E-Paper
Advertisement

Milind Deora : కాంగ్రెస్ కు రాజీనామా చేసిన మిలింద్ దేవరా.. మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పు!

Milind Deora : మహారాష్ట్రలో కాంగ్రెస్ సీనియర్ నేత మిలింద్ దేవరా ఆదివారం పార్టీకి రాజీనామా చేశారు. ఆయన కుటుంబానికి కాంగ్రెస్ పార్టీతో 55 ఏళ్లుగా అనుబంధం ఉంది. ఈ బంధానికి ముగింపు పలుకుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

Milind Deora : కాంగ్రెస్ కు రాజీనామా చేసిన మిలింద్ దేవరా.. మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పు!
Advertisement

Milind Deora : మహారాష్ట్రలో కాంగ్రెస్ సీనియర్ నేత మిలింద్ దేవరా ఆదివారం పార్టీకి రాజీనామా చేశారు. ఆయన కుటుంబానికి కాంగ్రెస్ పార్టీతో 55 ఏళ్లుగా అనుబంధం ఉంది. ఈ బంధానికి ముగింపు పలుకుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలో చేరానున్నారు. ఇండియా కూటమి సీట్ల పంపకాల్లో అసంతృప్తి వల్లే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

Advertisement

ముంబయి సౌత్ లోక్‌సభ స్థానం నుంచి ఆయన కాంగ్రెస్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ తరపున 2004, 2009 ఎన్నికల్లో గెలుపొందారు. కానీ 2014, 2019 ఎన్నికల్లో శివసేన నేత ప్రమోద్ సావంత్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఈ సారి ఇండియా కూటమి సీట్ల పంపకాల్లో సౌత్ ముంబయి లోక్ సభ స్థానాన్ని శివసేనకి కేటాయించడం జరిగింది. దీంతో అసంతృప్తికి గురైన మిలింద్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

మిలింద్ దేవరా రాజీనామాపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ మండిపడ్డాడు. మిలింద్‌ దేవరా తండ్రి మురళీ దేవరాతో ఆయనకు ఉన్న సుధీర్ఘ బంధాన్ని పంచుకున్నారు. “మురళీ దేవరాతో నాకు సుదీర్ఘ కాలంపాటు అనుబంధం ఉంది. మేము ఎంతో స్నేహంగా ఉండేవాళ్లం. ఆయనకు అన్ని రాజకీయ పార్టీలలో మిత్రులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచే కాంగ్రెస్‌వాది ఆయన.” అని జైరాం రమేష్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.

Advertisement

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×