E-Paper
Advertisement

Allahabad High Court: అలహాబాద్ హైకోర్టులో కీలక పరిణామం.. న్యాయమూర్తి యశ్వంత్‌వర్మ రాజీనామా

Allahabad High Court: అలహాబాద్ హైకోర్టులో కీలక పరిణామం.. న్యాయమూర్తి యశ్వంత్‌వర్మ రాజీనామా
Advertisement

Allahabad High Court: అలహాబాద్ హైకోర్టులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపినట్లు తెలుస్తోంది. అభిశంసన ప్రక్రియ నేపథ్యంలో పదవికి రాజీనామా చేసినట్టు చెబుతున్నారు.

అలహాబాద్ హైకోర్టులో కీలక పరిణామం

Advertisement

2025 మార్చి 14న ఢిల్లీలో జస్టిస్‌ యశ్వంత్‌వర్మ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. ఆయన నివాసంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఆయన ఇంటి నుంచి భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఈ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. దీనిపై విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు నియమించిన ముగ్గురు జడ్జీల కమిటీ.

జస్టిస్‌ వర్మపై వచ్చిన ఆరోపణలు నిజమేనని ఆ కమిటీ నివేదిక ఇచ్చింది. మే 9న అప్పటి సీజేఐ, జస్టిస్‌ యశ్వంత్‌వర్మను అభిశంసించి, పదవి నుంచి తొలగించాలని రాష్ట్రపతికి, ప్రధానికి సిఫార్సు చేశారు. దీనిపై రాష్ట్రపతి ముర్ము.. సీజేఐ ప్రతిపాదనను రాజ్యసభ చైర్మన్‌, లోక్‌సభ స్పీకర్‌లకు పంపినట్టు తెలుస్తోంది.

Advertisement

న్యాయమూర్తి యశ్వంత్‌వర్మ రాజీనామా, రాష్ట్రపతికి లేఖ

ఈ నేపథ్యంలో జస్టిస్ యశ్వంత్ వర్మ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు. ఈ లేఖను సమర్పించడానికి తనను ప్రేరేపించిన కారణాలతో మీ గౌరవ ప్రదమైన కార్యాలయానికి భారం కలిగించకూడదని భావిస్తున్నట్లు రాసుకొచ్చారు.

తీవ్రమైన ఆవేదనతో తాను న్యాయమూర్తి పదవికి రాజీనామా చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ఆయనను విధుల నుంచి తొలగించాలని పార్లమెంటు ఉభయసభల్లో ఎంపీలు అభిశంసన తీర్మానం ఇచ్చారు. తాజాగా వర్మ రాజీనామాతో అభిశంసన ప్రక్రియ ముగిసిపోతుందని లోక్‌సభ సెక్రటేరియట్ వర్గాలు తెలిపాయి.  జస్టిస్ వర్మ రాజీనామాతో న్యాయవ్యవస్థలో చర్చ నెలకొంది.

ALSO READ: ముంబై ఎయిర్‌పోర్టులో భారీ అగ్నిప్రమాదం.. ప్రాణభయంతో ప్రయాణికుల పరుగులు!

Related News

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

వైద్యులపై దాడికి దిగితే.. కనికరం చూపొద్దు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

Big Stories

Advertisement
×