BigTV English

Kerala Governor : కేరళ గవర్నర్ కు కోపం వస్తే మామూలుగా ఉండదు.. ఏం చేశారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Kerala Governor : కేరళ గవర్నర్‌(Kerala Governor) అరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్ అనూహ్యంగా వ్యవహరించారు. తన కారు దిగి, రోడ్డుపక్కన ఒక షాపు ముందు బైఠాయించారు. కొల్లాం జిల్లాలో ఈ ఘటన జరిగింది. తనపై నిరసన తెలిపిన ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలను అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేస్తూ గవర్నర్ ఇలా అభ్యంతరం వ్యక్తం చేశారు.

Kerala Governor : కేరళ గవర్నర్ కు కోపం వస్తే మామూలుగా ఉండదు.. ఏం చేశారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Kerala Governor : కేరళ గవర్నర్‌(Kerala Governor) అరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్ అనూహ్యంగా వ్యవహరించారు. తన కారు దిగి, రోడ్డుపక్కన ఒక షాపు ముందు బైఠాయించారు. కేరళ రాష్ట్రం కొల్లాం జిల్లాలో ఈ ఘటన జరిగింది. తనపై నిరసన తెలిపిన ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలను అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేస్తూ గవర్నర్ ఇలా అభ్యంతరం వ్యక్తం చేశారు.


గవర్నర్‌ అరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్ ఓ కార్యక్రమానికి వెళ్తుండగా, అధికార సీపీఎం అనుబంధ సంస్థ ఎస్‌ఎఫ్‌ఐకు చెందిన కార్యకర్తలు నిబంధనలకు విరుద్ధంగా నల్లజెండాలు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటన గవర్నర్ కి కోపాన్ని తెప్పించింది. వెంటనే కారు దిగి, దగ్గర్లోని షాపు నుంచి కుర్చీ తీసుకొచ్చి రోడ్డు పక్కన వేసుకొని కూర్చున్నారు. వెంటనే ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను అరెస్ట్ చేయాలని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

కేరళలో గవర్నర్‌, సీఎంల మధ్య చాలాకాలంగా వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ప్రభుత్వం పంపించే బిల్లులను గవర్నర్‌ ఆమోదించకపోవడం, యూనివర్సిటీ నియామకాల్లో ప్రభుత్వ జోక్యం వంటి అంశాలపై ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు నెలకొన్నాయి. ఈక్రమంలోనే తాజా ఘటన చోటుచేసుకుంది.


రాష్ట్రంలో నిరసనకారులకు రక్షణ కల్పిస్తున్నారని గవర్నర్ ఆరోపించారు. పోలీసులే చట్టాన్ని ఉల్లంఘిస్తే.. ఇంక దానిని ఎవరు కాపాడతారని ఉన్నతాధికారులతో మాట్లాడారు. 13 మంది నిరసనకారుల్ని అరెస్టు చేశామని పోలీసులు చెప్పగా.. మిగతావారి సంగతేంటని గవర్నర్ ప్రశ్నించారు. ఆ సమయంలో అక్కడ భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడారు.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×