BigTV English

No fish on Menu – No Wedding: మీ దుంపల్ తెగ.. విందులో నాన్‌వెజ్ లేదని పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న ఘనులు!

No fish on Menu – No Wedding: మీ దుంపల్ తెగ.. విందులో నాన్‌వెజ్ లేదని పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న ఘనులు!

Wedding Cancelled Due to No Fins in Menu: అసలే అమ్మాయిలు దొరక్క చాలా మంది పెళ్లిళ్లు ఆలస్యంగా చేసు కుంటున్నారు. చాలా కమ్యూనిటీల్లో ఇదే సమస్య వెంటాడుతోంది. మరికొందరు కులాంతర విహహాలు చేసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో మరింత ఎక్కువైంది. కొంతమంది బడాబాబులైతే దగ్గర బంధువు లతో వియ్యమందుకుంటున్నారు. యూపీలోని ఓ ఫ్యామిలీ అందుకు డిఫరెంట్. విందు భోజనంలో నాన్ వెజ్ లేదని ఏకంగా పెళ్లిని రద్దు చేసుకుంది వరుడి కుంటుంబం.


ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లా ఆనంద్‌నగర్ గ్రామంలో గురువారం మ్యారేజ్ జరగనుంది. దినేష్‌శర్మ కూతురు సుష్మను మ్యారేజ్ చేసుకునేందుకు ఆనంద్‌నగర్ గ్రామానికి చెందిన అభిషేక్‌శర్మ కుటుంబ సభ్యులు అంగీకరించారు. కాబోయే అల్లుడికి కట్నంగా ఐదు లక్షలు ఇవ్వడమేకాదు, కారు కొనుగోలు చేసేందుకు మరో నాలుగున్నర లక్షలు, రెండు బంగారం ఉంగరాలు కూడా ఇచ్చారు. ఇంతవరకు బాగానే జరిగింది.

వధువు ఇంట్లో మ్యారేజ్ ఫిక్స్ చేసుకున్నారు. గురువారం రాత్రి పెళ్లి జరగాల్సివుంది. అయితే విందులో పన్నీర్ పలావ్, రకరకాల కూరలతో భారీగా ఏర్పాటు చేశారు. అందరు చెప్పుకునే రీతిలో చేశారు. విందులో చేపలు, మాంసం లేకపోవడంతో వరుడి ఫ్యామిలీ కాస్త ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని వధువు ఫ్యామిలీ సభ్యులను పిలిచి గట్టిగా అడిగారు. ఈ క్రమంలో వియ్యంకుల మధ్య మాటలు కాస్త వివాదంగా మారాయి. చివరకు విందు సమయంలో కర్రలు కుర్చీలతో కొట్టుకున్నారు. దాదాపు ఆరుగురు గాయపడ్డారు.


Also Read: డేంజర్ జోన్ లో మోదీ సర్కార్..కొంప ముంచిన ఉప ఎన్నికలు

అంత జరిగిన తర్వాత సెలైంట్‌గా ఉంటారా? మ్యారేజ్‌ను రద్దు చేసుకున్నట్లు వరుడు కుటుంబసభ్యులు ప్రకటించారు. దీంతో వధువు ఫ్యామిలీ షాకయ్యింది. కేవలం నాన్ వెజ్ లేదనే కారణంతో పెళ్లిని ఎలా రద్దు చేస్తారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై అమ్మాయి తరపువాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కట్నం కింద అల్లుడికి ఐదు లక్షలు, కారు కొనుక్కోనేందుకు మరో నాలుగున్నర లక్షలు అంతా చూస్తూ.. దాదాపు 20 లక్షల వరకు ముట్టజెప్పామని ఫిర్యాదులో ప్రస్తావించారు. పోలీసులు ఇరు కుటుంబాల మధ్య రాజీ ప్రయత్నాలు చేస్తున్నారు.

Tags

Related News

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Big Stories

×