E-Paper
Advertisement

Nirmala Sitharaman: వరుసగా ఐదుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆరోమంత్రిగా.. నిర్మలమ్మ

Nirmala Sitharaman: వరుసగా ఐదుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆరోమంత్రిగా.. నిర్మలమ్మ
Advertisement

Nirmala Sitharaman: 2019లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి నిర్మలా సీతారమన్ వరుసగా బడ్జెట్ ప్రవేశపెడుతూ వస్తున్నారు. ఈక్రమంలో వరుసగా ఐదుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆరో ఆర్థిక మంత్రిగా నిర్మలమ్మ నిలిచారు. అంతకంటే ముందు అరుణ్ జైట్లీ, యశ్వంత్ సిన్హా, పి.చిదంబరం, మన్మోహన్ సింగ్, మొరార్జీ దేశాయ్ వరుసగా ఐదు సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

దేశ చరిత్రలోనే అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టిన వ్యక్తి మొరార్జీ దేశాయ్. మొత్తం 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టగా.. 1959-60 నుంచి 1963-64 మధ్యలో వరుసగా ఐదు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు.

Advertisement

ఆ తర్వాత మన్మోహన్ సింగ్ 1991-92 నుంచి 1995-96 వరకు ఐదు పద్దులు పార్లమెంట్ ముందు ఉంచారు. ఇక 1998-99 మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన యశ్వంత్ సిన్హా.. 1999-2000 నుంచి 2002-03 వరకు వరుసగా నాలుగుసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

పి.చిదంబరం 2004-2005 నుంచి 2008-2009 వరకు ఐదుసార్లు బడ్జెట్‌ను పార్లమెంట్ ముందు ఉంచారు. ఇక మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అరుణ్ జైట్లీ ఆర్థిక మంత్రిగా 2014-15 నుంచి 2018-19 వరకు వరుసగా ఐదుసార్లు బడ్జెట్‌ను పార్లమెంట్ ముందుంచారు.

Tags

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×