E-Paper
Advertisement

Congress : రాతలతో రోత.. దీని వెనుకున్నది ఆ రెండు పార్టీలేనా?

Congress : రాతలతో రోత.. దీని వెనుకున్నది ఆ రెండు పార్టీలేనా?
Advertisement

అధికార పార్టీకి చెందిన మంత్రులను కొందరు కావాలనే టార్గెట్ చేసినట్టు తెలుస్తున్నది. అభివృద్ధి విషయంలో రేవంత్ సర్కారు విమర్శలకు తావివ్వకుండా ముందుకు వెళ్తున్నది.ఓవైపు మేడారం జాతర డెవలప్మెంట్‌తో పాటే అక్కడకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, దీనికి తోడు నిన్న కేబినెట్ భేటిని సైతం తొలిసారిగా హైదరాబాద్ వెలుపల నిర్వహించి ఏ ప్రభుత్వమూ చేయని సాహసాన్ని రేవంత్ ప్రభుత్వం చేసింది. మరోవైపు కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలతో పాటు మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.వరుసగా సంచలన నిర్ణయాలు తీసుకుంటూ సీఎం రేవంత్ ప్రతిపక్షాలకు షాకుల మీద షాకులు ఇస్తున్నారు.

కావాలనే టార్గెట్ చేశారా?

ప్రభుత్వం అభివృద్ధి పనుల మీద దృష్టి సారించగా.. ప్రతిపక్షాలు మాత్రం విమర్శించడానికి తమకు చాన్స్ ఎప్పుడు దొరుకుతుందా? అని ఎదురుచూస్తున్నట్టు తెలుస్తున్నది. ఎందుకంటే ఇటీవల ఓ మంత్రి మీద అసత్య కథనం ఓ న్యూస్ చానెల్‌లో రాగా.. పెద్దఎత్తున ప్రతిపక్ష బీఆర్ఎస్ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసింది. ఓ మహిళా ఐఏఎస్‌‌, మంత్రిని కించపరిచేలా కథనాలు, అసత్య ప్రచారం చేసిన చానెల్ జర్నలిస్టుల మీద పోలీసులు చర్యలు తీసుకోవడంతో వారికి మద్దతుగా బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తాజాగా మరో పత్రికలో మరో మంత్రికి వ్యతిరేకంగా బొగ్గు గనుల వ్యవహారంలో కుంభకోణం అంటూ కథనం రావడంతో సదరు మంత్రి మీడియా ముఖంగానే ఫైర్ అయ్యారు. ఒడిశాలోని నైని బ్లాక్ నుంచి బొగ్గు రవాణా టెండర్లలో స్కామ్ అని రావడంతో నిరూపించాలని సదరు మంత్రి జర్నలిస్టులను ప్రశ్నించిన విషయం తెలిసిందే.

మున్సిపల్ ఎన్నికల ముందు డీఫేమ్ చేయాలనేనా?

Advertisement

ఫిబ్రవరి నెల మొదటివారంలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ప్రభుత్వం ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికార కాంగ్రెస్.. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ ఇతర పార్టీలు ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారని తెలుస్తున్నది. రిజర్వేషన్ల వారీగా ముందే అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో బిజీగా ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే అధికార పార్టీకి చెందిన మంత్రులపై నెగెటివ్ ప్రచారం జరిగితే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి సీట్లు తగ్గుతాయని ప్రతిపక్ష పార్టీలు ప్లాన్ ప్రకారమే ఇదంతా చేస్తున్నట్టు సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతున్నది.

AP liquor scam Updates: ఏపీ లిక్కర్ స్కామ్.. ఈసారి ఈడీ వంతు.. ఎంపీ మిథున్ రెడ్డికి నోటీసులు

Advertisement

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మంత్రులపై వస్తున్న కథనాలపై ముందే స్పందించడం, మీడియాకు లీకులివ్వడం, పెద్దఎత్తున ప్రచారం చేయడం చూస్తుంటే వీరే కావాలని నెగెటివ్ ప్రచారం చేస్తుండవచ్చని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీకి చెందిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బొగ్గు గనుల శాఖా మంత్రిగా ఉన్నారు. స్కాం జరిగితే ఆయనకు తెలుస్తుందిగా.. ఆయన ఎందుకు దీనిపై స్పందించడం లేదని కూడా పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రమంత్రి ఇదే విషయంపై స్పందించాలని పలువురు అధికార పార్టీ నేతలు కోరుతున్నారు. ఎన్నికల్లో సీట్ల కోసం ప్రభుత్వం, మంత్రులపై విషం చిమ్ముతారా?అని కాంగ్రెస్ శ్రేణులు ఫైర్ అవుతున్నారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద కుట్రలు చేయడం మానుకోవాలని హితవు పలుకుతున్నారు.

Related News

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

సీఎం ఛాన్స్ వస్తే.. ఆ దేవుడు కూడా ఆపలేడు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Big Stories

Advertisement
×