BigTV English
Advertisement

Gopichand: మహాశివ రాత్రికి ‘భీమా’ రిలీజ్.. వెల్లడించిన గోపీచంద్

Gopichand: మహాశివ రాత్రికి ‘భీమా’ రిలీజ్.. వెల్లడించిన గోపీచంద్

Gopichand: టాలీవుడ్ మెచో స్టార్ గోపీచంద్ చాలా రోజుల నుంచి కమ్ బ్యాక్ అయ్యేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. రొటీన్ స్టోరీలతో వస్తుండటంతో ఈ హీరోకు ఏదీ సెట్ కాలేదు. దీంతో గోపీచంద్ రూట్ మార్చాడు. కన్నడ దర్శకుడు ఏ హర్ష డైరెక్షన్‌లో ‘భీమా’ అనే మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలో అతడు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. ప్రియభవాని శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్‌గా నటిస్తుండగా.. రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు.


శ్రీసత్య సాయి ఆర్ట్స్ నిర్మాణంలో కెకె రాధామోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకాభిమానుల్లో మంచి హైప్‌ని క్రియేట్ చేశాయి. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌కు సంబంధించి ఓ అప్డేట్ వచ్చింది. ఈ మూవీని మొదటగా ఫిబ్రవరి 16న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ రిలీజ్ డేట్ వాయిదా పడింది. ఇందుకు సంబంధించిన కొత్త రిలీజ్ డేట్‌ను గోపీచంద్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపాడు. మహా శివరాత్రి సందర్భంగా ఈ మూవీని మార్చి 8న విడుదల చేస్తున్నట్లు ఓ పోస్టర్‌ను వదిలాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పోస్టర్ వైరల్ అవుతోంది.


Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×