BigTV English

Former Union Minister Chinta Mohan: తిరుపతి అగ్ని ప్రమాదంపై అనుమానం.. టీటీడీలో రూ.100కోట్లు చేతులు మారాయి.. వైసీపీ పనే!

Former Union Minister Chinta Mohan: తిరుపతి అగ్ని ప్రమాదంపై అనుమానం.. టీటీడీలో రూ.100కోట్లు చేతులు మారాయి.. వైసీపీ పనే!

Former Union Minister Chinta Mohan: టీటీడీలో రూ.100కోట్ల అవినీతి జరిగిందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఆరోపించారు. ఆరు నెలల క్రితం గత ప్రభుత్వ హయాంలో రూ.100 కోట్ల డబ్బులు చేతులు మారాయని తెలిపారు. సత్రాల పేరిట దాదాపు రూ.1200 కోట్లకు పైగా ఓ ప్రైవేట్ సంస్థకు కాంట్రాక్టు ఇచ్చారన్నారు.


అదే విధంగా టీటీడీ భక్తుల హుండీ సొమ్మును అపవిత్రం చేశారని చింతా మోహన్ ఆరోపించారు. కానుకల రూపంలో భక్తులు సమర్పించిన నగదును ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంపై అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. తిరుపతిలో జరుగుతున్న వరుస ఘటనలపై టీటీడీ ఈఓ విచారణ చేయాలని చింతా మోహన్ డిమాండ్ చేశారు.

అంతకుముందు సీఎం చంద్రబాబుపై కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. చంద్రబాబు బహుబలి కాదని, బలహీన బలి అన్నారు. ఈ మేరకు చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై విమర్శలు చేశారు, కేంద్రం సాయం కోసం ఢిల్లీకి పరుగులు తీయడం ఎందుకని ప్రశ్నించారు. కేంద్రమే చంద్రబాబు వద్దకు రావాలన్నారు. బీహార్ సీఎం కూడా ఇన్ని సార్లు ఢిల్లీ వెళ్లలేదని ఎద్దేవా చేశారు.


Also Read: ఏపీలో మరో ఏడు కొత్త విమానాశ్రయాలు..కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

మరోవైపు టీటీడీ పరిపాలన భవనంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ మాట్లాడారు. ఈ అగ్ని ప్రమాద ఘనట విద్రోహ చర్య అన్నారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ ఈఓ ధర్మారెడ్డిల హయాంలో జరిగిన రూ.1700 కోట్ల ఇంజినీరింగ్ పనుల కుంభకోణంపై విచారణ కీలక దశకు చేరుకుంది. అయితే ఈ సమయంలో పలువురు అధికారులకు నోటీసులిచ్చిన తరుణంలో ఈ అగ్ని ప్రమాదం జరగడంపై అనుమానాలకు తావిస్తోందన్నారు.

Related News

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Big Stories

×