BigTV English

Complaint against Governor Son: నా భర్తపై గవర్నర్ కొడుకు దాడి చేశాడు.. ఒడిశా రాజ్ భవన్‌ సిబ్బంది భార్య..!

ఒడిశా రాజ్ భవన్ లో డెప్యూటేషన్ పై ఉద్యోగం చేస్తున్న ఓ అధికారిని గవర్నర్ కుమారుడు చితకబాదాడని, అతని భార్య పోలీసులకు శనివారం ఫిర్యాదు చేసింది.

Complaint against Governor Son: నా భర్తపై గవర్నర్ కొడుకు దాడి చేశాడు.. ఒడిశా రాజ్ భవన్‌ సిబ్బంది భార్య..!

Odisha RajBhavan Staff Complained against Odisha Governor Son: ఒడిశా రాజ్ భవన్ లో డెప్యూటేషన్ పై ఉద్యోగం చేస్తున్న ఓ అధికారిని గవర్నర్ కుమారుడు చితకబాదాడని, అతని భార్య పోలీసులకు శనివారం ఫిర్యాదు చేసింది.


ఒడిశా గవర్నర్ రఘుబర్ దాస్ కుమారుడు లలిత్ దాస్.. రాజ్ భవన్‌లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేసే బైకుంఠ ప్రధాన్‌ అనే వ్యక్తిని చితకబాదాడని అతని భార్య సయోజ్ పూరీ బీచ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

పోలీసులు నమోదు చేసుకన్న ఫిర్యాదులో వివరాలిలా ఉన్నాయి. జూన్ 7, రాత్రి రైల్వే స్టేషన్‌లో ఉన్న గవర్నర్ కుమారుడు లలిత్ దాస్‌ను రాజ్ భవన్ తీసుకురావడానికి.. రాజ్ భవన్‌ ఉద్యోగి బైకుంఠ ప్రధాన్ ఒక మారుతి సుజుకీ కారుని పంపించాడు. కానీ లలిత్ దాస్‌కు బిఎండబ్యూ కారులోనే తిరగడం అలవాటు. ఆ రోజు ఒడిశాకు ప్రెసిడెంట్ ముర్ము విచ్చేయడంతో ఆమె కోసమే రాజ్ భవన్ కార్లనీ వెళ్లాయి. దీంతో అందుబాటులో ఉన్న మారుతి సుజూకీ కారుని బైకుంఠ ప్రధాన్ రైల్వే స్టేషన్ పంపించాడు.


రాజ్ భవన్ చేరుకున్న లలిత్ దాస్.. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌‌ని పిలిపించి కోపంతో చితకబాదాడు. ఈ క్రమంలో బైకుంఠ ప్రధాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. బైకుంఠ ప్రధాన్ పారిపోవడానికి ప్రయత్నించినా.. మిగతా సిబ్బంది చేత అతడిని పట్టించి మళ్లీ లలిత్ దాస్ చితకబాదాడు. ఆ తరువాత బైకుంఠ ప్రధాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Also Read: విందులో నాన్‌వెజ్ లేదని పెళ్లి క్యాన్సిల్

ఈ ఘటన గురించి గవర్నర్ రఘుబర్ దాస్‌కు ఫిర్యాదు చేసినా.. ఆయన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో బాధితుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మీడియాతో సయోజ మాట్లాడుతూ.. ”నా భర్తను అకారణంగా కొట్టిన వారందరికీ శిక్షపడాలి. జూన్ 7న రాజ్ భవన్ లో ఏం జరిగిందో అందరికీ తెలుసు. గవర్నర్ గారికి ఫిర్యాదు చేసినా ఆయన పట్టించుకోలేదు. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది.” అని చెప్పింది.

Tags

Related News

Eluru Crime: నడిరోడ్డుపై ఘోరం.. పట్టపగలు తల్లిని కత్తులతో నరికి నరికి, పగ తీర్చుకున్న కొడుకు

Nellore Crime: ఆ వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని సూసైడ్.. పేరెంట్స్ ఏమన్నారంటే?

Customs arrest: ఎయిర్‌పోర్టులో చెకింగ్.. బ్యాగ్ నిండా పురుగులే.. అక్కడే అరెస్ట్!

Odisha murder case: తమ్ముడుని చంపి ఇంట్లోనే పాతేసిన అన్న.. 45 రోజుల తరవాత వెలుగులోకి..

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Big Stories

×