BigTV English

KC Venugopal Comments: మోదీ ప్రభుత్వంపై కేసీ వేణుగోపాల్ ఫైర్.. నా ఫోన్లో స్పైవేర్ అంటూ..!!

KC Venugopal Comments: మోదీ ప్రభుత్వంపై కేసీ వేణుగోపాల్ ఫైర్.. నా ఫోన్లో స్పైవేర్ అంటూ..!!

KC Venugopal Comments on Modi’s Government: కేంద్రంలోని మోదీ సర్కార్ కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేసిందా..? ముమ్మాటి కీ అవుననే అంటున్నారు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. ఈ క్రమంలో కీలక విషయాలను వెల్లడించారాయన. మోదీ సర్కార్ తన ఫోన్‌ను ట్యాపింగ్ చేస్తోందని ఆరోపించారు. ఆ తరహా చర్యలను తాము వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు.


కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ యాపిల్ ఫోన్‌కు ఆ కంపెనీ నుంచి వార్నింగ్ మెసేజ్ వచ్చింది. మీ యాపిల్ ఐడీతో ఉన్న ఫోన్‌ను హ్యాక్ చేసేందుకు స్పైవేర్‌తో ప్రయత్నాలు జరుగుతున్నాయని అందులో కి కీలక సారాంశం. మీరెవరు? ఏం చేస్తున్నారు? అనేవి తెలుసుకునే లక్ష్యంతోనే ఈ దాడి జరుగుతున్నట్లు భావిస్తున్నామని అందులో ఉంది.

ఈ నేపథ్యంలో కేసీ వేణుగోపాల్ రియాక్ట్ అయ్యారు. ఇది ముమ్మాటికీ మోదీ సర్కార్ పనేనని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో సోషల్‌మీడియా వేదికగా రియాక్టు అయ్యారు. థ్యాంక్యూ మోదీజీ.. మీకెంతో ఇష్టమైన స్పైవేర్‌ను నా ఫోన్‌కు పంపించినందుకు ధన్యవాదాలు తెలిపారాయన. మీరు పంపిన స్పెషల్ గిఫ్ట్ గురించి యాపిల్ సంస్థ తనకు సమాచారం ఇచ్చిందన్నారు. రాజకీయ ప్రత్యర్థులను వేటాడేందుకు వారి గోప్యతకు భంగం కలిగించేందుకు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.


Also Read: విందులో నాన్‌వెజ్ లేదని పెళ్లి క్యాన్సిల్

వేణుగోపాల్ ఫోన్‌కు యాపిల్ కంపెనీ నుంచి మెసేజ్ రావడం ఇది రెండోసారి. గతేడాది అక్టోబరు 30న వార్నింగ్ వచ్చిందన్నారు. ఇది రిపీట్ నోటీసు కాదన్నారు. ప్రస్తుతం వచ్చింది తన ఫోన్ మీద ఎటాక్‌గా వర్ణించారు. మొబైల్ ఫోన్లపై దాడి ప్రపంచ వ్యాప్తంగా ఉంది. 2021 నుంచి వినియోగదారులకు యాపిల్ కంపెనీ అలర్ట్ మేసెజ్‌లను పంపిస్తుంది. ప్రస్తుతం వేణుగోపాల్ ఫోన్‌కు వచ్చిన వార్నింగ్.. ప్రభుత్వం పనా? లేక హ్యాకర్స్ పనా అనేది తెలియాల్సివుంది.

Tags

Related News

Supreme Court: లక్షల వీధి కుక్కలను షెల్టర్లకు తరలించండి.. సుప్రీం సంచలన ఆదేశాలు

Delhi Politics: ఢిల్లీలో రాహుల్, ప్రియాంక అరెస్ట్, భగ్గుమన్న విపక్షాలు, ప్రజాస్వామ్యం కోసమే పోరాటం-సీఎం రేవంత్

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Big Stories

×