E-Paper
Advertisement

Modi Govt: భారం పడకుండా.. కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్‌పై అదనపు ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు

Modi Govt: భారం పడకుండా.. కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్‌పై అదనపు ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు
Advertisement

Modi Govt: పెట్రోల్ డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాటిపై ఇప్పటివరకు అదనంగా ఉన్న ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పెట్రోల్ పై 3 రూపాయలు, డీజిల్‌పై ఉన్న 10 రూపాయలు సుంకాన్ని సున్నాకు తగ్గించినట్లు పేర్కొంది. దీంతో మార్కెట్లో ధరలు తగ్గనున్నాయి.

కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్‌పై అదనపు ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు

Advertisement

ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెల‌కొంది. ఈ నేపథ్యంలో కేంద్రంలోని మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకొంది. పెట్రోల్‌, డీజిల్‌పై ఇప్పుడు విధిస్తున్న అదనపు ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం పెట్రోల్‌పై లీటర్‌కు రూ.13 నుంచి రూ.3కు తగ్గించింది. అలాగే డీజిల్‌పై రూ.10 ని పూర్తిగా తొలగించిందని తెలిపింది.

కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆయిల్ కంపెనీలకు బిగ్ రిలీఫ్. మార్కెట్లో HPCL, IOCL, BPCL కంపెనీల షేర్లు భారీగా లాభపడే అవకాశం ఉందని స్టాక్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల ఆయిల్ కంపెనీలకు కలిసి రానుంది.

Advertisement

కేంద్రం నిర్ణయంతో ఆయిల్ కంపెనీలకు స్మాల్ రిలీఫ్

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఆయిల్ ధరలు పెరుగుతాయనే భయాలు మార్కెట్లో నెలకొన్నాయి. దీనికితోడు హర్మూజ్‌ జలసంధి దాదాపు మూతపడటంతో చమురు సరఫరాలో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి.  ఫలితంగా ఆయిల్ కంపెనీలు ధరలు పెంచలేదు. అమ్మకాలపై భారీ నష్టాలను పూడ్చుకోవడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

ఇరాన్‌ లో ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు భగ్గుమన్నాయి. ట్రేడింగ్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ ధర మళ్లీ 100 డాలర్లు దాటింది. దేశీయంగా పెట్రోల్‌, డీజిల్‌పై ఆయా కంపెనీలు ధరలు పెంచలేదు. లీటర్‌ పెట్రోల్‌/డీజిల్‌పై దాదాపు రూ.48 వరకు నష్టపోతున్నట్లు ఆయా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అదనపు భారాన్ని తగ్గించుకునేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

ALSO READ:  కొత్త వివాదంలో ఓ మంత్రి.. ట్రాన్స్‌‌జెండర్‌తో రాసలీలలు, మంత్రి రాజీనామాకు డిమాండ్ 

రష్యన్ కంపెనీ రోస్నెఫ్ట్-కేసాని ఎంటర్‌ప్రైజెస్ మద్దతుతో దేశంలో అతిపెద్ద ప్రైవేట్ ఇంధన రిటైలర్ నయారా ఎనర్జీ పెట్రోల్, డీజిల్ ధరలను గురువారం పెంచింది. పెట్రోల్-డీజిల్ ధరలను లీటరుకు వరుసగా రూ. 5 నుంచి రూ. 3 వరకు పెంచిన విషయం తెల్సిందే.

Related News

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

రాత్రి నూడుల్స్.. ఉదయానికి శవాలు.. ఒకే కుటుంబంలో 5 గురు మృతి!

ఈ నెలలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. ఆ రెండు అంశాలపై వాడీ వేడీ రచ్చ!

ఢిల్లీలో వీడని సస్పెన్స్.. అభిజిత్ దీప్కే ఆచూకిపై గందరగోళం.. నేహా బోరా తీవ్ర ఆరోపణలు!

బీజేపీ అగ్రనేతకు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిన ఎల్.కే. అద్వానీ.. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే?

స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌ టెన్షన్‌కు ఇక చెక్.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం?

ప్రపంచాన్ని సైతం కదిలించిన చరిత్ర.. అక్టోబర్ 17 ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా..?

డేంజర్ బెల్స్.. ఏఐతో భారీగా పర్యావరణం విధ్వంసం.. ఎలానో తెలుసా..?

Big Stories

Advertisement
×