E-Paper
Advertisement

కర్ణాటక కాంగ్రెస్‌లో రాజకీయాలకు ఎండ్ కార్డు.. ఏడు గంటలపాటు, మెట్టు దిగిన సిద్ధరామయ్య, నేడో రేపో

కర్ణాటక కాంగ్రెస్‌లో రాజకీయాలకు ఎండ్ కార్డు.. ఏడు గంటలపాటు, మెట్టు దిగిన సిద్ధరామయ్య, నేడో రేపో
Advertisement

Bengaluru Politics:  కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో మార్పులు ఖాయమా? నేషనల్ మీడియాలో సిద్ధరామయ్య తప్పుకున్నట్లు వార్తలు ఎందుకు వస్తున్నాయి? ఢిల్లీలో మంగళవారం రోజంతా కాంగ్రెస్ పెద్దలతో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకేల మధ్య ఏం జరిగింది? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.

కర్ణాటక కాంగ్రెస్‌లో నాయకత్వం మార్పు రాజకీయాలకు ఎండ్ కార్డు

Advertisement

కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకత్వ మార్పు దాదాపు ఖాయమైంది. ఈ మేరకు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. నేడు గానీ.. రేపు గానీ సీఎం సిద్ధరామయ్య తప్పుకోనున్నట్లు ప్రచారం సాగుతోంది. నాయకత్వం మార్పుపై మంగళవారం కాంగ్రెస్ హైకమాండ్.. సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకేతో దాదాపు ఎనిమిది గంటలపాటు చర్చించింది.

సీఎం సిద్దరామయ్యకు రాజ్యసభ సీటు, ఆయన కొడుక్కి డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం పదవి నుంచి తప్పుకునేందుకు సిద్దరామయ్య ససేమిరా అన్నట్టు వార్తలు లేకపోలేదు.  ఏఐసీసీ కార్యాలయంలోని మంగళవారం ఉదయం 11 గంటల నుంచి విడతల వారీగా చర్చలు సాగాయి.

Advertisement

ఏడు గంటలపాటు చర్చ.. సిద్ధరామయ్య మెట్టు దిగినట్టు సమాచారం

అధ్యక్షుడు ఖర్గే, రాహుల్‌గాంధీ,కేసీ వేణుగోపాల్‌, సుర్జేవాలాతోపాటు సీఎం సిద్ధరామయ్య, డీకేల మధ్య దాదాపు 8 గంటలపాటు చర్చలు జరిగాయి. ఐదుగురు నేతల మధ్య సుమారు గంటపాటు చర్చలు జరిగాయి. మార్నింగ్ సెషన్‌లో నాయకత్వం మార్పుపై ఎలాంటి సంకేతాలు రాలేదు.

మధ్యాహ్నం తర్వాత ఏఐసీసీ భవన్‌కు చేరుకున్న రాహుల్‌గాంధీ.. సీఎం సిద్దరామయ్యతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వీరిద్దరి మధ్య దాదాపు 45 నిమిషాలపాటు చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. ఆ సమయంలో రాహుల్‌ చేసిన ప్రతిపాదనలను సిద్దరామయ్య తోసిపుచ్చినట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. చివరకు డీకే శివకుమార్‌తో కాంగ్రెస్ పెద్దలు చర్చించారు.

ALSO READ: ఆధార్ కొత్త నిర్ణయం.. ఆ యాప్ క్లోజ్, వినియోగదారులు డోంట్‌ వర్రీ

గడిచిన మూడేళ్లుగా పార్టీ ఆదేశాలను పాటించానని, ఏ విషయంలో పరిధి దాటలేదని గుర్తు చేశారట. ఈ నేపథ్యంలో నాయకత్వం మార్పుకు దాదాపు లైన్ క్లియర్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. చర్చల తర్వాత సీఎం సిద్దరామయ్య ముభావంగా కనిపించడం అనుమానాలకు తావిచ్చింది.

సమావేశం తర్వాత మీడియా ముందుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్.. కేవలం రాజ్యసభ, విధాన పరిషత్‌ ఎన్నికల గురించి చర్చలు జరిగాయన్నారు. నాయకత్వ మార్పుపై  అలాంటిదేమీ లేదన్నారు.  సీఎం సిద్దరామయ్య నేడు లేదా రేపుగానీ రాజీనామా చేస్తారని కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు అన్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

Related News

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

వైద్యులపై దాడికి దిగితే.. కనికరం చూపొద్దు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

ప్రాణం పోయే ఆఖరిక్షణం.. దేవదూతల్లా పెళ్లైన జంట ప్రత్యక్షం, యువ బైకర్ సేఫ్, వీడియో వైరల్

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. ఉత్తరాఖండ్‌లో హిమానీనదాల మాటేంటి? ముప్పు పొంచివుందా?

ప్రధాని మోదీ మరోసారి విజ్ఞప్తి.. బంగారం కొనుగోళ్లపై కీలక వ్యాఖ్యలు, స్వదేశీ మంత్రంతోపాటు

Big Stories

Advertisement
×