BigTV English

India unrest:షేక్ హసీనా పరిస్థితే మోదీకి రాబోతోందా? ఇంటెలిజెన్స్ హెచ్చరికలు

India unrest:షేక్ హసీనా పరిస్థితే మోదీకి రాబోతోందా? ఇంటెలిజెన్స్ హెచ్చరికలు

Like Bangladesh in India also make to plan unrest: బంగ్లాదేశ్ లో జరిగిన అల్లర్లు,హింసాత్మక సంఘటనలతో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా ప్రాణభయంతో దేశం విడిచి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. కేవలం విద్యార్థులు, విద్యార్థి సంఘాలు చేసిన ఆందోళనలు ఇంత తీవ్రంగా ఉంటాయా? ఒక వేళ ఉన్నా అది దేశ ప్రధాని పదవికే ముప్పువాటిల్లేంతటి ప్రమాదకర పరిస్థితి చోటుచేసుకుంటుందా అనేవి సమాధానం దొరకని ప్రశ్నలు. ప్రపంచంలో ఏ విద్యార్థి ఆందోళనలూ ఈ స్థాయిలో జరగలేదన్నది వాస్తవం. ముందుగా రిజర్వేషన్ల కోసం ప్రారంభమైన ఈ ఆందోళన క్రమంగా టెర్రరిస్టుల చేతులలోకి వెళ్లిపోయింది. బంగ్లాదేశ్ ని అస్థిరపరచాలని ఎప్పటినుంచో పాకిస్తాన్ దాని మిత్ర దేశమైన చైనాలు ప్రయత్నిస్తునే ఉన్నాయి. ఇన్నాళ్లూ భారత సరిహద్దు దేశంగా మనతో సన్నిహితంగా ఉంటోదన్న కారణంగా బంగ్లాదేశ్ లో ఎలాగైనా గొడవలు సృష్టించి తమ దేశాల అదుపాజ్ణలలో ఉంచగలిగితే క్రమంగా నెక్ట్స్ టార్గెట్ బారత్ అని ఈ రెండు దేశాలు భావిస్తున్నాయి.


చైనా-పాక్ కుట్రలు

అమెరికా గోడమీద పిల్లి మాదిరిగా పరిస్థితులను తనకుఅనుకూలంగా మార్చుకుంటుంది.
భారత సరిహద్దు దేశాలలో అలజడులు సృష్టించి అక్కడి ప్రభుత్వాలను తమ గుప్పిట్లో పెట్టుకుంటే తప్పక భారత దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవచ్చని పాక్, చైనా వంటి దేశాలు ఆలోచిస్తున్నాయి. అవకాశం దొరికినప్పుడల్లా పాక్ టెర్రరిస్టులు కాశ్మీర్ భూభాగంలోకి చొచ్చుకు రావాలని చూస్తున్నారు. అటు చైనా కూడా ఈశాన్య రాష్ట్రాలలో పాగా వేద్దామని భావిస్తోంది. ఇరు దేశాలు కూడా వాస్తవాధీన రేఖల సరిహద్దులను అతిక్రమించాలనే ఆలోచనతో ఉన్నాయి. ఇక ఖలిస్తాన్ ఉద్యమం కూడా ఊపందుకుంది. గత రెండేళ్లుగా రైతు ఉద్యమం పేరిట ఖలిస్తాన్ నేతలు దేశంలో మారణహోమం సృష్టిద్దామని చూస్తున్నారు. దేశీయ ఖలిస్తాన్ నేతలకు అక్రమంగా విదేశాలనుంచి నిధులు కూడా సమకూరుతున్నాయనేది జగమెరిగిన సత్యం.


ఎన్నికలే టార్గెట్

గత పదేళ్లుగా మోదీ ప్రభుత్వం పూర్తి మెజారిటీతో ఉన్నందున విదేశీ శక్తులను ఏకపక్షంగా అణిచివేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మోదీ సర్కార్ కేవలం 240 సీట్లకే పరిమితం అయింది. సంకీర్ణ ప్రభుత్వంగా కొనసాగుతోంది. ఇప్పుడు కఠినమైన నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో కేంద్రం లేదు. పైగా రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో జమ్ము కాశ్మీర్ కూడా ఉంది. త్వరలోనే ఈ రాష్ట్రంలో ఎన్నికల సందడి నెలకొనబోతోంది. ఆర్టికల్ 370 తర్వాత రగిలిపోతున్న కాశ్మీరీ ముస్లింలకు పాక్, చైనా లు అండగా నిలవబోతున్నాయి. జమ్ము ఎన్నికలలో మోదీ గెలిచినట్లయితే అక్కడ వీరి ఆటలు సాగవు. అక్కడ స్థానిక ప్రాంతీయ పార్టీలు గెలిస్తేనే చొరబాట్లకు అవకాశం లభిస్తుంది. అందుకే కాశ్మీర్ ఎన్నికల తర్వాత భారత్ లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరపాలని కొన్ని ముస్లిం సంఘాలు భావిస్తున్నాయని సమాచారం. భారత్ లో జరగబోయే ఎన్నికలలో పెద్ద ఎత్తున మత సంఘర్షణలు రెచ్చగొట్టడం ద్వారా భారత్ ను మరో బంగ్లాదేశ్ గా మార్చాలని చైనా, పాక్ భావిస్తున్నాయి.

హింసాత్మక చర్యలు

గత ఏడాది రైతు ఉద్యమాన్ని ఖలిస్తాన్ రాజకీయం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా కాశ్మీర్, హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలలో పెద్ద ఎత్తున హింసాత్మక సంఘటనలు ప్రేరేపించేలా కుట్ర జరుగుతోందని ఇంటెలిజెన్స్ వర్గం సమాచారం. ఎలాగైనా భారత్ లో పరిస్థితులు అదుపు తప్పేలా చేస్తే మోదీ భయపడి విదేశాలకు పారిపోతారని ఆ దేశాలు కలలు కంటున్నాయి.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×