడు తెలిపాడు. పని కొనసాగించాలను కుంటే స్థానిక గ్యాంగ్‌స్టర్లు దినేష్-రవీందర్‌లకు  డబ్బు చెల్లించాలని కోరినట్టు సదరు కాంట్రాక్టర్ వివరించాడు. సూపర్‌వైజర్‌పై దాడి చేసి అతడ్ని చంపేస్తామని బెదిరించినట్లు సమాచారం.

ALSO READ: మరో వివాదంలో ఇన్‌స్టా స్టార్ పునీత్.. మురికి కాలువలో స్నానం, ఆపై భోజనం కూడా

కాంట్రాక్టర్ తర్వాత తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరుతూ రాజేంద్ర పార్క్ పోలీసులకు వివరించాడు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను గుర్తించడానికి ఆధారాల కోసం వారి వాహనాలు రావడాన్ని గమనించడానికి సమీపంలోని సీసీటీవీ ఫుటేజీ చెక్ చేస్తున్నారు.

దర్యాప్తు కొనసాగుతోందని, దుండగులను త్వరలో అరెస్టు చేస్తామని చెబుతున్నారు పోలీసులు అధికారులు. జైలు నుండి కౌశల్ చౌదరి ముఠా ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

 

Related News

ఇంగువలో నాణ్యతా లోపాలు.. ఎవరెస్ట్, లాల్‌జీ గోధూ ఉత్పత్తులపై FSSAI నిషేధం!

నేపాల్ వరదల్లో ఇన్ఫోసిస్ సీఈఓ గోపిశెట్టి గల్లంతు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు, కంపెనీ ప్రకటన

డ్రోన్ ద్వారా పాకిస్థాన్ ఉగ్రవాదులకు సిమ్ కార్డులు సప్లై.. నిందితుడి అరెస్ట్!

బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ.. మమతా బెనర్జీపై కేసు నమోదు

ఇండియాలో తగ్గిపోయిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు.. ఇతర రంగాల్లోనూ ఏఐ తప్పనిసరి

చిన్నారి ప్రాణాల మీదికి తెచ్చిన ఎక్స్‌పైరీ స్నాక్స్.. కట్ చేస్తే అధికారి నోట్లోనే పెట్టిన స్థానికులు!

వరల్డ్ బ్యాంక్‌లో జాబ్ కావాలా? ఇదిగో లక్కీ ఛాన్స్

కర్ణాటక రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. రూ.89 కోట్ల స్కామ్ సెగ.. కన్నీళ్లతో మంత్రి నాగేంద్ర రాజీనామా!

Big Stories

Advertisement
×