BigTV English

Suicide in Kota : ‘అమ్మా నాన్నా.. క్షమించండి’.. కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య..

Suicide in Kota : రాజస్థాన్‌లోని కోటాలో జేఈఈ (JEE) మెయిన్స్‌కు సన్నద్ధమవుతున్నమరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. తాను చదవలేకపోతున్నానంటూ తల్లిదండ్రులకు సూసైడ్‌ నోట్‌ రాసింది. పోటీ పరీక్షల శిక్షణకు ప్రసిద్ధి చెందిన రాజస్థాన్‌ లోని కోటా (Kota) లో విద్యార్థుల ఆత్మహత్య (Suicide)లు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా జేఈఈ (JEE) మెయిన్స్‌కు సన్నద్ధమవుతున్న 18 ఏళ్ల విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. తాను ఈ పోటీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేనంటూ తల్లిదండ్రులకు సూసైడ్‌ నోట్‌ రాసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Suicide in Kota : ‘అమ్మా నాన్నా.. క్షమించండి’.. కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య..

Suicide in Kota : రాజస్థాన్‌ రాష్టం కోటాలో జేఈఈ (JEE) మెయిన్స్‌కు సన్నద్ధమవుతున్నమరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. తాను చదవలేకపోతున్నానంటూ తల్లిదండ్రులకు సూసైడ్‌ నోట్‌ రాసింది. పోటీ పరీక్షల శిక్షణకు ప్రసిద్ధి చెందిన రాజస్థాన్‌ లోని కోటా (Kota) లో విద్యార్థుల ఆత్మహత్య (Suicide)లు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా జేఈఈ (JEE) మెయిన్స్‌కు సన్నద్ధమవుతున్న 18 ఏళ్ల విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. తాను ఈ పోటీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేనంటూ తల్లిదండ్రులకు సూసైడ్‌ నోట్‌ రాసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..


కోటాకు చెందిన ఆ బాలిక 12వ తరగతి చదువుతోంది. స్థానికంగా ఓ కోచింగ్‌ సెంటర్‌లో జేఈఈకి శిక్షణ తీసుకుంటున్నారు. సోమవారం తన ఇంట్లో తల్లదండ్రులకు సూసైడ్ నోట్ రాసి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దీన్ని గమనించిన తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తరలించినా అప్పటికే ప్రాణాలు కోల్పోయింది. సూసైడ్ నోట్ ను పోలీసులు గుర్తించారు.

“అమ్మా, నాన్న నేను జేఈఈ చదవలేను. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను నేను ఓడిపోయాను నన్ను క్షమించండి’’ అని అందులో రాసినట్లు పోలీసులు తెలిపారు. జనవరి 31న పరీక్ష రాయాల్సి ఉండగా.. మానసిక ఒత్తిడి కారణంగా ఆమె బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని పోలీసులు వెల్లడించారు.


కోటాలో ఈ ఏడాది చోటుచేసుకున్న రెండో ఘటన ఇది. జనవరి 23న ఒక ప్రైవేట్‌ కోచింగ్‌ సెంటర్‌లో నీట్‌కు శిక్షణ తీసుకుంటున్న ఓ విద్యార్థి తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గత సంవత్సరం కూడా ఇక్కడ విద్యార్థులు వరుస ఆత్మహత్యలు చేసుకున్న విషయం తెలిసిందే. 2023లో 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.

దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తమవడంతో కేంద్రం పలు మార్గదర్శకాలను జారీ చేసింది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేలా శిక్షణ ఇవ్వాలని సూచించింది. అటు విద్యార్థుల మరణాలను నియంత్రించేందుకు భవనాల చుట్టూ ఇనుప వలలు, గదుల లోపల స్ప్రింగ్‌ ఫ్యాన్లను అమర్చారు. అయినప్పటికీ ఇవి ఆగకపోవడం కలవరపెడుతోంది.

Tags

Related News

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Big Stories

×