E-Paper
Advertisement

జీతం తక్కువ ఇస్తున్నారని.. ఏకంగా రూ.1440 కోట్ల సామాగ్రిని తగలబెట్టేసిన ఉద్యోగి

జీతం తక్కువ ఇస్తున్నారని.. ఏకంగా రూ.1440 కోట్ల సామాగ్రిని తగలబెట్టేసిన ఉద్యోగి
Advertisement

warehouse fire: తక్కువ జీతం ఇస్తున్నారని, పని పరిస్థితులు బాలేవని నిరసన తెలపడానికి రకరకాల మార్గాలు ఉంటాయి. కానీ, కాలిఫోర్నియాకు చెందిన ఒక కార్మికుడు ఎంచుకున్న మార్గం మాత్రం ఊహాతీతం. తన కడుపు మంటను ఏకంగా తాను పనిచేసే గోదామునే తగలబెట్టి తీర్చుకున్నాడు. ఈ భారీ అగ్నిప్రమాదంలో సుమారు రూ. 1,446 కోట్లు ($156 మిలియన్లు) విలువైన ఆస్తి నిమిషాల్లో బూడిదైపోయింది. ఈ ఘటన అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టించింది.

అర్ధరాత్రి వేళ మొదలైన అగ్ని తాండవం
ఒంటారియోలోని సౌత్ హెల్మాన్ అవెన్యూలో ఉన్న ప్రముఖ సంస్థ కింబర్లీ-క్లార్క్ గోదాంలో ఈ దారుణం జరిగింది. సుమారు 12 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ భారీ భవనంలో అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. అక్కడ నిల్వ ఉంచిన పేపర్ టవల్స్, టాయిలెట్ పేపర్ వంటి వస్తువులు మంటలకు తోడవడంతో క్షణాల్లో ఆ ప్రాంతమంతా అగ్నిగుండంగా మారింది. ఆ సమయంలో లోపల 20 మంది సిబ్బంది ఉన్నప్పటికీ, అదృష్టవశాత్తూ అందరూ ప్రాణాలతో బయటపడ్డారు.

Advertisement

లైవ్ వీడియోలో నిప్పు పెడుతూ వికృత చేష్టలు
ఈ ఘటనలో షాకింగ్ విషయం ఏమిటంటే, నిందితుడైన 29 ఏళ్ల చమెల్ అబ్దుల్కరీం తాను చేస్తున్న ఘోరాన్ని ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో చిత్రీకరించాడు. గోదాంలో తిరుగుతూ వస్తువులకు నిప్పు పెడుతున్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. “మాకు బతకడానికి సరిపడా జీతం ఇచ్చి ఉంటే ఇలా జరిగేది కాదు” అంటూ అతను అరుస్తూ కనిపించాడు. “మీరు మాకు ఇచ్చే జీతం తక్కువ కావచ్చు, కానీ ఈ వస్తువులు మరీ చవకైనవి కాదు” అంటూ యజమానిపై ఉన్న పగను మంటల రూపంలో వెళ్లగక్కాడు.

నిందితుడి అరెస్ట్.. పోలీసుల వేట
అయితే మంటలు ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్న సమయంలోనే, నిందితుడు అబ్దుల్కరీం భవనానికి సమీపంలోనే పోలీసులకు చిక్కాడు. మొదట అతను కనిపించకుండా పోయాడని అనుకున్నా, చివరికి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. రెండు తీవ్రమైన క్రిమినల్ అగ్నిప్రమాద (Arson) ఆరోపణల కింద కేసు నమోదు చేసి, రాంచో కుకామోంగాలోని నిర్బంధ కేంద్రంలో బెయిల్ లేకుండా బంధించారు. ఈ దాడిని కావాలనే పక్కా ప్రణాళికతో చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

Advertisement

కాలిఫోర్నియా మార్కెట్‌పై భారీ ప్రభావం
ఈ గోదాం కేవలం ఒక భవనం మాత్రమే కాదు, ఆ ప్రాంతానికి నిత్యావసర వస్తువులను సరఫరా చేసే ప్రధాన కేంద్రం. కింబర్లీ-క్లార్క్ ఉత్పత్తులైన టిష్యూలు, పేపర్లు ఇక్కడి నుంచే పంపిణీ అవుతాయి. ఇప్పుడు 12 లక్షల అడుగుల భారీ భవనం పూర్తిగా ధ్వంసం కావడంతో సప్లై చైన్‌పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. సంస్థ ప్రతినిధులు ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, దర్యాప్తుకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.

Also Read: వామ్మో.. ఏకంగా 27వ అంతస్తు నుంచి పాక్కుంటూ దిగిపోయిన 89 ఏళ్ల బామ్మ

కడుపు మంట.. కోట్లలో నష్టం!
పని చేసే చోట అసంతృప్తి ఉంటే చర్చల ద్వారా లేదా రాజీనామా ద్వారా పరిష్కరించుకోవాలి కానీ, ఇలా కోట్లాది రూపాయల ఆస్తిని బూడిద చేయడం అనాగరికమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అబ్దుల్కరీం చేసిన ఈ పని వల్ల అతను ఇప్పుడు జీవితాంతం జైలు శిక్ష అనుభవించే ప్రమాదం ఉంది. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ సంస్థలకు, కార్మికులకు మధ్య ఉండాల్సిన సంబంధాల గురించి మరోసారి చర్చకు దారి తీసింది.

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×