E-Paper
Advertisement

Lok Sabha Elections 2024 – Phase 6: ముగిసిన పార్లమెంటు ఆరో దశ ఎన్నికల పోలింగ్

Lok Sabha Elections 2024 – Phase 6: ముగిసిన పార్లమెంటు ఆరో దశ ఎన్నికల పోలింగ్
Advertisement

Lok Sabha Elections 2024 – Phase 6 has ended: పార్లమెంటు ఆరో దశ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. 57.7 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. ఆరు రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 పార్లమెంటు నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది.

ఈ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తొలి గంటల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో సహా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా ఉప రాష్ట్రపతి జగ్ దీప్ ధన్ ఖడ్, ఆయన సతీమణి సుదేశ్ క్యూలైన్ లో నిల్చుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Advertisement

కేంద్రమంత్రి జైశంకర్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే, పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన వెంటనే ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన తొలి పురుషుడు ఆయనే కావడంతో అధికారులు ఆయనకు సర్టిఫికెట్ ఇచ్చారు. ఆ విషయాన్ని కేంద్రమంత్రి సోషల్ మీడియా ద్వారా పంచుకున్న విషయం తెలిసిందే. అదేవిధంగా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అయితే, ఈ ఆరో దశ ఎన్నికల పోలింగ్ లో అత్యధికంగా పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం పేర్కొన్నది. సాయంత్రం 5 గంటల వరకు 77.99 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా పశ్చిమ బెంగాల్ లో 79.99 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. ఉత్తర ప్రదేశ్ లో అత్యల్పంగా 50.02 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. ఇటు జార్ఖండ్ రాష్ట్రంలో 61.41 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. ఒడిశా- 59.60 శాతం, హర్యానా – 55.93 శాతం, ఢిల్లీలో 53.73 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఈసీ పేర్కొన్నది. అయితే, కశ్మీర్ మిలిటెన్సీ ప్రారంభమైనప్పటి నుంచి అత్యధిక ఓటింగ్ జరగడం ఇదే తొలిసారి. ఆరో దశ తుది పోలింగ్ శాతాలు ఇంకొంచెం పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Advertisement

అయితే, శనివారం ఆరో విడత పోలింగ్ ముగియడంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం 486 పార్లమెంటు నియోజకవర్గాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. చివరి విడత అయినటువంటి ఏడవ విడత పోలింగ్ జూన్ 1న జరనున్నది. ఈ ఏడు దశల ఎన్నికల పోలింగ్ ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి.

Also Read: పార్లమెంటు 5 విడతల పోలింగ్ శాతం విడుదల.. ఎంతంటే..?

ఆరో విడత పోలింగ్ ముగియడంతో ప్రధాని మోదీ మాట్లాడారు. ఆరో విడత పోలింగ్ లో ఓటు వేసిన వారందరికీ ప్రధాని కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఆరో విడత పోలింగ్ ముగిసినంక ఎన్డీఏ తిరిగి అధికారంలోకి రాబోతుందనే నమ్మకం తనకు ఇంకా పెరిగిందన్నారు. ఇదిలా ఉంటే పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక సీట్లు తమ ఖాతాలో వేసుకుంటామని కాంగ్రెస్ నేతలు చెబుతున్న విషయం తెలిసిందే.

Tags

Related News

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

Big Stories

Advertisement
×