E-Paper
Advertisement

Man Dressed as Girlfriend | ప్రేమ కోసం ఎన్ని పాట్లో.. మహిళా వేషంలో పరీక్ష రాసేందుకు వెళ్లిన యువకుడు!

Man Dressed as Girlfriend | తన గర్లఫ్రెండ్‌కు ఉద్యోగం ఇప్పించేందుకు ఒక యువకుడు పడరాని పాట్లు పడ్డాడు. ఉద్యోగం కోసం అర్హత పరీక్ష రాసేందుకు ఆమెకు బదులు అతను వెళ్లాడు. పైగా ఆడవేషం కోసం నుదుట బొట్టు పెట్టుకొని, పొడవాటి జుట్టు, లిప్ స్టిక్, అంతా మేకప్ చేసుకొని కొత్తగా పెళ్లైన యువతిలా తయారయ్యాడు.

Man Dressed as Girlfriend | ప్రేమ కోసం ఎన్ని పాట్లో.. మహిళా వేషంలో పరీక్ష రాసేందుకు వెళ్లిన యువకుడు!
Advertisement

Man Dressed as Girlfriend | తన గర్లఫ్రెండ్‌కు ఉద్యోగం ఇప్పించేందుకు ఒక యువకుడు పడరాని పాట్లు పడ్డాడు. ఉద్యోగం కోసం అర్హత పరీక్ష రాసేందుకు ఆమెకు బదులు అతను వెళ్లాడు. పైగా ఆడవేషం కోసం నుదుట బొట్టు పెట్టుకొని, పొడవాటి జుట్టు, లిప్ స్టిక్, అంతా మేకప్ చేసుకొని కొత్తగా పెళ్లైన యువతిలా తయారయ్యాడు. సరిగ్గా పరీక్షా హాలులో అడుగుపెట్టే సమయంలో టెక్నాలజీ అతడి ప్లాన్‌ని దెబ్బతీసింది. పరీక్ష సెంటర్‌ వద్ద సిబ్బందికి అతడిపై అనుమానం వచ్చి పట్టుకున్నారు. ఈ సంఘటన పంజాబ్ రాష్ట్రంలో జరిగింది.

పంజాబ్ రాష్ట్రంలోని బాబా ఫరీద్ మెడికల్ యూనివర్సటీ ఇటీవల హెల్త్ వర్కర్ల ఉద్యోగాల కోసం అర్హత పరీక్షలు నిర్వహించింది. ఆ పరీక్షకు పంజాబ్ రాష్ట్రంలోని ఫాజిల్కా ప్రాంతానికి చెందిన పరమ్‌జీత్ కౌర్ అనే యువతి పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకుంది. కానీ ఆమెకు బదులు ఆమె ప్రియుడు అంగ్రేజ్ సింగ్ పరీక్ష రాసేందుకు వెళ్లాడు. అంగ్రేజ్ సింగ్ పూర్తిగా మహిళా వేషంలో పరీక్షా సెంటర్‌కు వెళ్లాడు. పరీక్ష సెంటర్‌లో అనుమతించేందుకు గుర్తింపుగా నకిలీ ఓటర్ కార్డు, పాన్ కార్డు తయారు చేసుకున్నాడు. కానీ పరీక్ష హాలో లోపలికి వెళ్లే ముందు బయోమెట్రిక్ సిస్టమ్‌లో పరీక్ష రాసే అభ్యర్థి వేలి ముద్రలు వేయాలి. అక్కడే అంగ్రేజ్ సింగ్ ప్లాన్ బెడిసికొట్టింది. అతని వేలి ముద్రలు.. బయోమెట్రిక్ సిస్టమ్‌లో సరిపోకపోవడంతో పరీక్షా నిర్వహణ సిబ్బందికి అతనిపై అనుమానం కలిగింది.

Advertisement

అతని ముఖం తదేకంగా చూసిన సిబ్బందికి ఏదో తేడా కనిపించింది. దీంతో వారు గుర్తింపు కార్డులు అన్నీ మళ్లీ చెక్ చేశారు. అవి బాగా పరిశీలించగా.. నకిలీవని తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతడిని ఐపీసీ సెక్షన్ 419 అంటే మారురూపంలో మోసగించడం అనే నేరం కింద అరెస్టు చేశారు. ఈ చట్టం ప్రకారం నేరం రుజువైతే నేరస్థుడికి మూడు సంవత్సరాల జైలు లేదా జరిమానా లేదా రెండు శిక్షలు పడే అవకాశం ఉంది. బాబా ఫరీద్ మెడికల్ యూనివర్సటీ యజమాన్యం ఫ్రాడ్ చేసినందుకు పరమ్‌జీత్ కౌర్ పరీక్షా అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది.

Advertisement

Man Dressed as Girlfriend, write, Job entrance test, health worker job, Baba Faridkot Medical University, impersonate, IPC 419,

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×