BigTV English

Cheepurupalli Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. చీపురుపల్లిలో తడాఖా చూపించేది అతనేనా..?

Cheepurupalli Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. చీపురుపల్లిలో తడాఖా చూపించేది అతనేనా..?
Cheepurupalli Assembly Constituency

Cheepurupalli Assembly Constituency : ఉత్తరాంధ్ర నియోజకవర్గాల్లో చీపురు పల్లికి ప్రత్యేక స్థానం అని చెప్పాలి. ఎక్కవ గ్రామీణ ప్రాంతం ఉండే నియోజకవర్గం. మాంగనీసు గనులతో నిండిన ప్రాంతం. గతంలో ఫేకర్ పరిశ్రమ మంచి వాణిజ్య కార్యకలాపాలను నడిపింది. చీపురు పల్లి నియోజకవర్గంలో టీడీపీ వరుస విజయాలను సాధించింది. 2004 తర్వాత ఈ నియోజకవర్గంలో బొత్స సత్యన్నారాయణ పట్టు సాధిస్తూ వస్తున్నారు. 2019 ఎన్నికల్లో గెలిచిన బొత్స ప్రస్తుత జగన్ కేబినెట్ లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. చీపురుపల్లి రాజకీయాల్లో కుల సమీకరణాలే కీలకం. తూర్పు కాపులు బలమైన సామాజికవర్గం. గత 3 ఎన్నికల్లో అన్ని పార్టీలు తూర్పు కాపు సామాజికవర్గం నేతలనే ఎన్నికల బరిలోకి దింపాయి. ఈ నియోజకవర్గంలో ఈసారి ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం.


2019 RESULTS

బొత్స సత్యనారాయణ VS కిమిడి నాగార్జున


YCP 54%
TDP 38%
OTHERS 8%

గత ఎన్నికల్లో చీపురుపల్లి నియోజకవర్గంలో వైసీపీ ఘన విజయం సాధించింది. వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ 54 శాతం ఓట్ షేర్ సాధించి గెలిచారు. టీడీపీ 38 శాతం ఓట్లు రాబట్టింది. ఇక ఇతరులకు 8 శాతం ఓట్లు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా జగన్ వేవ్, అలాగే విజయనగరం జిల్లా పాలిటిక్స్ లో బొత్స ఫ్యామిలీ ఎఫెక్ట్ తో మంచి ఓట్ షేర్ తో విజయం సాధించారు. మరి ఈసారి ఎన్నికల్లో చీపురుపల్లి సెగ్మెంట్ లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ డీటెయిల్డ్‌ ఎలక్షన్‌ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.

బొత్స సత్యనారాయణ (YCP)

బొత్స సత్యనారాయణ ప్లస్ పాయింట్స్

  • విజయనగరం జిల్లావ్యాప్తంగా ప్రభావం చూపించే లీడర్
  • బొత్స పట్ల జనంలో నమ్మకం

బొత్స సత్యనారాయణ మైనస్ పాయింట్స్

  • తోటపల్లి కుడి కాల్వ పనులు పూర్తి కాకపోవడం
  • చీపురుపల్లి సెగ్మెంట్ లో కొన్ని చోట్ల రోడ్ల సమస్య
  • డ్రైనేజీలు సరిగా మెయింటేన్ చేయకపోవడం
  • చీపురుపల్లి రెవన్యూ డివిజన్ కల నెరవేరకపోవడం

కిమిడి నాగార్జున (TDP)

కిమిడి నాగార్జున ప్లస్ పాయింట్స్

  • కిమిడి మృణాళిని, గణపతిరావు రాజకీయ వారసత్వం
  • యువ నాయకుడిగా ప్రజల్లో గుర్తింపు
  • నియోజకవర్గంలో యాక్టివ్ గా కార్యక్రమాలు

కిమిడి నాగార్జున మైనస్ పాయింట్స్

  • బొత్సను ఏమేరకు ఢీకొంటారన్న అనుమానాలు కుల సమీకరణాలు

తూర్పు కాపు 35%
రాజులు13 %
ఎస్సీ 12%
ఆర్యవైశ్యులు 10%
యాదవ్ 7%

చీపురుపల్లిలో తూర్పుకాపు సామాజికవర్గం బలంగా కనిపిస్తోంది. ఇందులో 55 శాతం మంది వైసీపీకి, 40 శాతం మంది టీడీపీకి, 5 శాతం మంది ఇతరులకు మద్దతు ఇస్తామని బిగ్ టీవీ సర్వేలో భాగంగా తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. అటు రాజుల్లో 50 శాతం మంది జగన్ పార్టీకి, 45 శాతం మంది టీడీపీకి, 5 శాతం మంది ఇతరులకు అండగా ఉంటామన్నారు. ఎస్సీల్లో 50 శాతం వైసీపీకి, 45 శాతం టీడీపీకి, 5 శాతం ఇతరులకు సపోర్ట్ ఇస్తామన్నారు. ఆర్యవైశ్యుల్లో 40 శాతం జగన్ పార్టీకి, 55 శాతం సైకిల్ పార్టీకి, 5 శాతం ఇతరులకు మద్దతు ఇస్తామంటున్నారు. ఇక యాదవ సామాజికవర్గంలో 50 శాతం వైసీపీకి, 45 శాతం టీడీపీకి, 5 శాతం ఇతరులకు సపోర్ట్ గా నిలబడుతామని వెల్లడించారు. ఇక వచ్చే ఎన్నికల్లో చీపురుపల్లి నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం…

బొత్స సత్యనారాయణ VS కిమిడి నాగార్జున

YCP 51%
TDP 42%
OTHERS 7%

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే చీపురుపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కే గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బొత్స సత్యనారాయణకు 51 శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. అటు టీడీపీకి 42 శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయని తేలింది. ఇతరులకు 7 శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న వెల్ఫేర్ స్కీములు ఓట్లుగా మారుతాయని సర్వేలో తేలింది. బొత్సకు వ్యక్తిగత అభిమానులతో పాటు జనంలోనూ పేరుండడంతో ఓట్లు పెరుగుతాయంటున్నారు. అటు టీడీపీ నేత కిమిడి నాగార్జున కూడా మంచి ఓట్ షేర్ సాధించే ఛాన్స్ ఉందని సర్వేలో తేలింది. నియోజకవర్గంలో కార్యక్రమాలు పెంచడంతో ఓట్లు పెరుగుతాయని వెల్లడైంది. గత ఎన్నికల్లో నాగార్జున ఓడిపోవడం కూడా సారి సానుభూతి ఓట్లను పెంచుతుందని బిగ్ టీవీ సర్వేలో జనం తమ అభిప్రాయాలు తెలిపారు.

Related News

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Big Stories

×