E-Paper
Advertisement

Minister Narhari: కొత్త వివాదంలో ఓ మంత్రి.. ట్రాన్స్‌‌జెండర్‌తో పడక గదిలో, వీడియో వైరల్

Minister Narhari: కొత్త వివాదంలో ఓ మంత్రి.. ట్రాన్స్‌‌జెండర్‌తో పడక గదిలో, వీడియో వైరల్
Advertisement

Minister Narhari: కారణాలు ఏమైనా కావచ్చు.. అనుకోని పరిస్థితుల్లో ఓ మంత్రి కొత్త వివాదంలో చిక్కుకున్నారు. ఇది విపక్షాలకు అస్త్రంగా మారింది. ఆయన రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. తన అధికారిక నివాసంలో పడకగదిలో ట్రాన్స్‌జెండర్‌తో సదరు మంత్రి కలిసున్న వీడియో వైరల్ అయ్యింది.

మహరాష్ట్ర రాజకీయాల్లో మంత్రి నరహరి వ్యవహారంపై దుమారం

Advertisement

మహారాష్ట్ర మంత్రి నరహరి జిర్వాల్‌ వార్తల్లోకి వచ్చారు. ఆయన తన అధికారిక నివాసంలోని పడకగదిలో ఓ ట్రాన్స్‌జెండర్‌తో రాసలీలలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో సదరు మంత్రి నిద్రపోతుండగా ఆ ట్రాన్స్‌జెండర్ ఆయన పక్కన కూర్చుని ఉన్నారు. ఆ వ్యక్తి గదిలో జిర్వాల్‌ మంచంపై పడుకుని ఉన్నారు. మంత్రి పక్కన ట్రాన్స్‌జెండర్ కూర్చుని బెడ్‌పై ఉండడం మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది.

దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు నరహరి జిర్వాల్‌. మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్, ఆహార-ఔషధాల నియంత్రణ శాఖ మంత్రిగా ఉన్నారు. నాసిక్‌ జిల్లాలోని డిండోరీ నియోజకవర్గం నుంచి ఎన్సీపీ తరపున ఆయన గెలుపొందారు. ఫడ్నవీస్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్నారు. నరహరికి గిరిజన నేతగా మాంచి గుర్తింపు ఉంది. మంత్రి రాసలీలల వీడియో బయటకు రాగానే అజిత్ పవార్ వర్గం షాకైంది.

Advertisement

ట్రాన్స్‌‌జెండర్‌తో పడక గదిలో సదరు మంత్రి.. రాజీనామా చేయాలని విపక్షాల డిమాండ్

ఇంతకీ మంత్రి తన అధికారిక నివాసంలోని వీడియో ఎలా బయటకు వచ్చింది? మహారాష్ట్రలో కూటమిని విడగొట్టేందుకు ప్రత్యర్థులు కుట్ర పన్నారా? తెలిసివారే ఈ పని చేశారా? అంటూ ప్రశ్నలు రైజ్ అవుతున్న సమయంలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. నిజానికి ఆ మంత్రి సీక్రెట్ వ్యవహారం.. సొంత కారు డ్రైవర్ చిత్రీకరించాడు. ఏకంగా 10 నిమిషాలకు పైగా నిడివి గల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

మంత్రి నరహరి వీడియో బయటకు రాగానే విపక్షాలు ఎదురుదాడి మొదలుపెట్టాయి. అధికార కూటమిలోని కలహాల వల్ల ఈ యవ్వారం బయటకు వచ్చిందని అంటున్నారు. ప్రభుత్వంలో గ్రూపుల తగాదాలకు ఇదొక నిదర్శనమని కాంగ్రెస్‌ ప్రధాన ఆరోపణ. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి వెంటనే స్పందించి మంత్రి నరహరిని మంత్రివర్గం నుంచి తొలగించాలని మహారాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు హర్షవర్ధన్‌ డిమాండ్‌ చేశారు.

ALSO READ: బెంగాల్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. ఆర్.జి. కార్ బాధితురాలి తల్లికి బీజేపీ టికెట్!

దీనిపై ఇంటా బయటా వార్తలు జోరందుకోవడంతో స్వయంగా మంత్రి నరహరి రియాక్ట్ అయ్యారు. మార్ఫింగ్‌ చేసిన వీడియో అని చెప్పారు. తనను బ్లాక్‌మెయిల్‌ చేసేందుకు కొందరు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని రివర్స్ ఎటాక్ మొదలుపెట్టారు. మంత్రి నరహరి రాజకీయ జీవితంలో కొన్ని వివాదాలు లేకపోలేదు.  ఈ వ్యవహారంపై అజిత్ పవార్ వర్గం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

https://twitter.com/bigtvtelugu/status/2037357758274810124

 

 

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×