E-Paper
Advertisement

Marriage: హార్ట్ ఎటాక్‌తో పెళ్లి కూతురు మృతి.. అయినా ఆగని పెళ్లి

Marriage: హార్ట్ ఎటాక్‌తో పెళ్లి కూతురు మృతి.. అయినా ఆగని పెళ్లి
Advertisement

Marriage: హార్ట్ ఎటాక్.. ఈ మధ్యలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటు బారిన పడుతున్నారు. అప్పటి వరకు అందరితో కలిసి మెలిసి ఉండి ఒక్కసారి కుప్పకూలిపోతున్నారు. ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే కానరాని లోకాలకు వెళ్లిపోతున్నారు. ఇలానే ఓ మరికొద్దిగంటల్లో పెళ్లి పీటలెక్కాల్సిన నవవధువు గుండెపోటుతో కుప్పకూలిపోయింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లే లోపు ప్రాణాలు కోల్పోయింది.

గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లాకు చెందిన విశాల్‌భాయ్, హేతల్‌ల వివాహం గురువారం జరగాల్సి ఉంది. పెద్దలు అన్ని ఏర్పాట్లు ఘనంగా చేశారు. ఇరువురి ఇళ్లలో బందుమిత్రులు, సన్నిహితులతో పెళ్లి సందడి మొదలైంది. విశాల్ భారీ ఊరేగింపుగా గురువారం ఉదయం హేతల్ ఇంటికి చేరుకున్నాడు.

Advertisement

ఇంతలోనే ఓ విశాద ఘటన చోటుచేసుకుంది. హేతల్ ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో కన్నీరుమున్నీరు అయిన తల్లిదండ్రులు.. ఆ తర్వాత కీలక నిర్ణయం తీసుకున్నారు.

హేతల్ స్థానంలో ఆమె చెల్లెలిని ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకు విశాల్, అతని తల్లిదండ్రులు కూడా ఒప్పుకోవడంతో అదే పెళ్లి మండపంలో వారికి వివాహం జరిపించారు. ఆనంతరం మార్చురీలో భద్రపరిచిన హేతల్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.

Tags

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×