E-Paper
Advertisement

Bengaluru News: న్యూఇయర్ వేళ.. బెంగుళూరు పబ్‌లో గొడవేంటి? ఎందుకు కొట్టుకున్నారు?

Bengaluru News: న్యూఇయర్ వేళ.. బెంగుళూరు పబ్‌లో గొడవేంటి? ఎందుకు కొట్టుకున్నారు?
Advertisement

Bengaluru News: న్యూ ఇయర్ వేళ బెంగుళూరులో ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఘటన జరిగింది. బెంగళూరులో ఓ పబ్‌లో ఘర్షణ చెలరేగడంతో నూతన సంవత్సర వేడుకలు కాసేపు ఉద్రిక్తతకు దారి తీశాయి. ఈలోగా పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అసలేం జరిగింది? ఇంకాస్త డీటేల్స్‌లోకి వెళ్తే..

బెంగుళూరులోని ఓ పబ్‌లో గొడవేంటి?

Advertisement

దేశవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. బెంగుళూరు సిటీలోని చర్చి స్ట్రీట్ ప్రాంతంలోని ఫేమస్ నైట్‌ లైఫ్ పబ్‌ ఉంది.  వేడుకల కోసం అక్కడికి జనం భారీగా తరలి వచ్చారు. అయితే వేడుకలు జరుగుతున్న సమయంలో కొంతమంది యువకులు మద్యం మత్తులో గొడవ చేయడం మొదలైంది.

పబ్‌లోకి ఎంట్రీ విషయంలో యువకులకు.. పబ్ సిబ్బంది మధ్య వాగ్వాదం  జరిగింది. అది చిలికి చిలికి గాలివానగా మారింది. అక్కడున్న మహిళా సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించ‌డంతో మాటా మాటా కాస్త గొడవగా మారింది. చివరకు పబ్ సిబ్బంది- యువకులు ఫైటింగ్‌కు దిగడంతో పరిస్థితి ఉద్రక్తంగా మారింది.

Advertisement

ఎందుకు ఫైటింగ్‌కు దిగారు, పోలీసులు రంగం ప్రవేశంతో

దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఘర్షణకు కారణమైన వారిని స్టేషన్‌కు తరలించి విచారించారు. అకస్మాత్తుగా జరిగిన వాగ్వాదంతో కొద్దిసేపు వినియోగదారులు భయాందోళనలకు గురయ్యారు. నూతన సంవత్సరానికి స్వాగతించడానికి బెంగళూరు అంతటా వేలాది మంది గుమిగూడారు.

ఆ సమయంలో ఈ సంఘటన జరిగింది. అర్ధరాత్రి దాటగానే ప్రజలు పెద్ద ఎత్తున క్రాకర్లు పేల్చారు, డీజే సంగీతానికి నృత్యం చేశారు. వీధుల్లో యువతీ యువకులు కేరింతలు కొట్టారు. పబ్‌లో చిన్నపాటి ఘటన జరిగినప్పటికీ నగరం అంతటా వేడుకలు అంతరాయం లేకుండా తాఫీగా జరగడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

ALSO READ:  న్యూఇయర్ షాక్.. భారీగా పెరిగిన గ్యాస్ ధరలు.. పెట్రోల్-డీజిల్ రేట్లు అవే

Related News

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

Big Stories

Advertisement
×