BigTV English

Alternatives for Google: గూగుల్‌కు ప్రత్యామ్నాయంగా సెర్చ్ ఇంజన్లు..

Alternatives for Google: గూగుల్‌కు ప్రత్యామ్నాయంగా సెర్చ్ ఇంజన్లు..

Alternatives for Google:గూగుల్ అనేది వచ్చిన తర్వాత అందరి పని చాలా సులభంగా మారిపోయింది. ఒక విషయం గురించి ఏ మాత్రం అవగాహన లేకపోయినా.. చిటికెల్లో దాని గురించి చెప్పడానికి గూగుల్ తోడుగా ఉంటోంది. అందుకే గూగుల్ తర్వాత ఎన్ని సెర్చ్ ఇంజన్లు వచ్చినా.. పోటీగా నిలబడలేక వెనక్కి తగ్గాయి. కానీ ఈ పది సెర్చ్ ఇంజన్లు మాత్రం గూగుల్‌కు గట్టి పోటీనిస్తామంటున్నాయి.


గూగుల్ తర్వాత అత్యంత పెద్ద సెర్చ్ ఇంజన్ ‘మైక్రోసాఫ్ట్ బింగ్’. ఈ సెర్చ్ ఇంజన్ యూజర్లను ఆకర్షించడానికి ఎప్పటికప్పుడు బ్యాక్‌గ్రౌండ్స్‌ను మారుస్తూ ఉంటుంది. ముఖ్యంగా మనకు తెలియని వీడియోను వెతకడానికి మైక్రోసాఫ్ట్ బింగ్ ఉపయోగపడుతుంది. గూగుల్‌తో పోటీపడేలా మరెన్నో ఫీచర్స్ కూడా మైక్రోసాఫ్ట్ బింగ్‌లో ఉన్నాయి.

మామూలుగా గూగుల్‌లో మనం ఏం సెర్చ్ చేసినా.. అది రికార్డ్ చేసుకుంటుంది. కొంతమందికి ఇలా నచ్చదు. ముఖ్యంగా అలాంటి వారికోసమే తయారు చేసిన సెర్చ్ ఇంజన్ ‘డక్‌డక్‌గో’. ఈ సెర్చ్ ఇంజన్ యూజర్ల ప్రైవేసీకి ప్రాధాన్యత ఇస్తుంది. అందుకే ఇందులో సెర్చ్ చేసిన విషయాలు ఇతర యాప్స్ చదవకుండా ప్రైవసీ పాలసీని డిజైన్ చేశారు. డక్‌డక్‌గోలో మనం సెర్చ్ చేసిన విషయాలను వెంటనే మన ముందు ఉంచేలాగా బ్యాంగ్స్ అనే ప్రత్యేకమైన ఫీచర్ ఉంది.


గూగుల్ కంటే ముందుగా అందరికీ పరిచయమయిన సెర్చ్ ఇంజన్ ‘యాహూ’. గూగుల్ వచ్చిన తర్వాత యాహూకు ఉన్న క్రేజ్ తగ్గిపోయినా.. ఇప్పటికీ కొందరు దీనిని ఉపయోగిస్తూనే ఉన్నారు. ఫైర్‌ఫాక్స్ లాంటి నెట్‌వర్క్ కూడా యాహూనే తన డిఫాల్ట్ సెర్చ్ ఇంజన్‌గా ఇప్పటికీ ఉపయోగిస్తోంది. ఈమెయిల్, వార్తలు, ఆన్‌లైన్ షాపింగ్, గేమింగ్.. ఇలాంటి చాలా సర్వీసులను యాహూ ఒకేచోట అందిస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా ఒక టెక్నాలజీని ఉపయోగిస్తే.. చైనా మాత్రం ఎప్పుడూ తమ సొంత టెక్నాలజీని ఉపయోగించడానికే ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే అక్కడ ‘బైడు’ అనే సెర్చ్ ఇంజన్ చాలా పాపులర్. చూడడానికి దాదాపు గూగుల్‌లాగానే ఉన్నా.. బైడు మాత్రం అన్నింటిని సెర్చ్ చేయడానికి అనుమతిని ఇవ్వదు. అభ్యంతకరమైన ఫోటోలు, వెబ్‌సైట్లు బైడులో సెర్చ్ చేయడం కుదరదు.

కేవలం ప్రొఫెషనల్ విషయాలను తెలుసుకోవడానికి మాత్రమే ఒక సెర్చ్ ఇంజన్ ఏర్పాటు చేయబడింది. అదే ‘వాల్ఫ్‌రామ్ అల్ఫా’. ఈ సెర్చ్ ఇంజన్‌లో మ్యాథ్స్ గురించి, సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి, రోజూవారీ అప్డేట్స్ గురించి పూర్తి సమాచారం లభిస్తుంది. అంతే కాకుండా యూజర్లు ఏం సెర్చ్ చేస్తున్నారో వాల్ఫ్‌రామ్ అల్ఫా ఎప్పుడూ ట్రాక్ చేయదు.

సెర్చ్ ఇంజన్లు చాలావరకు కమర్షియల్‌గానే పనిచేస్తాయి. తమకు వచ్చే ఆదాయంతో తమ సెర్చ్ ఇంజన్‌ను మరింత డెవలెప్ చేయడానికి ప్రయత్నిస్తాయి. కానీ ‘ఎకోషియా’ అలా కాదు. ఈ సెర్చ్ ఇంజన్‌లో మనం చేసే ప్రతీ సెర్చ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఒక మొక్కను నాటడానికి సంస్థ ఉపయోగిస్తుంది.

ప్రైవసీకే ప్రాధాన్యత ఇస్తూ తయారు చేసిన మరో సెర్చ్ ఇంజన్ ‘క్వాంట్’. ఈ సెర్చ్ ఇంజన్ ఫ్రాన్స్‌ టెక్నికల్ టీమ్ కనిపెట్టారు. మామూలు విషయాలను సెర్చ్ చేయడంతో పాటు ఇందులో మనకు తెలియని పాటలను కూడా సెర్చ్ చేయవచ్చు. ఈ సెర్చ్ ఇంజన్ డిజైన్ కూడా యూజర్లను ఆకర్షించే విధంగా ఉంటుంది.

మనం ఏదైనా విషయాన్ని సర్చ్ చేసినప్పుడు.. దాని సమాచారం తన దగ్గర లేకపోయినా.. ఇతర సెర్చ్ ఇంజన్ల నుండి కూడా సమాచారాన్ని చూపించేదే ‘సర్క్స్’. ఇంటర్నెట్ అంతా ఒకటే అన్నట్టు సర్క్స్ పనిచేస్తుంది. పైగా ఇతర సెర్చ్ ఇంజన్లలో లేని కొన్ని సెట్టింగ్స్‌ను కూడా ఇది యూజర్లకు అందజేస్తుంది.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×