E-Paper
Advertisement

Techie Drowned: చావు అంచున ఉండి టార్చ్‌లైట్‌తో పిలిచాడు: నోయిడా టెక్కీ మృతిలో సంచ‌ల‌న‌ నిజాలు!

Techie Drowned: చావు అంచున ఉండి టార్చ్‌లైట్‌తో పిలిచాడు: నోయిడా టెక్కీ మృతిలో సంచ‌ల‌న‌ నిజాలు!
Advertisement

Techie Drowned: నోయిడాలో చోటుచేసుకున్న ఒక విషాదకర ఘటన వ్యవస్థల నిర్లక్ష్యాన్ని, మానవత్వపు మృత్యువును కళ్లకు కడుతోంది. దట్టమైన పొగమంచు ప్రాణసంకటంగా మారి ఒక యువ టెక్కీని బలితీసుకోగా, సాయం కోసం అతను చేసిన ఆర్తనాదాలు అధికారుల చెవులకు చేరకపోవడం విచారకరం. సుమారు రెండు గంటల పాటు మృత్యువుతో పోరాడి, కళ్లముందే పోలీసులు ఉన్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఆ యువకుడు జలసమాధి అయిన తీరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాజాగా ఈ ఘటనలో మరిన్ని దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

తండ్రి ఆవేదన:

“నా కొడుకు సాయం కోసం ఏడుస్తున్నా అక్కడ ఉన్న జనం కేవలం చూస్తూ నిలబడ్డారు, కొందరైతే వీడియోలు తీశారు” అని తండ్రి రాజ్‌కుమార్ మెహతా కన్నీరుమున్నీరయ్యారు. కారు డ్రైనేజీలో పడిపోయిన తర్వాత యువరాజ్ దాని పైకప్పు మీదకు ఎక్కి సుమారు రెండు గంటల పాటు (అర్ధరాత్రి 12 నుండి 2 గంటల వరకు) సాయం కోసం అరిచాడు. కారు మునిగిపోకుండా ఉండేందుకు తన శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూనే ఉన్నాడని యువ‌రాజ్ తండ్రి వాపోయారు. దట్టమైన పొగమంచు వల్ల తాను ఎక్కడున్నానో ఎవరికీ కనిపించకపోవడంతో, తన ఫోన్ టార్చ్‌లైట్‌ వేసి రక్షక సిబ్బందికి సంకేతాలు ఇచ్చాడని తెలిపారు.

Advertisement

“అక్కడ వందలాది మంది ఉన్నా, పోలీసులు వెనకాడుతున్నా.. మోనిందర్ అనే ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ మానవత్వాన్ని చాటుకున్నాడు. తన నడుముకు తాడు కట్టుకుని ఆ లోతైన డ్రైనేజీలోకి దూకి యువరాజ్‌ను కాపాడే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే జరగకూడని నష్టం జరిగిపోయింది.” అని క‌న్నీరుమున్న‌ర‌య్యీరు.

ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో నోయిడా అథారిటీ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు ఒక జూనియర్ ఇంజనీర్‌ను విధుల నుండి తొలగించారు. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ భద్రత, లైటింగ్ పర్యవేక్షించాల్సిన ఇతర అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆ భూమి ఎవరికి కేటాయించారు? అక్కడ బారికేడ్లు ఎందుకు లేవు? అనే అంశాలపై సమగ్ర విచారణకు ఆదేశించారు.

Advertisement

Read Also: “కాపాడమని రెండు గంటలు అరిచినా.. చూస్తూ నిలబడ్డారు”: నోయిడా డ్రైనేజీలో టెక్కీ మృతి!

 

 

Related News

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

రాత్రి నూడుల్స్.. ఉదయానికి శవాలు.. ఒకే కుటుంబంలో 5 గురు మృతి!

ఈ నెలలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. ఆ రెండు అంశాలపై వాడీ వేడీ రచ్చ!

ఢిల్లీలో వీడని సస్పెన్స్.. అభిజిత్ దీప్కే ఆచూకిపై గందరగోళం.. నేహా బోరా తీవ్ర ఆరోపణలు!

బీజేపీ అగ్రనేతకు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిన ఎల్.కే. అద్వానీ.. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే?

స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌ టెన్షన్‌కు ఇక చెక్.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం?

ప్రపంచాన్ని సైతం కదిలించిన చరిత్ర.. అక్టోబర్ 17 ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా..?

Big Stories

Advertisement
×